ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వివాదం టీడీపీ- వైసీపీ కాస్త టీడీపీ- జూ. ఎన్టీఆర్ వివాదంగా మారిపోయింది. పేరు మార్పు గురించి చాలా మంది తమ సామాజిక నాయకులు మాట్లాడిన ఒక సైడ్ మాత్రమే మాట్లాడారు కానీ ఎన్టీఆర్ చాలా హుందాగా తన అభిప్రాయం చెప్పారు. ఎన్టీఆర్ అలా హుందాగా చెప్పాడమే టీడీపీ దృష్టిలో తప్పేంది.
ఎన్టీఆర్ ట్వీటర్ వేదికగా ఎన్టీఆర్- వైయస్ఆర్ ఇద్దరు నాయకులు గొప్ప వారు అంటూనే తన ఆవేదన చెప్పారు. కానీ ఎన్టీఆర్ ఆలా అనడం తోనే చంద్రబాబు అను'కూల' మీడియా తట్టుకోలేక డిబేట్లు పెట్టి మరి ఎన్టీఆర్ ను బూతులు తిట్టించారు. డైరెక్టుగా యూట్యూబ్ థంనైల్ లో టెంపర్ లేని బాద్ షా అంటూ అవమానకరంగా మాట్లాడారు.
ఇవాళ ట్వీటర్ వేదికగా ఎన్టీఆర్ అభిమానులు నారా చంద్రబాబు, అండ్ లోకేష్ ను ఉద్దేశిస్తూ #JrNTRFootNaraDogs అంటూ ట్వీటర్ లో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కారణం చంద్రబాబు కన్నా కూడా తన అను'కూల' మీడియా చేసిన ఓవర్ యాక్షన్ అని చెప్పుకొవాలి.
కొంత మంది టీడీపీ అభిమానులు టీడీపీ పార్టీ లోకేష్ చేతుల్లో నాశనం అవ్వడం చూసి తట్టుకోలేక ఎన్టీఆర్ ను సీఎం క్యాండిడేట్ చేయాలనీ చంద్రబాబు మీటింగ్స్ లోనే ఎన్నో సార్లు మోర పెట్టుకున్నా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీని బలిచేస్తున్నారు అనే అవేదన వారిలో ఉంది. ఇక ముందు టీడీపీలోని ఎన్టీఆర్ వర్గం మాత్రం నారా ఫ్యామిలీని అడుగు అడుగున నిలదీయబోతున్నట్లు ఆర్ధం అవ్వుతోంది.