విశాఖలో ఫిల్మ్ స్టూడియో?

టాలీవుడ్ ఏపీలో సైతం విస్తరించాలంటే స్టూడియోలు ఉండాలి. చిత్ర నిర్మాణాలు విరివిగా జరగాలి. ఏపీ మూలాలు ఉన్న వారే టాలీవుడ్ లో నూటికి తొంబై శాతం ఉన్నా ఏపీలో మాత్రం చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోలేదు.…

టాలీవుడ్ ఏపీలో సైతం విస్తరించాలంటే స్టూడియోలు ఉండాలి. చిత్ర నిర్మాణాలు విరివిగా జరగాలి. ఏపీ మూలాలు ఉన్న వారే టాలీవుడ్ లో నూటికి తొంబై శాతం ఉన్నా ఏపీలో మాత్రం చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోలేదు. గత రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ ఏపీలో స్థిరపడేలా చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వైఎస్సార్ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు భూములు ఇచ్చేందుకు సైతం ఆసక్తి చూపారు.

ఇదిలా ఉంటే తాజాగా చూస్తే భూములు ఖరీదు అయిపోయాయి. వాటిని నామమాత్రం ధరలకు ఇవ్వలేని పరిస్థితి. విశాఖ వంటి చోట్ల భూదందాలు ఎక్కువ అయిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భూములను గతంలో మాదిరిగా ఇచ్చేందుకు ప్రభుత్వాలు కూడా ఆలోచించే నేపధ్యం ఉంది.

అలాగే ఏపీ రాజకీయం సంకుల సమరంగా మారిన క్రమంలో ఎవరికి భూములు ఇచ్చినా కుల ముద్ర కూడా కూడా పడుతుంది. ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. దాంతో ప్రభుత్వాల నుంచి ఉదారంగా భూములు దక్కే అవకాశాలు లేవు. విశాఖ లాంటి చోట్ల భూములు కూడా పెద్ద ఎత్తున లేవు ఆ కొరత పట్టి పీడిస్తోంది.

దీంతో టాలీవుడ్ కి చెందిన కొందరు నిర్మాతలు ఒక గ్రూప్ గా ఏర్పడి విశాఖలో కానీ గోదావరి జిల్లాలలో కానీ అనుకూలమైన భూములను సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆ భూములలో స్టూడియోను ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. విశాఖలో స్టూడియో నిర్మాణానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

విశాఖ మెగా సిటీగా ఉన్న నేపధ్యంలో భవిష్యత్తులో కీలకమైన డెస్టినేషన్ గా ఉంటుంది అని భావిస్తున్న క్రమంలో విశాఖలోనే స్టూడియో నిర్మాణం జరుగుతుందని అంటున్నారు. ఈ ఆలోచన ఆచరణకు నోచుకుంటే ఏపీలో టాలీవుడ్ కార్యకలాపాలు విస్తరణకు మార్గం సుగమం అవుతుందని అంటున్నారు.

One Reply to “విశాఖలో ఫిల్మ్ స్టూడియో?”

Comments are closed.