టీడీపీ భావితరాల భవిష్యత్తు యువకిశోరం నారా లోకేష్, నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పెద్ద తాగ్యం చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్, లోకేష్ లు ఎక్కడ పోటీ చేయకుండా దూరంగా ఉండి కేవలం ప్రచార బాధ్యతలను మాత్రం తమ నెత్తిపై పొట్టుకుంటున్నాట్లు తెలుస్తోంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ తో కలవడం జరగదని అందుకే ఎలాగైనా వైసీపీని అధికారం నుంచి దూరం చేయడానికి పవన్ త్యాగనికి రెడీ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పెట్టి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు ప్రచార బాధ్యతలను తీసుకొని తమ పార్టీల విజయం కోసం ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత అలియన్స్ కన్వీనర్ గా పవన్ కళ్యాణ్ ను పెట్టి ప్రభుత్వం నడపబోతున్నట్లు అర్థమవుతుంది.
తమ పార్టీలని అధికారంలో తీసుకురావడం కంటే తాము ఎక్కడ ఓడిపోతామనే భయం పెట్టుకొని పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 175 టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ లో తాము ఎక్కడ ఓడిపోయి మళ్లీ మర్యాద పోతుందో అని, ఈ సారి ఓడిపోతే ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదని అందుకోసమే పోటీకి దూరంగా ఉండి తమ పార్టీల కోసం పోరాడితే బెటర్ అని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇరువురు నాయకులు ఓటమి చవిచూసిన ఇప్పటికి కూడా తము గెలిచే నియోజకవర్గాలు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.
వయోభారం వల్ల చంద్రబాబు నాయుడును కేవలం బహిరంగ సభలకు మాత్రమే పరిమితం చేసి, ఇరువురు నాయకులు మాత్రం ప్రతి మండలాల్లోనూ రోడు షోలు చేస్తూ ప్రచారం చేయబోతున్నారు. పవన్ త్యాగానికి గుర్తుగా .. పవన్ పార్టీకి కాసింత ఉపశమనం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా జనసేనకు సీట్లు పెరగబోతున్నాయి.