తెలంగాణను పవన్ పూర్తిగా వదులుకున్నట్టే!

పవన్ కల్యాణ్ ప్రతి ఎన్నికల సందర్భంలోనూ తెలంగాణలో పోటీచేయడానికి విముఖంగానే ఉంటారు. కానీ.. అక్కడ కూడా ఆయన పార్టీకి కొంత నిర్మాణమూ, పార్టీకోసం కష్టపడుతున్న మనుషులూ ఉన్నారు. వారి నుంచి పవన్ కు ఒత్తిడి…

పవన్ కల్యాణ్ ప్రతి ఎన్నికల సందర్భంలోనూ తెలంగాణలో పోటీచేయడానికి విముఖంగానే ఉంటారు. కానీ.. అక్కడ కూడా ఆయన పార్టీకి కొంత నిర్మాణమూ, పార్టీకోసం కష్టపడుతున్న మనుషులూ ఉన్నారు. వారి నుంచి పవన్ కు ఒత్తిడి వస్తుంటుంది. చివరికి ఆయన తన పార్టీని కొన్ని స్థానాల్లో బరిలోకి దించుతారు.

ఆ సమయంలో తెలంగాణ అంటే తనకు ఉన్న ప్రేమను గురించి, తెలంగాణ సాహిత్యం గురించి, గద్దర్ గురించి ఇలా పవన్ కల్యాణ్ కొన్ని స్టాక్ ఉపన్యాసాలు ఇస్తారు. అంతా అయ్యాక పార్టీ ఓడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోరు. ఎన్నికలు వచ్చే దాకా ఆగాల్సిందే.

తాజా పరిణామాలను గమనిస్తోంటే పవన్ కల్యాణ్.. తెలంగాణను ఇక పూర్తిగా వదిలేసినట్టే అనిపిస్తోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. చాలా ఘనంగా నూటికి నూరుశాతం సీట్లు గెలుచుకుని ఏపీకి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్.. ఇక తెలంగాణ ఊసు మనకు అక్కర్లేదని అనుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదల నేపథ్యంలో.. ఆ విషయం స్పష్టం అవుతోంది.

పవన్ కల్యాణ్.. ఏపీని వరదలు ముంచెత్తుతున్నప్పటికీ, అసలు ఏమైపోయారో పత్తా లేకుండాపోయారు. మామూలుగా ప్రజలకోసమే తాను అన్నట్టుగా ప్రతిసారీ అతిగా స్పందిస్తూ ఉండే పవన్ కల్యాణ్ ఇంత తీవ్రంగా వరదలు ముంచెత్తినప్పుడు అదృశ్యం అయిపోవడం సర్వత్రా విమర్శలపాలైంది.

మధ్యలో ఆయన పుట్టినరోజు రావడం.. సాధారణంగా పుట్టినరోజు నాడు ఆయన ప్రపంచానికి అందుబాటులో ఉండకుండా గడపడం అనే అలవాటుకు దీనికి సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఎట్టకేలకు జనసామాన్యంలోకి వచ్చిన పవన్ కల్యాణ్.. సహజశైలిలో జగన్ పాలనలో బుడమేరు కాలువ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లనే ఈ ముప్పు వచ్చిందని నింద వేశారు. పనిలో పనిగా తన తరఫున ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటిరూపాయల విరాళం కూడా ప్రకటించారు.

ఇక్కడే తెలంగాణ ప్రజలకు తాజా రాజకీయ సందేహం వస్తోంది. వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ముంచెత్తాయి. పౌరులు ఆయా ప్రాంతాలకు చెందిన సంపన్నులు తప్ప.. ఇరురాష్ట్రాల్లో కార్యకలాపాలు ఉండే సెలబ్రిటీలు అందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ ఏపీలో ఎమ్మెల్యే అయినా రెండు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల వంతున కోటి, అదే మాదిరిగా ఎన్టీఆర్ కోటి ప్రకటించారు. కానీ పవన్ కల్యాణ్ ఏపీకి మాత్రమే కోటి ప్రకటించారు. ఈ తీరు చూస్తే.. ఇక ఆయన తెలంగాణ రాజకీయాలను పూర్తిగా వదులుకున్నట్టే అని ఇక అక్కడి ప్రజలతో తనకు అవసరం లేదు గనుక.. వారి వరద కష్టానికి సాయం అందించే మనసు కూడా రాలేదని ప్రజలు అనుకుంటున్నారు.

9 Replies to “తెలంగాణను పవన్ పూర్తిగా వదులుకున్నట్టే!”

  1. ఒరేయ్ వెంకట్ రెడ్డి ..పవన్ కనీసం తాను కస్టపడి సంపాధించిన కోటి రూపాయలు డొనేట్ చేసాడు …మరి జగన్ ఏమి ఇచ్చి నాడో కొంచెం చెప్పు..కొంచెం అయినా సిగ్గు పడు ర GA

  2. నిర్మాత వడ్డీ తడిసి మోపెడు అవుతున్న వేళ ఒక కోటి సమర్పించారు వడ్డీ తగ్గించాలని. గాలి posulu kodatadu. కర్మ

  3. 😂😂😂…. నీ ముష్టి logic ప్రకారం అసలు పిల్లికి బిచ్చం పెట్టని మన అన్నయ్య మరియు మీ దండుపాళ్యం బ్యాచ్ అసలు రాజకీయాలే వదిలేయాలి అంటావ్….బావుంది GA…..

Comments are closed.