కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆజాద్ రాజీనామాపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైనా శైలిలో స్పందించారు.
'ఇప్పటికైనా గులాం నబీ ఆజాద్ కు ఆజాదీ లభించింది. నెహు వంశం గులామీ నుండి స్వేచ్ఛ పొందారు. ధైర్యంగా నిర్ణయం తీసుకున్నందుకు శుభాకాంక్షలు' అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీటర్ లో తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేతల్లో గులాంనబీ అజాద్ ఒకరు. 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనువించిన ఆయన పార్టీ నుండి బయటకి పొతు కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించారు.
కాగా, విజయసాయి రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలపై కాంగ్రెస్ పార్టీ ఆక్రమంగా కేసులు పెట్టి కొన్ని నెలల పాటు జైలు ఉంచింది అందరికి తెలిసిందే. బహుశ అందుకోసమే విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కల్లోలం ఆనందాన్ని ఇస్తున్నట్లు కనపడుతోంది.