విశాఖ నగర పాలక సంస్థ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5 నుంది విశాఖ కార్పోరేషన్ పరిధిలో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లుగా జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అంతా దీన్ని తప్పక పాటించాలని సూచిస్తున్నారు.
ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులను వినియోగించాలని కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
కాగా ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచులే ముద్దు అంటూ ఏకంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున, కమిషనర్ లక్ష్మీషా రైతు బజార్ల వద్దకు, జనాల వద్దకు వెళ్ళి మరీ వారిలో అవగాహన కలిగిస్తున్నారు. ఈ నెల 5 తరువాత ఎవరైనా ప్లాస్టిక్ సంచులను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు కూడా చెబుతున్నారు.
నో ప్లాస్టిక్ అంటూ విశాఖలో చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని పర్యావరణవేత్తలు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. ఇది మహోద్యమమై సాగాలని పిలుపు ఇస్తున్నారు.