ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతునే ఉన్నాయి. 'చంద్రబాబు అండ్ కో' దగ్గర ఉండి ఎన్టీఆర్ ను సీఎం పీఠం నుండి గెంటేసినా ఎప్పుడు మాట్లాడని వారందరూ కూడా కేవలం పేరు మార్పుకే నానా హంగమా చేస్తున్నారు.
తాజాగా సీనియర్ ఎన్టీఆర్ మనువడు సినీ హీరో జూ. ఎన్టీఆర్ ట్వీటర్ వేదికగా యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. ట్వీటర్ లో చాల హుందాగా ఎన్టీఆర్ పై ప్రేమను, వైయస్ఆర్ పై గౌరవని చూపిస్తూ ట్వీట్ చేశారు.
“ఎన్టీఆర్, వైయస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెట్టే గౌరవం వైయస్ఆర్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.