పవన్ కల్యాణ్ లాజిక్ కరెక్టేనా?

పెరిగిపోతున్న రెమ్యూనరేషన్లు, బడ్జెట్స్ ను నిర్మాతలు అదుపుచేయలేనంతవరకు, ప్రేక్షకుడు ‘దోపిడీ’ అనే పదాన్ని వాడుతూనే ఉంటాడు.

“టికెట్ రేట్లు పెంచడం అనివార్యం. ఇది డిమాండ్-సప్లయ్ మీద ఉంటుంది. ఇష్టమైన హీరోను, సినిమాను మొదటి రోజే చూడాలనుకుంటారు, అది డిమాండ్. ఇదేదో ఉత్తినే ఇవ్వడం లేదు. పెరిగిన ప్రతి రూపాయిపై 18 శాతం ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తుంది. టికెట్ రేట్లపై బయట ఓ అపోహ ఉంది. పెరిగిన టికెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా.”

ఆంధ్రప్రదేశ్ లో గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్ల పెంపును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలా సమర్థించుకున్నారు. ఆయన చెప్పినప్పుడు బాగానే అనిపించింది, కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే, ఇందులో అసలు తర్కం ఉందా అనిపిస్తోంది.

సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది, బడ్జెట్స్ పెరిగాయి కాబట్టి టికెట్ రేట్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు పవన్. మరి ఆ బడ్జెట్స్ ఎందుకు అంతలా పెరిగాయో పవన్ కల్యాణ్ కు తెలియదా? ఒక్కో హీరో సినిమాకు వంద కోట్లు తీసుకుంటుంటే, బడ్జెట్ పెరగక ఏమౌతుంది? స్వయంగా పవన్ కల్యాణ్ తన సినిమాకు 75 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నారు కదా. రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటే, ఆటోమేటిగ్గా సినిమా బడ్జెట్ తగ్గుతుందనేది ఎంతోమంది నిర్మాతలు చెబుతున్న మాట. అప్పుడు టికెట్ రేట్లు ఇంతలా పెంచాల్సిన అవసరం ఉండదు కదా!

ఇదే పవన్ కల్యాణ్ మరో మాట కూడా చెప్పారు. గతంలో బ్లాక్ లో కొని టికెట్ కొనుక్కునేవాళ్లు. ఆ డబ్బులు నిర్మాతకు కాకుండా మరెవరికో వెళ్తాయి అన్నారు. అందుకే బ్లాక్ మార్కెట్ ను అరికట్టడం కోసం తామే నేరుగా బ్లాక్ మార్కెట్ స్థాయిని మించి టికెట్ రేట్లు పెంచేశాం అనేది పవన్ పరోక్ష స్టేట్ మెంట్.

ఈ సందర్భంగా మరో మాట కూడా శెలవిచ్చారు. రేట్లు ఊరికే పెంచడం లేదంట. పెంచిన ప్రతి రూపాయి నుంచి ప్రభుత్వానికి టాక్స్ వస్తోందట. పవన్ చెప్పింది అక్షరాలా నిజం. అయితే ఆ పెంపు భారం ప్రత్యక్షంగా ప్రేక్షకుడిపై పడుతోందనే విషయం ఆయనకు తెలియదా? జేబులోంచి వంద రూపాయలు తీస్తే, అందులో మేజర్ వాటా నిర్మాతకే వెళ్తుందనే విషయం అందరికీ తెలిసిందే కదా.

అయినా టికెట్ రేట్లు పెంచకపోయినా ప్రతి టికెట్ పై ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, మళ్లీ టికెట్ రేట్లు పెంచి అదనంగా ఆదాయం పొందడం ఎందుకు? అంటే, నిర్మాతలతో పాటు, ప్రభుత్వాలు కూడా ప్రేక్షకుడ్ని పీల్చి పిప్పిచేయాలని నిర్ణయించుకున్నాయన్నమాట.

ఇలా రిలీజ్ రోజు నుంచి ఏకథాటిగా 2 వారాల పాటు టికెట్ రేట్లు పెంచేస్తే థియేట్రికల్ సిస్టమ్ కుప్పకూలిపోతుందనే విషయం పవన్ లాంటి సినీ ప్రముఖుడికి తెలియదా? ఒక్క సినిమాకే 800 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే, అదే ప్రేక్షకుడు మరో 2 నెలల పాటు ఇంకో సినిమా చూస్తాడా? అప్పుడు చిన్న సినిమాల పరిస్థితేంటి? ఒక్క సినిమాకు టికెట్ రేట్లు పెంచితే, ఆ ప్రభావం ఆ తర్వాతొచ్చే మరిన్ని సినిమాలపై పడుతుందనే విషయం తెలియదా?

