స్టీల్ ప్లాంట్ నుంచి వేలాది మందికి ఉద్వాసన

విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి గడచిన మూడేళ్లలో వేలాది మందిని ఇంటికి పంపించేసింది కేంద్రం అని ఉక్కు కార్మిక సంఘాలు విమర్శించాయి. Advertisement కాంట్రాక్టు పనులను నిర్వహించే అయిదు వేల మందిని తొలగించారని మరో…

విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి గడచిన మూడేళ్లలో వేలాది మందిని ఇంటికి పంపించేసింది కేంద్రం అని ఉక్కు కార్మిక సంఘాలు విమర్శించాయి.

కాంట్రాక్టు పనులను నిర్వహించే అయిదు వేల మందిని తొలగించారని మరో అయిదు వేల మందిని వీఆర్‌ఎస్‌ ద్వారా తొలగించారని, ఇపుడు మరో పదిహేను వందల మనిని బయటకు పంపించేందుకు రంగం సిద్ధం చేశారు అని ఉక్కు పోరాట కమిటి ఆరోపించింది

విశాఖ స్టీల్ ప్లాంట్ కి అవసరం అయిన ముడి సరుకు కొనడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ ఇచ్చి బయటకు పంపించడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వీఆర్‌ఎస్‌ కోసమే 1261 కోట్ల రూపాయలను కేటాయించడాన్ని ఏ విధంగా చూడాలని నిలదీస్తున్నారు.

గడచిన మూడేళ్ల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించేసారని విమర్శించారు. గతంలో 73 లక్షల టన్నుల ఉత్పత్తిని విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తే దానికి ప్రస్తుతానికి 45 లక్షల టన్నులకు తగ్గించడం ద్వరా ఉక్కు పీక నొక్కాలని చూస్తున్నారు అని మండిపడుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిని చూపించాలని కోరుతున్నారు. ఈ నెల 10న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తామని పరిరక్షణ పోరాట కమిటి వెల్లడించింది.

ఇందులో ప్రజా సంఘాలు రైతు సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు అన్నీ పాల్గొంటాయని చెప్పారు. ఏపీకే పెద్ద దిక్కుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సి ఉందని ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిస్తేనే కేంద్రం దిగి వస్తుందని ఉక్కు కార్మిక సంఘాలు అంటున్నాయి.

11 Replies to “స్టీల్ ప్లాంట్ నుంచి వేలాది మందికి ఉద్వాసన”

  1. రోజుల్లో ఉంది దీని మూసివేత….ఆడిసరే గాంఇండీని విషయమై గతంలో pk ఎదో అన్నట్టు గుర్తు…ఏమైందో

  2. ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర వాళ్ళే ఉంటారు అందులో…. బంద్ చేసి పడేయ్యండి modi గారు..

  3. గతం లో అమ్మకానికి పెడితే ఆంధ్ర గవర్నమెంట్ కొంటుంది అని బహిరంగ ప్రకటన ఇచ్చినా జగన్ ఏమి చెయ్యలేదని ఏడ్చారు పచ్చ సాని పుత్రులు.

    ఉత్తరాంధ్ర వాళ్ళు కోరి ‘పచ్చ’డిగాళ్ళని నెత్తిన పెట్టుకున్నారు…

    ఇంకా తూఫాన్ల రూపంలో మీ ఉసురు తియ్యడానికి బాబు వస్తున్నాడు….కాచుకోండి.

Comments are closed.