ఏపీ డార్లింగ్ మంత్రి ఆయ‌నే!

హైద‌రాబాద్‌కు వెళ్లి, స్టార్‌హోట‌ల్‌లో నాలుగు రూమ్‌లు బుక్ చేసుకుని, మందీమార్బ‌లంతో క‌ళా పోష‌ణ‌లో మునిగితేలుతున్నాడ‌నే చ‌ర్చ టీడీపీలో సాగుతోంది.

టీడీపీ అనుకూల ప‌త్రిక హైద‌రాబాద్‌లో ఏపీ మంత్రి గారి సెటిల్‌మెంట్ల గురించి భారీ క‌థ‌నం రాసింది. డార్లింగ్ మంత్రి అని, క‌ళా పోష‌కుడు, హైద‌రాబాద్‌లోని ఒక స్టార్ హోట‌ల్‌లో సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు గానాబజానా.. కళా ప్రదర్శనలతో హోరెత్తిస్తుంటారని ఘాటైన క‌థ‌నం రాశారు. ఇంతకూ ఆ మంత్రిగారెవ‌ర‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఏపీ కేబినెట్‌లో ఆ డార్లింగ్ మంత్రి ఎవ‌రూ టీడీపీ నేత‌ల‌కు బాగా తెలుసు. ఆ మంత్రి అవివాహితుడు. స‌న్నిహితుల్ని డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఇక ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రిత్వ‌శాఖ అంటే… భూముల‌కు సంబంధించింద‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఈ మంత్రి తెలంగాణ‌లో భూసెటిల్‌మెంట్స్ చేయ‌డంపై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఘాటైన ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

స‌ద‌రు మంత్రి హైద‌రాబాద్‌లో వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు ఏవైన‌ప్ప‌టికీ, సెటిల్‌మెంట్స్‌లో వేలు పెట్ట‌డాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. అందుకే హైద‌రాబాద్‌లో స‌ద‌రు మంత్రి వ్య‌వ‌హారాలు శ్రుతిమించుతున్నాయ‌ని, సెటిల్‌మెంట్స్ ఏవో ఏపీలోనే చూసుకోమ‌నండి అంటూ చంద్ర‌బాబుకు తెలంగాణ స‌ర్కార్ ఘాటైన స‌ల‌హా కూడా ఇచ్చింది.

ఆ మంత్రి రెండు రోజుల క్రితం సీసీఎల్ఏ అధికారుల‌తో కీల‌క స‌మావేశం కూడా నిర్వ‌హించారని టీడీపీ నేత‌లు అంటున్నారు. నిషేధిత భూముల‌పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని, అలాగే రెవెన్యూ స‌మ‌స్య‌ల్ని వెంట‌నే ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని కూడా స‌మావేశంలో చెప్పారు. కావున వాటిని త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని ఆదేశాలు ఇచ్చారు.

చేతిలో “రెవెన్యూ”, ఇక ఎంజాయ్ చేయ‌డానికి త‌క్కువేం వుంటుంది. అందుకే హైద‌రాబాద్‌కు వెళ్లి, స్టార్‌హోట‌ల్‌లో నాలుగు రూమ్‌లు బుక్ చేసుకుని, మందీమార్బ‌లంతో క‌ళా పోష‌ణ‌లో మునిగితేలుతున్నాడ‌నే చ‌ర్చ టీడీపీలో సాగుతోంది.

4 Replies to “ఏపీ డార్లింగ్ మంత్రి ఆయ‌నే!”

Comments are closed.