టీడీపీ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందా? అంటే సమాధానం అవును అని అంటున్నారు టీడీపీ వర్గాలు. ఒక వైపు జనసేన పవన్ కళ్యాణ్ వర్గం కాగా మరో వైపు నారా లోకేష్ వర్గంగా విడిపోయినట్లు తెలుస్తోంది. కొడుకుపై నమ్మకం లేకుండా అరువు తెచ్చుకున్న నాయకుడును చంద్రబాబు ఎక్కువ ప్రయారిటి ఇస్తుండంతో లోకేష్ తో పాటు టీడీపీలోని తన వర్గం నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పవన్ వెనుక చంద్రబాబు ఉంటే లోకేష్ వెనుక తన మామ నందమూరి బాలకృష్ణ ఉండటం విశేషం.
ఇటీవల బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించినప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా తమ పార్టీ నేతలు కొంత మంది తమ బాధను బాలయ్యతో పంచుకున్నట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తులో భాగంగా ముఖ్యంగా ధర్మవరం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తున్నారని వార్తలు రావడంతో వారు బాలయ్యతో బాధపడుతూ లోకేష్ సీటు హామీ ఇచ్చారని, ఇన్ని రోజులు సీటు మాదే అని డబ్బు ఖర్చు పెట్టామని, పార్టీ కోసం పోరాటం చేస్తునమంటూ తమ సీటుపై క్లారిటీ ఇవ్వాలని కోరడంతో వారికి బాలయ్య మీకు లోకేష్ చెప్పిందే జరుగుతుంది మీ పని చేసుకొండి అంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం, అనంతపురం అర్బన్ జనసేన నేతలు ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడుకు నమ్మిన బంటులాగా ఉంటున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే చాల ఖర్చు పెట్టారు తీరా సీటు రాకపోతే వీరి బాధ వర్ణనతీరం అవుతుందంటూన్నారు విశ్లేషకులు. ఒక వైపు చంద్రబాబు తమ అధినేతకు హామీ ఇచ్చిన బాలకృష్ణ ఇలా అడ్డురావడం తప్పంటున్నారు జనసేన నేతలు. ధర్మవరం, అనంతపురం అర్బన్ టీడీపీ నేతలు తమ సామాజిక వర్గ నేతలు కావడంతో లోకేష్ తో బాలయ్య రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల పొత్తులో భాగంగా టీడీపీలో పవన్ అనుకూల వర్గంగా, లోకేష్ అనుకూల వర్గలుగా విడిపోతారు అనేది నిజం. జనసేనకు ఉమ్మడి రాయలసీమలోని 4 జిల్లాల పరిధిలోను 4 సీట్లు కేటాయించబోతున్నట్లు వస్తున్న వార్తలతో ఆ 4 నియోజకవర్గాలలోని టీడీపీ నేతలు జనసేనకు సపోర్టు చేస్తారా లేదా అనేది చూడాలి.