ఏపీలో సాగుతున్న అరాచక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ నెల 24న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడతామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ధర్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అయితే ఢిల్లీ ధర్నాకు సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం ఇవాళ అప్‌డేట్ ఇచ్చింది.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, అలాగే పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనాలని కోరారు. వైఎస్ జగన్ ఆదేశాలుగా అధిష్టానం పేర్కొంది. పార్టీ నాయకులకు పంపిన ఈ మెసేజ్‌లో మరో కీలక నోట్ కూడా వుంది.
సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని వసతి, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇటీవల ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నామని, ఇప్పుడు చేతల్లో ఏమీ లేదని కొందరు వైసీపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ధర్నా అంటే, మిగిలిన నాయకులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అందరూ రావాలని కోరిన నేపథ్యంలో ఎంత మంది ఢిల్లీకి వెళ్తారో చూడాలి.
డ్రామా బావుంది
MLA, ఎంపీ లంటే ఎక్కువ కౌంట్ లేదు, అందుకే అందర్నీ వచేయమనుంటారు.
SOnta rastram lo ne dikku ledu ra ante anniya Delhi potada?
అసెంబ్లీ సమావేశాలు ఎగొట్టడానికి అనుకుంట
వీడికి చిప్ దొ-బ్బినట్లుంది !!
ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నాలలో, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసాడు. విపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరో వీధి రౌడీలు కొట్టుకు చస్తే, ప్రతిపక్షాన్ని రాజకీయ కక్షగా అవమానించే ఆలోచనలో రాష్ట్రాన్నే బద్నామ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు జగన్. పరిణామాలు తీవ్రత పోను పోనూ తెలిసివొస్తాయి.
ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నాలలో, రాష్ట్రాన్ని సర్వ నాశనం_చేసాడు. విపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరో వీధి_రౌడీలు_కొట్టుకు_చస్తే, ప్రతిపక్షాన్ని రాజకీయ_కక్షగా_అవమానించే ఆలోచనలో రాష్ట్రాన్నే_బద్నామ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు జగన్. పరిణామాలు_తీవ్రత పోను పోనూ తెలిసివొస్తాయి.