రెండు రోజుల పాటు జర్వం కారణంగా తన బస్సు యాత్రను వాయిదా వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ భీమవరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పవన్ తన తదుపరి కార్యచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టలానే అతృత్తతో ఉన్నారు. అందులో భాగంగా బస్సు యాత్ర చేసినప్పటి నుండి ప్రత్యర్థులు మాపై పోటీ చేసి గెలువు అంటూ సవాల్ విసురుతున్నా సైలెంట్ గా ఉంటున్నారు. ఇవాళ భీమవరం సభలో తను నిలబడే స్థానంపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గోదావరి జిల్లాల నుండి వైసీపీ ఒక స్థానం కూడా గెలవకుండా చేస్తానంటూ శపథాం చేస్తున్న ఆయన తను పోటీ చేసే స్థానంపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో కార్యకర్తలలో అయోమయం ఏర్పాడుతోంది. దానిని దృష్టిలో పెట్టుకోని గతంలో పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనే మళ్లీ పోటీ చేయబోతున్నట్లు సభ వేదికపై ప్రకటించే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన సీనియర్ నేతలు కూడా పవన్ తన సీటును ప్రకటించుకునే సరైన వేదికగా భావిస్తున్నారు.
తన సామాజిక వర్గం ఓట్లు, టీడీపీ పొత్తుతో పాటు.. గతంలో ఓడిపోయిన సానుభూతి తనను ఎలాగైనా గట్టేస్తారని పవన్ భావించి భీమవరంలోనే దాదాపుగా పోటీ చేసే ఆవకాశం ఉంది. ముందే ప్రకటిస్తే వైసీపీ చేసే పోల్ మెనెజ్మెంట్ భయంతో ఇన్ని రోజులు ఆగిన పవన్ ఇవాలా ఏం మాట్లాడబోతున్నారనే అందరు అశక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ వచ్చే ఎన్నికల్లో పొత్తులతో ఎన్నికలకు వెళ్లితే ఒక చోట మాత్రమే పోటీ చేసే ఆవకాశం ఉండటంతో భీమవరంకే పరిమితం అవుతున్నారు.