ఒకవైపు ధర్నా.. మరోవైపు కవితకు ఈడీ నోటీసులు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 10 తేదీన ఢిల్లీకి రావాలని నోటీసుల్లో తెలిపింది. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 10 తేదీన ఢిల్లీకి రావాలని నోటీసుల్లో తెలిపింది. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. గ‌తంలో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి కవితను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. 

మ‌రోవైపు మార్చి 10న ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌.. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా రిజర్వేషన్ల  కోసం తెలంగాణ‌ జాగృతి ఆధ్వ‌ర్యంలో దీక్ష చేప‌ట్టాల‌ని క‌విత ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం ఇవాళ ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ లోపే ఈడీ నుంచి నోటీసులు రావ‌డం కీల‌కం మారింది.