పలాస పోరాటం ఫలించింది… సోంపేటకు షిఫ్ట్!

పలాస రైతులు అంతా ఒక్క త్రాటి మీదకు వచ్చి మా భూములు ఇవ్వమని చేసిన పోరాటం సక్సెస్ అయింది.

ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం అన్న మాటకు పర్యాయపదంగా శ్రీకాకుళం జిల్లాను చూడాల్సి ఉంటుంది. ఈ జిల్లా దశాబ్దాలుగా అదే వేదనతో రోదనతోనే ఉంది. ఇక్కడ నుంచే దేశం నలుమూలలా వలసలు విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారు అయినా వలస జీవులుగా శ్రీకాకుళం నుంచే కనిపిస్తారు.

శ్రీకాకుళంలో సారవంతమైన భూములు ఉన్నాయి. నదీ నదాలు ఉన్నాయి. పాలకులు చేయాల్సిందల్లా నదుల నీరు భూములకు పారించడం, వంశధార నాగావళి వంటి వాటిని ఆధునీకరించి అనుసంధానించి రైతుల పొలాలకు నీళ్ళు మళ్ళించడం.

దాని వల్లనే అసలైన అభివృద్ధి సాధ్యపడుతుందని మేధావులు అంటూంటారు. అయితే రైతుల భూములు తీసుకుని పారిశ్రామిక కారిడార్ల పేరుతో కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడం ద్వారా ఉన్న ఉపాధి పోతుంది, కొత్తగా దక్కేదీ ఉండదు అన్నదే అన్న దాతల ఆవేదన.

మాకు మా వ్యవసాయానికి చేయాల్సిన సాయం చేయి అందించి చేయండి అని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో పలాస వద్ద కార్గో ఎయిర్ పోర్టు అని ప్రభుత్వం ప్రతిపాదించింది. భూసేకరణ కోసం గత కొద్దీ నెలలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ రైతుల ఆందోళనలు నిరంతరాయంగా సాగడంతో అధికారులు కాస్తా వెనక్కి తగ్గారు.

అలా పలాస పోరాటం ఫలవంతం అయింది. కార్గో ఎయిర్ పోర్టు అయితే జిల్లాలోని సోంపేట మండలంలో ఏర్పాటు చేయాలని కొత్తగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. పలాస రైతులు అంతా ఒక్క త్రాటి మీదకు వచ్చి మా భూములు ఇవ్వమని చేసిన పోరాటం సక్సెస్ అయింది.

అయితే సోంపేటలో భూ సేకరణ ఏ విధంగా జరగనుంది అనేది చూడాలని అంటున్నారు. ఇక్కడ కూడా భూములు ఇచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నది తర్కించుకునే పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉపాధి కోసమే ఎయిర్ పోర్టు జిల్లాకు తెస్తున్నామని అంటున్నారు.

వ్యవసాయేతర భూములను తీసుకుని కార్గో ఎయిర్ పోర్టుకు ఎంత అవసరమో అంత మేరకే భూసేకరణ జరిపితేనే మేలు అన్న సూచనలు వస్తున్నాయి. అదే విధంగా జిల్లాలో సాగు నీటి పథకాలను పూర్తి చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకుంటే పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలోనే ఉపాధి కనిపిస్తుందని సూచనలు వస్తున్నాయి.

4 Replies to “పలాస పోరాటం ఫలించింది… సోంపేటకు షిఫ్ట్!”

    1. రైతులు అయితే లాభపడినట్టు, వ్యవసాయం చేయకుండా కౌలుకి ఇచ్చే వాళ్ళు నష్టపోయినట్టు

  1. భారత దేశం మొత్తం లో నష్టపరిహారం ప్రక్రియ చాలా నెమ్మది మరియు నష్టపోయిన వారికి పునరావాసం కూడా చాలా నెమ్మది. అందువలన అంత త్వరగా ముందుకూ రారు.

    నష్టపోయిన వారికి ఆ చుట్టుపక్కల వాళ్ళ నుండే ( వాళ్ళ ఆస్తుల 100 రెట్లు పెరుగుతుంది , ప్రాజెకు వలన) కనీసం 50 రెట్లు విలువ నేరుగా ఇప్పిస్తే , అందరూ వాళ్ళ పొలాలు తీసుకోమని ఎగబడతారు.

    1. ఒక ఎకరం విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్ లో ఒక లక్ష వుంది అనుకుంటే, ఆ పొలం ప్రభుత్వానికి ఇచ్చే వారికి కనీసం 50 లక్షలు ఇవ్వాలి. అలానే వారికి ఒక 20 ఏళ్లు వరకు ప్రభుత్వ ఆదాయ పన్నుల నుండి పూర్తిగా మినహాయించి వారికి ఆరోగ్య, చదువు ఫీసుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలి.

      అప్పుడు ప్రతి ఒక్కరు, ప్రభుత్వ ప్రాజకు లకి సొంత పొలాలు ఇవ్వడానికి కనీసం అడ్డు పడకుండా ఆగుతారు.

Comments are closed.