తెలుగు మహిళ గీత మారదా…?

తెలుగుదేశం అధినాయకత్వం వద్ద తన పలుకుబడి ఏమిటో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు రుజువు చేసుకున్నారు.  Advertisement విజయనగరం శాసనసభ స్ధానం నుంచి ఎమ్మెల్యేగా ఆయన 2024 ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు.…

తెలుగుదేశం అధినాయకత్వం వద్ద తన పలుకుబడి ఏమిటో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు రుజువు చేసుకున్నారు. 

విజయనగరం శాసనసభ స్ధానం నుంచి ఎమ్మెల్యేగా ఆయన 2024 ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఏడున్నర పదుల వయసులో ఆయన మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

ఇక 2014లో విజయనగరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీత రాత ఈసారి కూడా మారదని ఈ పరిణామాలలో అర్ధమవుతోంది అంటున్నారు. గడచిన నాలుగేళ్లుగా ఆమె సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి మరీ విపక్ష  పాత్రను పోషించింది. 

ఆ మద్యన చంద్రబాబును మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలుసుకుని టిక్కెట్‌ కోసం హామీ దక్కించుకుంది అని ప్రచారం సాగింది. అప్పట్లో అశోక్‌ను ఎంపీగా పోటీ చేయించాలని బాబు ఆలోచించారు. కానీ అశోక్‌ పంతం నెగ్గింది. దాంతో గీతకు టిక్కెట్‌ హుళక్కి అయింది అంటున్నారు. 

అశోక్‌ బంగ్లా రాజకీయాలకు అక్కడ ఉన్న టీడీపీ పార్టీ ఆఫీసుకు దూరంగా ఉన్న మీసాల గీత ఇపుడు ఏం చేయబోతున్నారు అన్నదే చర్చగా ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన గీత బలమైన తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఆమె వైసీపీలో చేరుతారా అన్న చర్చ కూడా సాగుతోంది.