“గతంలో నా సినిమా భీమ్లానాయక్ కు టికెట్ రేట్లు పెంచలేదు, పైపెచ్చు తగ్గించేశారు.” అంటూ పవన్ ఆరోపించారు. అయినప్పటికీ ఆ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో మంచి వసూళ్లు వచ్చాయి కదా. బ్రేక్ ఈవెన్ అయిందని స్వయంగా నిర్మాతలే చెప్పుకున్నారు కదా. అది కూడా భారీ బడ్జెట్ సినిమానే కదా, ఆ లెక్కన చూసుకున్నా, ఇప్పుడొస్తున్న సినిమాలకు ఇంత పెంపు ఎందుకు?

ఎవరి ‘బెనిఫిట్’ కోసం ఈ షో..

కొన్ని రోజుల కిందట నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ ఓ మాటన్నారు. గతంలో కూడా బెనిఫిట్ షోలు వేసేవాళ్లు. కాకపోతే అలా వచ్చిన ఆదాయాన్ని ఛారిటీ కోసం ఉపయోగించేవాళ్లంట. కానీ ఇప్పుడు ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు వేస్తున్నారని ఆయన నేరుగా ప్రశ్నించారు. ఇక్కడ ఛారిటీ అనే మాట లేదు, అంతా దోపిడీనే. ఇంకా చెప్పాలంటే అధికారికంగా ప్రకటించి మరీ దోచుకుంటున్నారు.

సినిమా మంచి-చెడు అన్నీ చూపిస్తుంది, ఏది తీసుకోవాలనే విజ్ఞత ప్రేక్షకులకు ఉండాలన్నారు పవన్ కల్యాణ్. అదే విధంగా మేకర్స్ కూడా వందల కోట్లు పెట్టి, తమ వ్యాపారం కోసం సినిమాలు తీస్తుంటారు. ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచాలి, ఏ సినిమాకు వద్దనే విజ్ఞత ప్రభుత్వానికి కూడా ఉండాలి.

ఇదేదో కేవలం గేమ్ ఛేంజర్ కోసం అంటున్న మాటలు కావు. కొన్ని రోజుల కిందట వచ్చిన పుష్ప-2 సినిమా బెనిఫిట్ షోల రూపంలో ఇంతకంటే ఎక్కువే దోచుకుంది. రాబోయే సినిమాలు కూడా మరింత దోచుకుంటాయి. పెరిగిపోతున్న రెమ్యూనరేషన్లు, బడ్జెట్స్ ను నిర్మాతలు అదుపుచేయలేనంతవరకు, ప్రేక్షకుడు ‘దోపిడీ’ అనే పదాన్ని వాడుతూనే ఉంటాడు. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఇది అక్షర సత్యం.

66 Replies to “పవన్ కల్యాణ్ లాజిక్ కరెక్టేనా?”

  1. Rice, vegetables, pappulu etc nitya avasara vasthuvula dharala gurinchi okka media anna life lo okasaari anna matladaara…. cinema oka luxury… money unte velthaaru… lekapothe ledhu…. dhaaniki endhuku antha hyraanaa

    1. Cinema is not luxury for poor and mass people, it brings entertainment in their lives

      Unfortunately, thats the only main source for them.

      Even cricket is not close to cinema. Let them enjoy in affordable prices, don’t try to steal their money.

      STOP SUPPORTING TICKET PRICES HIKE.

      1. Lifelong price hike undadhu… second week lo choosthe without hike…50 days aagithe ott lo free… 4 months aagithe tv lo free adhe movie.. second week lo chusinaa adhe entertainment… hike first lo chudalanna curiosity valle…. burra thakkuva vedhavalu ekkuva ayyaru

  2. ఆదాయం వస్తుంది అంటే బ్రోతల్ లైసెన్స్ కూడా ఇచ్చేసేటట్టు ఉన్నాడు వీడు….

  3. జీఎస్టీ లేపడానికి ధరలు పెంచారు అని చెప్పు …. ఇంకా బాగుంటుంది.

