విశాఖను అలా పోల్చిన చంద్రబాబు

చంద్రబాబు విశాఖ పర్యటన చేశారు అంటేనే మెగా సిటీకి కొత్త పేర్లు పెడతారు. ఎన్నో రకాలుగా కితాబులు ఇస్తారు.

చంద్రబాబు విశాఖ పర్యటన చేశారు అంటేనే మెగా సిటీకి కొత్త పేర్లు పెడతారు. ఎన్నో రకాలుగా కితాబులు ఇస్తారు. విశాఖ మహా నగరం అని కూడా కొనియాడుతారు. విశాఖలో జరిగిన నావికా దళ విన్యాసాలను తిలకించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా మరోమారు విశాఖ గురించి మంచి మాటలే చెప్పారు. అంతే కాదు కొత్త పోలికనూ తెచ్చారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధాని అన్నారు. ముంబై సిటీ అన్ని విధాలుగా పరిపుష్టంగా ఉండబట్టే ఈ రోజు నంబర్ వన్ మహా నగరంగా నిలిచిందని గుర్తు చేశారు.

అటువంటి అవకాశాలు అన్నీ విశాఖకు సైతం ఉన్నాయని ఆయన అన్నారు. విశాఖ అతి పెద్ద ఆర్థిక రాజధానిగా మారుతుందని దృఢ విశ్వాసం ముఖ్యమంత్రి హోదాలో బాబు వ్యక్తం చేశారు. విశాఖను ఫార్మా ఐటీ హబ్‌గా ఆయన పేర్కొన్నారు. ఎన్నో పరిశ్రమలు విశాఖకు రాబోతున్నాయని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కూడా వస్తోందని వీటి అన్నింటి ఆసరాతో విశాఖ బ్రహ్మాండంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ మీద చంద్రబాబు ప్రశంసలు కొత్త కాదు. ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నప్పటి నుంచి కూడా విశాఖను పొగడుతూనే ఉన్నారు. విశాఖ నిజంగా చూస్తే కనుక ప్రగతిని అత్యంత వేగంగా సాధిస్తున్న నగరంగా ఉంది. ఈ రోజున ఏపీకి మెగా సిటీ ఏదీ అంటే విశాఖనే చెప్పుకోవాలి. అటువంటి సిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. విశాఖ గురించి చాలా చెప్పిన చంద్రబాబు, ఇదే సమయంలో విశాఖ ఆర్థిక రాజధానిగా ఉండాలంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉండేలా పూర్తి స్థాయిలో కృషి చేయాలని అంతా కోరుకుంటున్నారు.

ఈ నెల 8న విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన చేయడం ద్వారా అదే వేదిక మీద నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని విశాఖ ప్లాంట్‌కు ఇచ్చేలా అలాగే సొంత గనులు కేటాయించేలా ప్రైవేట్ అన్న ప్రసక్తి లేకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని స్పష్టం చేసేలా ప్రకటనలు వచ్చేలా చూడాలని అంతా కోరుకుంటున్నారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ విశాఖ ఆర్థిక చోదక శక్తిగా ఉంది. అటువంటి ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే బాబు ఆశిస్తున్న విశాఖ ఆర్థిక రాజధాని అన్నది ముందుకు సాగుతుందా అని కూడా ఆలోచించాలని అంతా కోరుతున్నారు.

4 Replies to “విశాఖను అలా పోల్చిన చంద్రబాబు”

  1. అప్పట్లో మన అన్న ఒక రోజు వైజాగ్ లో పడుకుంటే ….న్యూ యార్క్ మించిపోయింది అని నువ్వు ఇచ్చిన కలరింగ్ మర్చిపోయాయవా

Comments are closed.