ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. తొమ్మిది నెలలుగా ఇదిగో అదిగో.. విజయదశమికి, దీపావళికి, సంక్రాంతికి, శివరాత్రికి అంటూ నామినేటెడ్ పదవుల సంగతిని నానుస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎట్టకేలకు ఒక స్పష్టత ఇచ్చారు. ఉగాది నాడు కొన్ని నామినేటెడ్ పదవుల పందేరం ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా.. మహానాడు నిర్వహించేలోగా.. మొత్తం అన్ని నామినేటెడ్ పదవులను కూడా భర్తీచేసేస్తామని వెల్లడించారు. ఎంతో కాలంగా పార్టీ పదవుల మీద ఆశలు పెంచుకుంటున్న తెలుగుదేశం, కూటమి పార్టీల నాయకులకు ఇది చాలా పెద్ద శుభవార్తే అని చెప్పాలి.
ఎన్నికలు జరిగితే.. ఎమ్మెల్యేలుగా గెలిచి వైభోగం వెలగబెట్టేవాళ్లు కొద్దిమందే ఉంటారు గానీ.. వారి విజయం కోసం తమ సమయాన్ని, డబ్బును కూడా వెచ్చించి కష్టపడే వాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కష్టానికి విలువ ఇవ్వడానికే పాలకపక్షం నామినేటెడ్ పదవులను కేటాయిస్తుంటుంది. అయితే.. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా.. చంద్రబాబునాయుడు కొన్నింటిని భర్తీ చేసినప్పటికీ.. వందల వేల నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకుండానే రోజులు నెడుతున్నారు.
ఇటీవల.. కొందరు ఎమ్మెల్యేలు తమ తమ సిఫారసులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారంటూ.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. కొందరు ఎమ్మెల్యేలు చేసే జాప్యానికి రాష్ట్రవ్యాప్త పోస్టులు కూడా ఇవ్వకుండా ఆపేయడం ఏం కరెక్టంటూ కార్యకర్తలు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. కసరత్తు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఉగాది నాటికి మార్కెట్ కమిటీలు అన్నింటినీ భర్తీ చేస్తూ జాబితా విడుదల అవుతుందని తెలుస్తోంది.
ఆ తర్వాత వీలైనంత త్వరలో సుమారు 60 కీలక కార్పొరేషన్లకు, 21 ఆలయాలకు పాలక మండలులను ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. మహానాడులోగా ఈ పోస్టుల పంపకం మొత్తం పూర్తిచేసేస్తాం అని చంద్రబాబు చెబుతున్నందున.. రాబోయే రెండునెలల్లో మొత్తం ఆ పర్వం అయిపోతుందని అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఒక డెడ్ లైన్ ప్రకటించి మరీ పోస్టులు భర్తీ చేయడం మంచిదే అంటున్నారు.
ప్రభుత్వం ఇప్పటికి రెండు విడతలుగా పదవులు పంచింది. మూడో విడత మాత్రం నాలుగు నెలలుగా జాప్యం జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో అనేక ప్రధానమైన శివాలయాలు ఉండగా.. ఈ ఏడాది శివరాత్రి పర్వదినం లోగా.. కనీసం ఆ ఆలయాల నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని కార్యకర్తలు భావించారు. కానీ చంద్రబాబు వాటి గురించి పట్టించుకోలేదు.
రాష్ట్రంలో మొత్తం 218 మార్కెట్ కమిటీలు ఉండగా.. ఈ విడతలో 50-60 వరకు భర్తీ కావొచ్చునని సమాచారం. రాష్టవ్యాప్త పోస్టులు అయిన కీలక కార్పొరేషన్లు సుమారు 60 దాకా ఉన్నాయి. వీటికి తెలుగుదేశం తరఫున కసరత్తు దాదాపుగా పూర్తయిందని.. జనసేన, బిజెపిలకు కేటాయించే సంఖ్యను బట్టి.. ఆ పార్టీ అధినేతలు ఇచ్చే జాబితాలలో మార్పులు లేకుండా పదవులు ప్రకటిస్తారని తెలుస్తోంది.
టీడీపీ గెలుపు కు కృషి చేసింది కార్యకర్తలు నాయకులు కాదు EVMలు.. So నామినేటెడ్ పోస్ట్లు భర్తీ చెయ్యకూడదు.. నేను 3 ఏళ్ళ తర్వాత
వస్తా అప్పుడు భర్తీ చేస్తా.. అంతవరకు అందరూ నాలా నిజాయితీ గా కళ్ళు మూసుకోండి.. సంజే
మరి నువ్వు కళ్ళు మూసుకుంటే బెంగళూరు లైలా అవిభావతో చెక్కేస్తే నిన్ను చక్కగాడిలా మీడియా ఎక్సపోజ్ చేస్తే ఆలోచించు కళ్ళుTERU కనీసం లైలా కోసమైనా..
చెక్కగాడు అని మీడియా ఎప్పుడో డిక్లేర్ చేసింది కదా.. లైలా ఏకంగా ప్యాలెస్ లోనే ర0కు నడుపుతుంటే ఇక లేచిపోవాల్సిన పనేముంది చెప్పు..
అవినాష్ మీద ఈనరోజు మంచి అఫిడవిట్ వేశారు సుప్రీం లో గురించి అర్థం అవుతుంది త్వరలో