  4. జగన్ రెడ్డి ఆర్జీవీ ని నమ్ముకొన్నాడు.. అందుకే వ్యూహం, శపథం, కడప బిడ్డలు అంటూ నాసి రకం సినిమాలు తీసాడు..

    చంద్రబాబు రాజమౌళి ని నమ్ముకొన్నాడు.. బాహుబలి, RRR లాంటి సినిమాలు వచ్చాయి..

    ..

    క్వాలిటీ కావాలంటే.. ఖర్చు పెట్టాలి..

    ..

    ఒకప్పుడు అన్నదమ్ముల సవాల్, అత్తాకోడళ్ల అనుబంధం, తోడుకోడళ్ళు అంటూ ఒక ఇంట్లోనే సినిమా అంతా ముగించేసేవాళ్ళు.. అప్పటికి ఆ కథలు నచ్చేవి.. ఇప్పుడు బంధాలు , అనుబంధాలు అంటే ఎవడు చూస్తున్నాడు..?

    అంతా వింత ప్రపంచం లో బతుకుతున్నారు..

    OTT వచ్చేసాక.. కథలు కరువైపోయాయి.. ఏది చెప్పినా ఆడియన్స్ ని వింత ప్రపంచం లో ముంచి తేల్చాలి.. నిమిషానికో ట్విస్ట్ కావాలి.. అదిరిపోయే పాటలు కావాలి.. ఒళ్ళంతా విరిచేసుకొనే డాన్సులు కావాలి..

    ఇదంతా కావాలంటే ఖర్చు అవుతుంది.. ఆ ఖర్చు ని రాబట్టుకోడానికి ధర పెంచాల్సి ఉంటుంది..

    ..

    ఐతే లాంటి సినిమాలు తీసిన చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకులు ఈ జనరేషన్ ఆలోచనలకు రీచ్ కాలేక సైడ్ అయిపోయారు..

    ఒకప్పుడు విశ్వనాధ్ సినిమాలు ఇప్పటికీ మెచ్చుకొంటాము.. కానీ అదే దర్శకుడు చివరి రోజుల్లో తీసిన సినిమాలు ఎవరికీ గుర్తు లేవు..

    ఇళయరాజా పాటలు అంటే చెవులు కోసేసుకొనేవాళ్ళం.. కానీ ఇప్పుడు ఇళయరాజా పాటలు ఇస్తే ఎవడికీ ఎక్కడం లేదు .. రెహ్మాన్ ని కూడా మర్చిపోయారు..

    ..

    అంతా కొత్తదనం కావాలి.. అందుకు డబ్బు ఖర్చు పెట్టాలి.. ఆ డబ్బు వెనక్కి తెచ్చుకోడానికి రేట్లు పెంచుకోవాలి..

      1. కరెక్ట్.. ఎవడూ గొంతు మీద కత్తి పెట్టి కొనమని అడగడం లేదు..

        మొన్న పుష్ప 2 టైం కి ఇండియా లోనే ఉన్నాను.. 1000 రూపాయలు టికెట్ అని చెప్పారు.. లైట్ తీసుకో అనుకొన్నాను..

        నాలుగు రోజులకి 400 కి తగ్గింది.. సినిమా బాగుందని టాక్ రావడం వల్ల..వెళ్లి చూసాం.. అదే సినిమా.. అదే కథ..

        సినిమా ఎత్తిపోతే OTT లో చూసేవాళ్ళం.. సింపుల్..

      2. కరెక్ట్.. ఎవడూ గొంతు మీద క త్తి పెట్టి కొనమని అడగడం లేదు..

        మొన్న పుష్ప 2 టైం కి ఇండియా లోనే ఉన్నాను.. 1000 రూపాయలు టికెట్ అని చెప్పారు.. లైట్ తీసుకో అనుకొన్నాను..

        నాలుగు రోజులకి 400 కి తగ్గింది.. సినిమా బాగుందని టాక్ రావడం వల్ల..వెళ్లి చూసాం.. అదే సినిమా.. అదే కథ..

        సినిమా ఎత్తిపోతే OTT లో చూసేవాళ్ళం.. సింపుల్..

      3. కరెక్ట్.. ఎవడూ గొంతు మీద కత్తి పెట్టి కొనమని అడగడం లేదు..

        మొన్న పుష్ప2 టైం కి ఇండియా లోనే ఉన్నాను.. 1000 రూపాయలు టికెట్ అని చెప్పారు.. లైట్ తీసుకో అనుకొన్నాను..

