కష్టాల్లో గ్రామాలు.. పవన్ కళ్యాణ్ రావాలి

పవన్ కళ్యాణ్ ఆంధ్రలో మంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి ఒకటే హడావుడి. ఉప ముఖ్యమంత్రి అని. అంతే మంత్రి అని కాదు. జనసేన సోషల్ మీడియా, పార్టీ పదే పదే ఎక్కడ ఎలా…

పవన్ కళ్యాణ్ ఆంధ్రలో మంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి ఒకటే హడావుడి. ఉప ముఖ్యమంత్రి అని. అంతే మంత్రి అని కాదు. జనసేన సోషల్ మీడియా, పార్టీ పదే పదే ఎక్కడ ఎలా చెప్పాల్సి వచ్చినా అదే పదజాలం. ఉపముఖ్యమంత్రి.. ఉపముఖ్యమంత్రి అంటూ. పొరపాటున కూడా ఎక్కడా ఫలనా మంత్రి అని మాత్రం కాదు. అలాగే డైలీ ఫొటోలు వీడియోలు.. ఫలాన సమావేశం.. ఫలానా రివ్యూ మీటింగ్ అంటూ. పదవి చేపట్టిన తరువాత వరుసగా మూడు నాలుగు రోజులు మీటింగ్ లు నిర్వహించారు. రెండు రోజులు పిఠాపురం వెళ్లి తెగ హడావుడి చేసారు. ఎన్నికల ముందు మాదిరిగా బహిరంగ సభలు, బహిరంగ ప్రమాణ స్వీకారాలు చేసారు.

అంతే.. ఇప్పుడు అంతా సైలెంట్.. సైలెంట్.. సైలెంట్…

మొన్నామధ్య పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ విజయవాడ వెళ్లి వచ్చారు. తరువాత పవన్ అల్ట్రా మోడరన్ గా తయారై, ఎయిర్ పోర్ట్ లో భార్యా సమేతంగా కనిపించారు.

ఆ తరువాత మరి పవన్ ఎక్కడ వున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. మరి కీలకమైన మూడు మంత్రిత్వ శాఖలను ఎవరు అజమాయిషీ చేస్తున్నారో. ఏం జరుగుతోందొ తెలియదు. వర్షాలు పడుతున్నాయి. పంటల సీజన్. గ్రామాల పరిస్థితి ఎలా వుందో చూడాల్సిన బాధ్యత ఆయనదే. ఈ వర్షాల సీజన్ లో గ్రామాల పారిశుధ్య బాధ్యత ఆయన మంత్రిత్వ శాఖదే. ఈ సీజన్ లో గ్రామాల రోడ్ల పరిస్థితి సమీక్షించాల్సిన బాధ్యత ఆయనదే. తరచు రివ్యూ మీటింగ్ లు నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేయల్సి వుంది.

తెలుగుదేశం పార్టీ అంటే బాగా అభిమానం వున్న, కీలకమైన ఓ అధికారిని ప్రత్యేకంగా తీసుకువచ్చి ఆయన తరపున అక్కడ నియమించారు చంద్రబాబు. అందువల్ల ఇక పవన్ కు పెద్దగా శ్రమ లేకుండా చేసే ప్రయత్నం చేసినట్లుంది. ఆ శాఖలు అన్నీ ఆయన చూసుకుంటారు. ఈయన ఉపముఖ్యమంత్రిగా వుంటారు… అంతా ఉభయకుశలోపరి అన్నట్లు వుంటుందేమో?

సరే, ఇంతకీ ఇప్పుడు ఉపముఖ్యమంత్రి కదా, వినుకొండ హత్య మీద పార్టీ అభిప్రాయాన్ని ప్రకటించాలి కదా. పార్టీ బాధ్యులు ఎవరూ ప్రకటించలేదు. ఇది వైకాపా- తేదేపా మధ్య వివాదం, మనకెందుకు అనుకున్నారా? కానీ ఉపముఖ్యమంత్రి అంటే సిఎమ్ తరువాత అంతటి వారు. రాష్ట్రం పాలన బాధ్యతలో సగపాలు. అందువల్ల ఆయన అభిప్రాయం ఆయన చెప్పాలి కదా. మరి అది ఎక్కడ? అసలు ఉపముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ?

ఒక పక్క అసంపూర్తిగా వున్న రెండు సినిమాలు పూర్తి చేస్తారు అనే గ్యాసిప్ లు వున్నాయి. మరోపక్క మంగళగిరి లో లేకుంటే అసలు ఓ వార్త కానీ ఓ సమాచారం కానీ వుండడం లేదు. రాజకీయంగా ఇది పవన్ కు అంత కరెక్ట్ గా వుండదేమో? ఆయనే ప్లాన్ చేసుకోవాలి.

