బాబుకు రాజకీయం నేర్పుతున్న ఆర్కే

అయినా కూడా ఎందుకు ఆర్కే తన రాతల్లో లోకేష్ ను తక్కువ చేస్తున్నారు అన్నది క్వశ్చను.

జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేల అన్నది పెద్దల మాట. నరనరానా రాజకీయం నింపుకున్న చంద్రబాబు కు రాజకీయం ఒకరు నేర్పాలా? కానీ అలా నేర్పే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం సోషల్ మీడియా జనాలు. కానీ బాబుగారు అవేమీ పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కే రంగంలోకి దిగిపోయారు.

బాబుగారికి సుద్దులుు చెబుతూ వీకెండ్ పాయింట్ వండి వార్చారు. సరే, చంద్రబాబు రాజకీయం చేయడం లేదు అనో, రాజకీయం రాదు అనో అనడం వరకు ఒకె. కానీ లోకేష్ ఎదగడం లేదని, మర్రి చెట్టు నీడలో వుండిపోయారని, 2029లో జగన్ ను, పవన్ ను ఢీకొనే సత్తా లేదని అనడం ఎంత వరకు కరెక్ట్.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని లోకేష్ నడిపిస్తున్నారన్న సంగతి రాజకీయాలు దగ్గరగా పరిశీలించేవారికి అందరికీ తెలుసు. 2024 ఎన్నికల ముందు అన్నీ లోకేష్ నే కీలకంగా చూసుకున్నారని అందరికీ తెలుసు. ఈ సంగతి ఆర్కే కు తెలియదని అనుకోవడానికి లేదు. అయినా కూడా ఎందుకు ఆర్కే తన రాతల్లో లోకేష్ ను తక్కువ చేస్తున్నారు అన్నది క్వశ్చను. అలాగే పవన్ తనే చెబుతున్నారు పదేళ్ల వరకు చంద్రబాబు సిఎమ్ అని. అయినా పవన్ బయటకు వచ్చేస్తారు అని ఎందుకు ఆర్కే భయపెడుతున్నారు?

ఆర్కే రాతలు తెలుగుదేశం సోషల్ మీడియాకు నచ్చుతాయి. ఎందుకంటే వారికి అర్జంట్ గా వైకాపా జనాలు అందరినీ లోపల వేసేయాలి. కుమ్మేయాలి. కానీ చంద్రబాబు, లోకేష్ ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అది వారికి కాస్త బాధగా వుంది. ఇప్పుడు ఆర్కే వాళ్ల మనోభావాలు గమనించి, వారిని రెచ్చగొట్టే దిశగా, వాళ్ల సింపతీ, మద్దతు తను పొందే దిశగా వార్తలు వండుతున్నట్లు కనిపిస్తోంది.

తెలుగుదేశాన్ని మరీ ఎక్కువ కార్నర్ చేయడం లేదు. కానీ సుతిమెత్తగా చంద్రబాబును విమర్శిస్తున్నారు. లోకేష్ ను టార్గెట్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ఎందుకిదంతా? నిజంగా చంద్రబాబుకు రాజకీయం నేర్పాలనుకుంటున్నారా? లేదా ఆర్కేనే రాజకీయం చేయాలనుకుంటున్నారా? సమ్ థింగ్ ..ఏదో వుంది. ఏదో జరుగుతోంది.

19 Replies to “బాబుకు రాజకీయం నేర్పుతున్న ఆర్కే”

  1. నీ భయం నీది.. మాకు అర్థమవుతోంది..

    వాళ్ళు జగన్ రెడ్డి ని మర్చిపోయినా.. వీడు గుర్తు చేసి రెచ్చగొడుతున్నాడని నీ భయం..

    మొన్ననే జగన్ రెడ్డి ని పులివెందుల జనాలు కుమ్మేయబోయారు.. ఇక రాష్ట్రం మొత్తం అదే తంతు ఉంటుందని నీ భయం..

    జగన్ రెడ్డి భజన లో నీ వెబ్సైటు నడుపుతున్నావు.. నీ డబ్బు నీకు అందుతోంది.. కానీ జనాలకు ఏమవసరం.. జగన్ రెడ్డి ని నీలాగా ఎందుకు మోయాలి..?

    ..

    జగన్ రెడ్డి ని ఓడించింది చంద్రబాబో , లోకేశో కాదు.. ఆంధ్ర జనాలు..

    ఆ దరిద్రుడు మాకొద్దు అనుకొన్నారు.. బెంగుళూరు కి తరిమేశారు.. ఇక వాడి అవసరం నీకు తప్ప ఈ రాష్ట్రం లో ఎవడికీ అక్కరలేదు..

    నీ డప్పు నువ్వు కొట్టుకో..

    1. 7 నెలల్లో లక్ష కోట్లు అప్పు చేసి, జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయి, GSDP పడిపోయి రాష్ట్రాన్ని చంక నాకిచ్చారు. ఇదేనా ఈ దరిద్రపు చంద్రబాబు అనుభవం? చంద్రబాబు ఓడిపోయాక హైదరాబాద్ బాగుపడింది అన్నది వాస్తవం. ఆంధ్ర కు మాత్రం ఇంకా పట్టి పీడిస్తోంది.

    2. చంద్రబాబు జగన్ ను ఏమి పీకలేడు, ఇప్పుడు జగన్ ను లోపల వేస్తే మళ్ళీ జగన్ వచ్చిన తరువాత 80 ఏళ్ల వయసులో లోపల వుండగలడో లేడో చంద్రబాబు కి తెలిసినట్లు కార్యకర్తలకు తెలియదు కదా

      1. జగన్ను జైల్ లో వేయాల్సిన అవసరం లేదు 2019 – 24 లో జైల్ లాంటి ఇంట్లో కళ్ళు మూసుకొని పాలన చేశాడు… ఇంక ఏపీ జనాలు ఆయనకు a అవకాశం ఇవ్వరేమో

      2. 151 నుండి 140 పీకేశాం.. 11 మిగిలాయి..

        అవి కూడా పీకేయమంటారా..! అలాగే.. మీ కోరిక కాదనలేం.. పీకేస్తాం.. వాచ్ ఇట్..

      3. ముందు సొంత ఫ్యాన్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వలిసిన బాకీ దుడ్డు ఇవ్వమని చెప్పూ జగన్ కు. ఇంత డబ్బు వుంచుక్కిని పార్టీ వాళ్ళ డబ్బుతో ఎగ్ పఫ్ లు తినొద్దు అని కూడా చెప్పు.

    3. ముందు పడిపోయిన రాష్ట్ర ఆదాయం సంగతి ఏమిటి? తెచ్చిన లక్ష కోట్లు అప్పులు, సూపర్ six ఇవ్వకుండా చేసిన మోసం గురించి చెప్పండి

    4. ఇప్పుడు అన్నదే దరిద్రపు పాలన. అందుకే లక్ష కోట్ల అప్పు, హామీలకు పంగనామాలు, జీఎస్టీ పడిపోయింది

  2. CBN గారు ఎవరు చెప్పినా మంచి ఉంటే తీసుకుంటారు, ఒక వెకిలి వెదవ (ja***)ఉన్నాడు వాడికి ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వెకిలి మాటలు/ పనులు మానడు, ఏమీ చేస్తాం కొన్ని బ్రతుకులు అంతే!!

  3. జగన్ తర్వాత పార్టీ లీడర్ గా ఎవరు వుంటారు?

    రాబోయే ఇద్దరు అల్లుళ్ళు లో ఒకరా ?

    లేక

    3 AM తమ్ముడు వినాశం నా

    లేక

    సజ్జలు నా ?

Comments are closed.