        నాలుగు రోజులకి 400 కి తగ్గింది.. సినిమా బాగుందని టాక్ రావడం వల్ల..వెళ్లి చూసాం.. అదే సినిమా.. అదే కథ..

        సినిమా ఎత్తిపోతే OTT లో చూసేవాళ్ళం.. సింపుల్..

        1. అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు రేట్ డిసైడ్ చేయడం , సినిమా వాళ్ళని డిసైడ్ చేసుకోనివ్వచ్చుగా. నచ్చిన వాడు చూస్తాడు లేదంటే లేదు

          1. కూరగాయల మార్కెట్ అయినా.. రేటు డిసైడ్ చేయాల్సింది ప్రజల ప్రభుత్వమే..

            ఆ రేటు ప్రజలకు నచ్చకపోతే నష్టపోయేది ప్రభుత్వమే..

            ప్రజాస్వామ్యం లో ప్రతి బిజినెస్ కి ఒక మానిటరింగ్ బాడీ ఉంటుంది..

            సినిమాలు సెన్సార్ చేయడం ఎలాగో.. సినిమా బిజినెస్ తగ్గ రేటు డిసైడ్ చేయడం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది..

            ..

            మీరు రెడ్డి కాబట్టి.. మీకు ఈ విషయాలు నచ్చకపోవచ్చు..

            మీకు నచ్చలేదని రాష్ట్ర ప్రభుత్వం నడవక మానదు..

            ..

            రైతు పండించే పంట కు కూడా గిట్టుబాటు ధర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.. రైతులు కాబట్టి సబ్సిడీ ఉంటుంది… కానీ ఇక్కడ నిర్మాతలకు ఆ వెసలుబాటు లేదు..

          2. కులం గురించి ఎందుకు బ్రో , కూరగాయల మార్కెటు లో , హోటల్స్ లో రేట్ నిర్ణయించేది అమ్మేవాడు గవర్నమెంట్ కాదు. ఒక్క రైతుకి తప్ప ప్రతివాడికి వాడు అమ్మే ధరని వాడే నిర్ణయిస్తాడు. ఇక్కడ గవర్నమెంట్ ఎదుకంటే మనిషి బలహీనతని దోపిడీ చేయకుండా అడ్డుకోవడానికి, కానీ అదే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, ఇది మంచిది కాదు

          3. అమరావతి ని కమరావతి అని కూసిన అడ్డగాడిదలను కూడా కులం సంగతి ఎందుకు అని ప్రశ్నించే ధైర్యం ఉండాల్సింది మీకు..

            ..

            మీది ఏ ఊరో.. ఏ రాష్ట్రంలో నాకు తెలీదు.. కూరగాయల మార్కెట్ అయినా.. హోటల్ ఫుడ్ అయినా ధర నిర్ణయించేది.. ఒక మానిటరింగ్ బాడీ.. అది రాష్ట్ర ప్రభుత్వ అద్వర్యం లో పని చేస్తుంటుంది..

            ఈ ధరలు వాళ్ళ ఏరియా, షాపింగ్ వాల్యూం ని బట్టి డిసైడ్ చేస్తుంటారు.. ధరలు వాళ్ళ ఇష్టానుసారం పెంచుకుంటే ఆ లైసెన్స్ రద్దు చేసే అధికారం ఆ మానిటరింగ్ బాడీ కి ఉంటుంది..

            ఇలా సగం సగం తెలివితో కామెంట్స్ పెట్టి నా టైం వేస్ట్ చేయకండి..

          4. కులం ఎందుకు బ్రో , ఇది అందరికి వర్తించును , ఒకసారి మీ ఊర్లో హోటల్ కి వెళ్లి ఓనర్ ని అడుగు దోస ఇడ్లీ రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు అని , మీ ఊర్లో రోడ్ మీద అమ్మే కొబ్బరి బొండాల వాడిని అడుగు రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు అని , తరువాత చెప్పు ఎవరు ఎవరి టైం వేస్ట్ చేస్తున్నారో , ఎవరి తెలివి ఎంతో ????

          5. ఏంటండీ మీ గోల..?

            రోడ్డు మీద అమ్ముకొనే బడ్డీ కొట్లకు ప్రభుత్వ లైసెన్స్ ఉండదు రెడ్డి.. దానికి ప్రభుత్వ రేట్లకు సంబంధం ఏమిటి..?