25 Replies to “కష్టాల్లో గ్రామాలు.. పవన్ కళ్యాణ్ రావాలి”

  1. అవును వాడు సైలెంట్ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లు ఎదో ఒక పని సైలెంట్ గా చేసుకుంటూ పోతే ఎలా??? ప్రతి నిమిషం ఎం చేస్తున్నాడో నాకు అప్డేట్ ఇవ్వాలి. ప్రతీది లైవ్ పెట్టాలి, టీవీ, సోషల్ మీడియా కి పిన్ టు పిన్ డీటైల్స్ ఇవ్వాలి. ఎవరో పర్సనల్ వయోలెన్స్ కి దిగితే మనం బురద జల్లుతాం, వాడోచ్చి వివరణ ఇవ్వాలి. సినిమా చేసుకుంటూన్నడేమో అని అనుమానం రేకెత్తించి విషం కక్కుతాం.. వాడు వచ్చి తుడవాలి. నేను ఊహించినట్లు ఎదుటి వాడు ఉండాలి, అలోచించాలి. అంతే.!

  2. మన అన్న ఒక తింగరి ముఖం వేసుకొని ఎర్రి గా నవ్వులు నవ్వుతూ. బటన్ నొక్కడం తప్ప దేనికైనా బయటికి రానే లేదు .అయిన మనకి ఎలాంటి సమస్య లేదు అని. ఈ. నెల లోనే అయిపోవాలి

  3. అన్ని సమస్యలు ఈ నెల రోజుల్లోనే బయటకు వస్తున్నాయి . సేహభాష్

  4. Mari jagan anna kinda 4 deputy cm unde kada… sakala Shaka mantra tappa enndaina oka minister press meet peettdam Kani… review meeting conduct cheyatam Kani.. last 5 years lo manam chusama ..? Albittiri appanna velli delhi lo strike chestadanta kada.. cheyamanu .. Anni solve ipotai

        1. ప్యాలస్ లో దోమలు కుట్టకుండా వినాశం రాత్రి అంతా కూడా దోమల్ బ్యాట్ పట్టుకొని ప్యాలస్ అంత తిరుగుతూనే వుంటాడు.

          అన్న మీద దోమ కూడా వాలనివ్వని గొప్ప తమ్ముడు.

      1. పోనీలే అన్న శ వమ్ దొరికితేనే రాజకీయం చేస్తాడు……. నీ అన్న బాబు మాత్రం రాజకీయం చేయడం కోసం ఎంతోమందిని శ వాలు చేస్తాడు. ఉదా : పుష్కారాలలో 29, మొన్నా మధ్యన ఇరుకు సందులలో సభలు పెట్టి ఎంతోమందిని శ వాలు చేశాడు

    1. Bro

      Ilanti sruthiminchina noti durusu vallane YCP 5-10% vote share loss aipoyindi.

      YCP leaders ki ippudu jnanodaya ayyindi.

      But meeku lanti vallaki eppudu thelustundo.

  5. ఆంధ్రాలో జరిగే ఘోరాలని అరికట్టండి – ఆంధ్ర ప్రజలు

    మాకు ఒక్క ఆరు నెలలు టైం ఇవ్వండి – స్నేక్ బాబు

    అసలు వాడెవడు, వాడికి మేము ఓటు వెయ్యలేదు, వాడు ప్రభుత్వంలో, పదవిలో లేడు – ఆంధ్ర ప్రజలు

  6. 5 ఏళ్లు పార్టీ , ప్యాలస్ పులకేశి గాడు ప్యాలస్ లో కూర్చుని ఏమో చేశాడో , గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి గారు ఎప్పుడైనా అడిగార,

    ఇప్పుడు ప్యాలస్ పులకేశి ప్రెసర్ రిలీఫ్ బాల్స్ పిసుక్కుంటూ వుంటే అతన్ని బయటికి రా అని గోలా.

  7. జెనసన్నాసులారా మీరంతా సైలెంట్ గా వుండండి.

    మనవాళ్ళు బాగా సంపాయించుకోండి. ఉల్లిగడ్డలో ఎన్ని పొరలు ఉన్నాయో ప్రతొక్క గ్రామంలో చూపించండి.

    జరిగే ఘోరాలన్నీ తెగుల దేశం అకౌంట్ లోకి వెళ్తాయి.

    మనకి మోడీ వున్నాడు…నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒంటరిగా మనమే సీఎం.

    అప్పుడు మనమేంటో చూపిద్దాము.

    మీరేమి మాట్లాడొద్దు…నేనేమి మాట్లాడను.

    బురద అంత పచ్చ బిళ్ల గాళ్ళకే పూయ్యండి.

  8. బ్లీచింగ్ పౌడర్ కే డబ్బులు లేవు…

    బాబు అయితే గ్రామానికి 500 రూపాయలు ఇచ్చాడు.

    ఇప్పుడు నేను మండలానికి 500 రూపాయలు ఇస్తాను.

    చూసుకోండి నా తడాకా…

    1. నీ కామెంట్ల వల్లనే మొత్తం జనాలు ప్యాలస్ పులకేశి కి గుండు కొట్టారు.

      ఇలానే కొనసాగించి, ప్యాలస్ పులకేశి కి వున్న ఇప్పటి విష్ణువు నిలువు నామాలు 11 నుండి శివుడి అడ్డ నామాలు 3 సీట్లు కి తెప్పిస్తావు, ఈ సారి.

      చంద్రబాబు కి నువ్వు గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి తో కలిసి చేసిన కోవర్ట్ సహాయం చాల గొప్పది.

  9. ఏదీ , లాస్ట్ 5 years లో జగన్ వెళ్లి అందరికి సహాయం చేసినట్లా??

Comments are closed.