డ్రాప్ట్. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు జాబితాకు సంబంధించి డ్రాప్ట్ ఇచ్చారు. అప్పుడు తిరుపతిలో కలెక్టర్ నేతృత్వంలో రెండుసార్లు సమావేశాలు జరిగాయి. ఒక్కసారి జాబితా అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత ఎవరేం చేయలేరు.
డిగ్రీ చదవని వాళ్లు, అలాగే టీచర్స్ కాని వారికి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయనే రగడ మొదలైంది. వీటిని కాసేపు పక్కన పెడితే… ఓ కీలక అంశపై ఎందుకని ఈ ఉపాధ్యాయ, వామపక్ష సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పోరాటం చేయరో అర్థం కావడం లేదు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం ఏ అర్హతలూ అవసరం లేదా? అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఎంతో ముఖ్యమైన ఈ అంశంపై వారెందుకని ఫైట్ చేయడం లేదు. అలాగే బోగస్ ఓట్లపై నోరు మెదపకూడదని ఎవరూ అనడం లేదు.
తాజాగా పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల నమోదు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. కనీసం కాలేజీ గడప తొక్కని వారికి కూడా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటు వుండడం ఏంటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఓటర్ల గుర్తింపులో అక్రమాలు బయటపడ్డాయని వారు అంటున్నారు. ఈ మేరకు ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు వామపక్ష, టీడీపీ నేతలు చెబుతున్నారు.
బోగస్ ఓటర్ల నమోదుపై ఫిర్యాదు, వాటి తొలగింపును అందరూ స్వాగతించాల్సిన అవసరం వుంది. అలాగే మన ఎన్నికల వ్యవస్థలోని ప్రధాన లోపంపై ఏ ఒక్కరూ పోరాటం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీచరే కాని వ్యక్తి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటరు అవుతారు? అలాగే డిగ్రీ చదవని వ్యక్తి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటరు జాబితాలో ఎలా పేరు నమోదు చేసుకుంటారనే ప్రశ్న సబబే. ఇదే సందర్భంలో కీలక అంశం గురించి మాట్లాడకపోవడం అన్యాయమే.
అసలు గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి మాత్రం ఈ అర్హతలు లేకపోవడంపై ఎందుకని ఎవరూ ప్రశ్నించడం లేదు. గ్రాడ్యుయేట్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు డిగ్రీ, అలాగే ఉపాధ్యాయులే అయి వుండాలనే నిబంధన ఎందుకు లేదు? పైగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైస్కూల్ పని చేసే ఉపాధ్యాయులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు. సెకెండ్ గ్రేడ్ టీచర్స్‌కు ఓటు హక్కు కూడా వుండకపోవడం విచిత్రం. పోటీ చేసే అభ్యర్థుల అర్హతలపై నేతలెందుకని పోరాటం చేయరో ఎవరికీ అర్థం కాదు.