            ఇప్పుడేంటి.. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా.. రోడ్డు మీద అమ్మే దోసె ఒకటే అనుకొంటున్నావా..?

            నీ తెలివి అంతే అనుకోవాలి.. దయచేసి సరైన అవగాహన చేసుకుని కామెంట్స్ పెట్టండి..

          6. నేను ఊర్లో హోటల్ రేట్స్ కూడా చూడమన్నాను, డాల్ఫిన్ హోటల్ దసపల్లా హోటల్ రేట్స్ ఎవరు డిసైడ్ చేస్తారో కనుక్కో , ప్రతి ప్రోడక్ట్ తయారు చేసేవాడు వాడే రేట్ డిసైడ్ చేస్తాడు, గవర్నమెంట్ exploitation, క్వాలిటీ లాంటివి మాత్రమే చూస్తుంది . బయటి ప్రపంచంలోకి వచ్చి చూడండి మానవ బలహీనతని సొమ్ము చేసుకుంటాం అంటే దానిని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

          7. ఓకే.. నీలాంటి జీరో తేలివితేటలకు ఇంతకన్నా టైం వేస్ట్ చేయడం అనవసరం..

            మీ ఊర్లో బడ్డీ కొట్లకు కూడా ప్రభుత్వ లైసెన్స్ ఇస్తున్నారేమో నాకు తెలీదు..

          8. మన దగ్గర విషయం లేనప్పుడే అవతలివ్యక్తి మీద పర్సనల్ ఎటాక్ చేస్తాము . డాల్ఫిన్ హోటల్స్ దసపల్లా హోటల్స్ బడ్డీ కోట్లా ?? నోవాటెల్ లో చెక్ చెయ్ రూమ్ రేట్స్ , ఫుడ్ రేట్స్ ఎవరు డిసైడ్ చేస్తారో ???

          9. నీ దగ్గర మ్యాటర్ లేనప్పుడు నీకు నేర్పిస్తూ కూర్చోలేము.. ఆ అవసరం కూడా లేదు..

            నా పైన కామెంట్స్ లో క్లియర్ గా చెప్పాను.. ప్రభుత్వం ప్రతి బిజినెస్ కి దాని లైసెన్స్ ఖరీదు ని నిర్ణయిస్తుంది.. ఆ బిజినెస్ కి పరిధి ని బట్టి ఒక స్టాండర్డ్ రేట్లు నిర్ణయిస్తుంది..

            ఆ పరిధిలో హోటల్స్ రేట్లు మార్చుకోవచ్చు..

            ఒక్కోసారి ఆ ఊరిలో ఏదైనా సదస్సులు లాంటివి జరుగుతుంటే.. డిమాండ్ పెరగడం వల్ల .. రేట్లు పెంచుకొనే వెసలుబాటు ప్రభుత్వం ఇస్తుంది.. కాకపోతే ఆ నిర్ణయం ప్రభుత్వ పరిధిలో జరుగుతుంది..

            ..

            ఫైనల్ గా నువ్వు ఎంత మొత్తుకున్నా.. ప్రభుత్వమే రేట్లు నిర్ణయిస్తుంది.. దానికి కట్టుబడే వ్యాపారం చేయాలి..

            ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటే.. లైసెన్స్ రద్దు అవుతుంది..

            ..

            నీకు తెలియకపోతే తెలుసుకుని కామెంట్స్ పెట్టు..

            మేము హోటల్ బిజినెస్ లో ఉన్నాము.. మాకు పార్టీనేర్షిప్ ఉంది.. దయచేసి నాకు పాఠాలు నేర్పించొద్దు..

            ..

            నీ దగ్గర విషయం లేదు కాబట్టే ఎటాక్ జరుగుతోంది..

          10. Bro, you still don’t get it. Every company or hotel or restaurant they decide their product or service price not by government. Government duty is to see if they exploit the public or cheat or compromise with quality

          11. నీ దగ్గర మ్యాటర్ లేనప్పుడు నీకు నేర్పిస్తూ కూర్చోలేము.. ఆ అవసరం కూడా లేదు..

            నా పైన కామెంట్స్ లో క్లియర్ గా చెప్పాను.. ప్రభుత్వం ప్రతి బిజినెస్ కి దాని లైసెన్స్ ఖరీదు ని నిర్ణయిస్తుంది.. ఆ బిజినెస్ కి పరిధి ని బట్టి ఒక స్టాండర్డ్ రేట్లు నిర్ణయిస్తుంది..

