అధికారంలోకి వచ్చిన లోకేశ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. లోకేశ్ మంత్రి అయినప్పటికీ, అనధికార సీఎం అని టీడీపీ నేతలు పిలుచుకుంటుంటారు. లోకేశ్ చర్యలు కూడా తానే సీఎం అనే లెవెల్‌లో వుంటాయి. మంగళగిరిలో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు లోకేశ్ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రజాదర్బార్ చేపట్టారు.
లోకేశ్ దృష్టికి పెద్ద ఎత్తున సమస్యలు వెల్లువెత్తుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన దృష్టికి మెయిల్ ద్వారా కూడా సమస్యలు తీసుకురావాలని, తానే స్వయంగా చూసి, పరిష్కారం చూపుతానని లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా [email protected] అనే మెయిల్ ఐడీ ఇచ్చారు. దీంతో ఆయనకు మెయిల్‌లో భారీగా ప్రజానీకం సమస్యలను తీసుకెళుతోంది.
లోకేశ్ మెయిల్‌కు ఎవరైనా సమస్యలు తెలియజేస్తే… వెంటనే ఆటోమేటిక్ వస్తుంది. అది ఏంటంటే…
“మీ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు!! అతి త్వరలో మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది” అని. దీంతో ఫిర్యాదుదారు మొదట తెగ సంతోషపడతారు. ఇక తమ సమస్య పరిష్కారం అవుతుందని. కానీ అసలు విషయం ఏంటంటే.. రోజులు గడవడమే తప్ప, ఎలాంటి పరిష్కారం దొరకదని తెలుస్తుంది. ఈ విధంగా తమను వంచించడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంతో ఆశతో, నమ్మకంతో లోకేశ్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లామని గుర్తు చేస్తున్నారు.
చివరికి మోసపోయామని వాపోతున్నారు. లోకేశ్‌కు ఫిర్యాదు చేస్తే, ఎప్పటికీ పరిష్కారం లభించదని అర్థమవుతోందని ఆయనకు మెయిల్ చేసిన వారు చెబుతున్నారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, లోకేశ్ చూపుతున్న పరిష్కారం ఏదీ లేదని విమర్శిస్తున్నారు.
నువ్వేదో టెస్ట్ మెయిల్ పంపుంటావ్. దానికేం పరిష్కారం ఇవ్వాలి నాయన?
😂
All this kind of jimmiks useful for SM and impact neutral people . issues ha to solved . if it is not solved at collector level means , it is either political people involved or it is the court .
only CMRF requests will be resolved by CM .
Nannu CM cheyyamani email chesaanu, ఎంతో ఆశతో, నమ్మకంతో లోకేశ్ దృష్టికి తీసుకెళ్లా, రోజులు గడవడమే తప్ప, ఎలాంటి పరిష్కారం దొరకదని అర్థమవుతోందని చివరికి మోసపోయామని వాపోతున్నా