పీఏసీ చైర్మ‌న్ ఎన్నిక‌ను బ‌హిష్క‌రించిన వైసీపీ!

పీఏసీ (ప్ర‌జా ప‌ద్ధుల క‌మిటీ) చైర్మ‌న్ ఎన్నిక‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది. ఈ విష‌యాన్ని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర చ‌రిత్ర‌లో గ‌తంలో ఎప్పుడూ లేని…

పీఏసీ (ప్ర‌జా ప‌ద్ధుల క‌మిటీ) చైర్మ‌న్ ఎన్నిక‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది. ఈ విష‌యాన్ని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర చ‌రిత్ర‌లో గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా పీఏసీకి ఎన్నిక నిర్వ‌హించాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.

అందుకే ఎన్నిక‌ను తాము బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పెద్దిరెడ్డి తెలిపారు. 1965 నుంచి కూడా ప్ర‌తిప‌క్షానికే పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తున్నార‌ని పెద్దిరెడ్డి తెలిపారు. పార్ల‌మెంట్‌లో కూడా ప్ర‌తిప‌క్షానికి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని చ‌ట్టం చేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ప్ర‌తిప‌క్ష హోదా లేని బీజేపీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని పార్ల‌మెంట్‌లో ఇచ్చార‌న్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జాస్వామ్య దేశాల‌న్నింటిలో పీఏసీ చైర్మ‌న్ విష‌యంలో ప్ర‌తిప‌క్షానికే ఇస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఆప్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్లు వ‌చ్చిన త‌ర్వాత మాత్ర‌మే ఆ సంప్ర‌దాయాన్ని మార్చార‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో కుంభ‌కోణాల్ని బ‌య‌టికి తీసింది కూడా పీఏసీనే అన్నారు.

ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా బోప‌ర్స్‌, 2జీ స్ప్రెక్ట‌మ్‌, కోల్‌గేట్ స్కామ్‌ల‌ను కూడా పీఏసీనే బ‌య‌టికి తీసింద‌ని పెద్దిరెడ్డి తెలిపారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా లేకున్నా, ఆ పార్టీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చార‌ని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.

18 Replies to “పీఏసీ చైర్మ‌న్ ఎన్నిక‌ను బ‌హిష్క‌రించిన వైసీపీ!”

    1. కడుపు నిండిన సింహం ఆకలి వేసేంత వరకు కాళీ గా ఈగలు తొలుకుంటా కూర్చుంటుందంట….

      జగనన్న కూడా ఈ 5 సంవత్సరాలు కాళీ గానే ఉంటాడు….

  1. మీరు అసెంబ్లీ కి రారు మీకెందుకురా PAC పదవి ..

    ముందు అసెంబ్లీ రండి ,లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూచోండి సన్నాసుల్లారా…

  2. సిగ్గు అనేది ఉందా? చైర్మన్ అవ్వాలంటే నువ్వు ముందు మెంబెర్ గా గెలవాలి కదా రా ఎదవ!! ఎంత కాలం ఈ విధంగా bluff చేస్తూ బ్రతుకుతారు?? అయినా పారి పోవటం నీకు ఆ గొట్టం గాడికి షరా మామూలేగా!!

  3. అన్నిట్లోనూ దొంగ లెక్కలు రాసే పెద్దిరెడ్డి కి, బుల్రెడ్డి కి ప్రజా పద్దులు కమిటీ పోస్ట్ సూట్ కాదులే కానీ ముందు అక్రమ మద్యం పద్దులు చెప్పు..అక్రమంగా దోచేద్దామనుకున్న అసైన్డ్ భూముల పద్దులు చెప్పు..

  4. అన్నిట్లోనూ-దొంగ-లెక్కలు-రాసే-పెద్దిరెడ్డి కి-బుల్రెడ్డి కి ప్రజా-పద్దులు-కమిటీ-పోస్ట్-సూట్-కాదులే-కానీ-ముందు-అక్రమ-మద్యం-పద్దులు-చెప్పు..అక్రమంగా-దోచేద్దామనుకున్న-అసైన్డ్-భూముల-పద్దులు-చెప్పు..

  5. పి ఎస్ సి చైర్మన్ అవ్వాలంటే 18 సీట్లు రావాలి

    జగన్ కి ఎన్ని వచ్చినాయి 11.. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమౌతుందా !

Comments are closed.