            ఆ పరిధిలో హోటల్స్ రేట్లు మార్చుకోవచ్చు..

            ఒక్కోసారి ఆ ఊరిలో ఏదైనా సదస్సులు లాంటివి జరుగుతుంటే.. డిమాండ్ పెరగడం వల్ల .. రేట్లు పెంచుకొనే వెసలుబాటు ప్రభుత్వం ఇస్తుంది.. కాకపోతే ఆ నిర్ణయం ప్రభుత్వ పరిధిలో జరుగుతుంది..

            ..

            ఫైనల్ గా నువ్వు ఎంత మొత్తుకున్నా.. ప్రభుత్వమే రేట్లు నిర్ణయిస్తుంది.. దానికి కట్టుబడే వ్యాపారం చేయాలి..

            ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటే.. లైసెన్స్ రద్దు అవుతుంది..

            ..

            నీకు తెలియకపోతే తెలుసుకుని కామెంట్స్ పెట్టు..

      1. అంత నిజాలు కళాఖండాలు ఐతే జనాలు ఆదరించేవారు కదా పెండ్యాలగారు , ఎందుకు కనీసం వైసర్సీపీ కార్యకర్తలు కూడా చూడలేదు

      2. సినిమా క్వాలిటీ నాసి రకం అని చెప్పాను..

        మీరు నమ్ముకున్న కథ ని కాదు..

        ఏ సినిమాలో కథ ప్రత్యేకం గా ఏమీ ఉండదు.. తీసే విధానం, చెప్పే విధానం కొత్తగా ఉండాలి..

        సినిమా పట్ల కష్టం కన్నా.. మీ రాజకీయ అవసరం కనిపించింది కాబట్టే.. ఆ సినిమాలు వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలీదు..

      1. అంటే ఆర్జీవీ పోర్న్ సినిమాలు జగన్ రెడ్డి ఖాతాలో వేసుకోడానికి మీరు సిద్ధమైపోయినట్టేనా ?

        ఇంత ఎర్రిపప్పులు .. అడ్డం గా దొరికిపోతుంటారు ..

        నువ్వు వాదించాల్సింది .. జగన్ రెడ్డి కి ఆర్జీవీ సినిమాలకు సంబంధం ఏమిటి అని ..

        పనికిమాలిన నీలి గొర్రెలు ..

  5. People don’t know what is best for them. Politicians did masters in using these people. Why to bother when they themselves not bothered! Slowly people will also learn how to make money. Here, values, ethics donot matter. Let the system go as long as it can.

  6. చదువు కుంటే జ్ఞానం పెరుగుతుంది అని ఊరికే అన్నారా ? ఎమన్నా అంటే లోకం చూసాం అని తప్పించుకొంటారు. 😀

  7. //ఏ సినిమాకు టికెట్ రేట్ పెంచాలి, ఏ సినిమాకు వద్దనే విజ్ఞత ప్రభుత్వానికి ఉండాలి.//

    మీ ఆస్థాన దర్శకుడు RGV సినిమాకు రేట్లు పెంచమని అడిగినా రేట్లు పెంచుకోమని చెప్తారు. ఆ రేటుకు జనాలు ఆ సినిమాను చూస్తారో, చూడరో విజ్ఞత ఆ సినిమా తీసిన వారికి ఉండాలి. అదే డిమాండ్ అండ్ సప్లై.

    అలానే డిమాండ్ ఉన్న హీరో తో సినిమాకి పెట్టుబడి పెడితే డబ్బు తిరిగి వస్తది అనే నమ్మకం నిర్మాతకు ఉంటే ఆ హీరో కి ఎక్కువ డబ్బు ఇచ్చి సినిమా తీస్తాడు. అది ఆయన ఇష్టం.

    సినిమా అనేది ఏమీ నిత్య అవసర వస్తువు కాదు. కొన్ని రోజులు ఆగితే OTT లో చూసే అవకాశం ఉంది.

  8. Govt directly helping riches (makers) and asking poor (fans)to shell down their blood (money) if they want to watch movie in first week.

    why can’t they help farmers too by hiking rice and other grain prices.

      1. బియ్యం, పప్పులు, నూనె అనేవి నిత్యావసరాలు .. ప్రజలు వాటిని కొనాల్సిందే..

        సినిమా టిక్కెట్లు అనేది నిత్యావసరం కాదు.. ఎవరి ఇష్టం వాళ్ళది..

        గత ప్రభుత్వం మందు రేట్లు పెంచింది.. చీప్ లిక్కర్ అమ్మింది.. తాగాలనుకున్న వాళ్ళు కొని తాగారు.. అది వ్యసనం.. అది వాళ్ళ ఇష్టం.. ఇష్టం లేకపోతే తాగడం మానేయండి.. అనేది అక్కడ పాయింట్..

        ..

        కానీ మీ సలహా ప్రకారం.. బియ్యం, పప్పులు రేట్లు పెంచితే.. నష్టపోయేది రాష్ట్రం లో ప్రతి ఒక్కరు..

        ..

        మీరు చంద్రబాబు ప్రభుత్వం మీద కోపం తో .. మీ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకొంటున్నారు.. అంటే బ్రెయిన్ లెస్ అని మిమ్మల్నే అనుకోవాలి..

        1. Bro – govt nindhesthe, default thinkers like you, assume I’m YCP supporter but I’m not. Go and check my other posts.

          Coming to your point, liquor prices and please note it will not change based on when you buy it. It’s same price for all

          other side movie tickets, prices offering high for real movie lovers and less for one who watches if movie talk and rating are good. Is it fair to quench real movie lovers blood?

        2. you are assuming I’m other party supporter but I’m not.

          Coming to your point, note that liquor prices will not change based on when you buy it.

          other side movie tickets, prices offering high for movie lovers and less for others who checks movie talk and rating are good or not. Is it fair?

          1. If I get a chance, I will offer 10% discount on tickets for first 10 days for fans and all movie lovers. Then increase price after 10 days.

            Any movie maker can dare to do this?

          2. ఇక్కడ ఆ రేటు కి కొనాలా వద్దా అనేది వినియోగదారుడి నిర్ణయం.. ఎవరూ బలవంత పెట్తడం లేదు..

            కొనకపోతే పోయేదేమీ లేదు..

            లిక్కర్ చీప్ లిక్కర్ అని తెలిసినా కొన్నారు.. పక్క రాష్ట్రం లో 100 బాటిల్ ఇక్కడ 200 కి అమ్మినా కొన్నారు.. కారణం వ్యసనం.. ఆ వ్యసనాన్ని జయిస్తే.. మంచిదే..

            సినిమా టికెట్స్ విషయం లో నాలుగు రోజులు ఆగితే రేటు సాధారణ స్థితికి చేరుకుంటుంది.. సినిమా బాగుంటే అప్పుడే చూడొచ్చు..

            ..

            మర్కెట్స్ లో రేట్లు కూడా డిమాండ్ సప్లై బట్టి ఒక్కోసారి పెరిగిపోతుంటాయి.. సుమారు సంవత్సరం క్రితం టమోటాలు కిలో 200 పలికాయి.. అప్పుడు టమోటా లేకుండా వంటలు చేసుకున్న రోజులు ఉన్నాయి..

            ఇదీ అంతే.. కొనాల్సిందే అనుకుంటే కొంటాడు.. అంత అక్కరలేదు అనుకుంటే.. కొనడు ..

        3. This logic does not always hold good when it involved exploitation of poor and gullible. If the logic of demand and supply holds good, then whats the issue with lottery tickets, gambling, prostitution etc?

          1. still my answer is same..

            లాటరి టికెట్స్, గ్యాంబ్లింగ్ లో రిటర్న్ మనీ / లాభాలు ఆశించి ఆడుతారు.. పైగా ఆ ఆట లో చీటింగ్ ఉంటుందని అందరికీ తెలుసు..

            ప్రాస్టిట్యూషన్ అనేది హెల్త్ పాడు చేసే వ్యాపారం.. రెండు వైపులా హెల్త్ పాడు అవుతుంది.. పైగా కల్చరల్ గా మన దేశం లో ఆ వ్యాపారాన్ని తప్పుగా భావిస్తుంటారు..

            ..

            సినిమా టికెట్స్ విషయం లో .. సినిమా ని ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు.. రిటర్న్ మనీ ఆశించడం లేదు..

            సినిమా బాగులేకపోతే ఆ హీరో రెపుటేషన్ దెబ్బ తింటుంది..

            జగన్ రెడ్డి లాంటి పరిపాలన చూసాక.. ఐదేళ్లు మన ఓటు వేస్ట్ అయిపోయిందని బాధ పడతాము కదా.. ఇదీ అలాంటిదే.. నమ్మకద్రోహం..

  9. //ఏ సినిమాకు టికెట్ రేట్ పెంచాలి, ఏ సినిమాకు వద్దనే విజ్ఞత ప్రభుత్వానికి ఉండాలి.//

    మీ ఆస్థాన దర్శకుడు RGV సినిమాకు రేట్లు పెంచమని అడిగినా రేట్లు పెంచుకోమని చెప్తారు. ఆ రేటుకు జనాలు ఆ సినిమాను చూస్తారో, చూడరో విజ్ఞత ఆ సినిమా తీసిన వారికి ఉండాలి. అదే డిమాండ్ అండ్ సప్లై.

    అలానే డిమాండ్ ఉన్న హీరో తో సినిమాకి పెట్టుబడి పెడితే డబ్బు తిరిగి వస్తది అనే నమ్మకం నిర్మాతకు ఉంటే ఆ హీరో కి ఎక్కువ డబ్బు ఇచ్చి సినిమా తీస్తాడు. అది ఆయన ఇష్టం.

    సినిమా అనేది ఏమీ నిత్య అవసర వస్తువు కాదు. కొన్ని రోజులు ఆగితే OTT లో చూసే అవకాశం ఉంది. లేదా వేరే ప్రత్యామ్నయాలు చాలా ఉన్నాయి. నువ్వు గుంజుకుపోయి *చచ్చిపోవద్దు*

  10. కాపులు అనబడే నానా జాతి సమితి కులాలైన బలిజ,గాజుల బలిజ, సూర్య బలిజ(కళావంతులు) , కాపు, ఒంటరి, తెలగ, బుడబుక్కల, నక్కలోళ్లు, దొక్కాలి etc .. వీళ్ళని కులం పేరుతొ పిండి పరదెంగండి!!

  11. కాపులు అనబడే నానా జాతి సమితి కులాలైన బలిజ,గాజుల బలిజ, సూర్య బలిజ(కళావంతులు) , కాపు, ఒంటరి, తెలగ, బుడబుక్కల, నక్కలోళ్లు, దొక్కాలి etc .. వీళ్ళని కులం పేరుతొ పిండి పరదెంగండి!!

  12. జనాలు “గుంపులుగా వచ్చి సింగల్ సింహా0” ‘గుద్దలో 11 ఇంచులు దోపినప్పుడు అంతా ‘EVM లే చేసాయ్ అన్న లాజిక్ ఎంత కరెక్ట్ ఇది కూడా అంతే..

  13. అందరికీ పవన్ ప్రసంగం నచ్చుతుంది ఈ జి ఏ గాడికి ఎప్పుడూ పవన్ మీద ఏడిపే వీడి జన్మకు మారడు వీడికి ఎంతమంది చీ కొట్టిన వీడి పందా మారదు

  14. ఈ విషయం లో కూడా పవన్ కళ్యాణ్ ని కరెక్ట్ అనేవాళ్ళని మనుషులు అని కాకుండా ఇంకా ఏదయినా ఉత్తమ నామం వెతకాలి. సినీ దురభిమానం విపరీతంగా ఉండే ఈస్ట్ వెస్ట్ జనాలు మంచి ఏది చేదు ఏది అనేది గ్రహించలేక పోతున్నారు. గుడ్డిగా దేన్నయినా సమర్తించేవాళ్ళు నిరక్షరాసయులు

  15. గతంలో చిరంజీవి సినిమాలకు,

    ఘరానా మొగుడు,

    గ్యాంగ్ లీడర్,ఇంకా కొన్ని సినిమాలకు.

    థియోటర్ కౌంటర్ లో కొన్ని వారాలు పాటు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టే వాళ్ళు.

    హాల్ పక్కనే పాన్ షాప్ లో.

    ₹10/-ticket ₹100/-ki అమ్మేవారు

    ఇంకొందరు వీర అభిమానులు .బ్లాక్ లో 200/-300/- పెట్టి కొనుకునేవారు…

  16. అరేయ్ ఎవడ్రా ఇది రాసిన.ఏడవ.. అసలు టికెట్ తీసుకోవడానికి చూడడానికి స్తోమత ఉన్నవాడే వెళ్తాడు..లేనోడు ..ఐబొమ్మలో చూస్తాడు.. రాసేవాడు… కి ఉండాలి… అసలు..

Comments are closed.