అద్బుత విజయంలోనూ అసంతృప్తి

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎంతోమంది పేర్లు మంత్రి పదవుల కోసం వినిపించినా చివరికి ఎవరికీ ఆ ఛాన్స్‌ దక్కలేదు. దాంతోనే మొత్తం అంతా డీలా పడిపోయారు.

ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఉన్న విశాఖపట్నం ఏ రోజూ తెలుగుదేశానికి అన్యాయం చేయలేదు. తెలుగుదేశం పుట్టిన నాటి నుంచి విశాఖ ఆ పార్టీకే పట్టం కడుతూ వస్తోంది. అంతకు ముందు కాంగ్రెస్‌ ఆధిపత్యం సాగినా తరువాత మాత్రం టీడీపీని విశాఖ జనం తలకెత్తుకుని గెలిపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా విశాఖ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలు అయినా విశాఖ నగరం మాత్రం ఆదరిస్తూనే ఉంది. దానికి నిలువెత్తు ఉదాహరణ 2019 ఎన్నికలు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని విశాఖ నాలుగు దిక్కులా ఆదరించింది. ఇక 2024లో అయితే చెప్పనవసరంలేదు. విశాఖ నగరంతో పాటు జిల్లా రూరల్‌ జిల్లా అంతటా టీడీపీ కూటమిదే ఆధిపత్యం అయింది. కేవలం ఏజెన్సీలోని రెండు అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీటు వైసీపీకి తప్ప మిగిలినవి అన్నీ కూడా ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమి గెలుచుకుంది.

తెలుగుదేశం పార్టీని ఇంతలా ఆదరించిన విశాఖలో ఆ పార్టీ నాయకులు మాత్రం ఎందుకో నిశ్శబ్దంగా మారిపోయారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గతంలో మాదిరిగా విశాఖ అర్బన్‌ జిల్లా నుంచి మంత్రి పదవులు ఎవరికీ దక్కలేదు. అదే విధంగా చూస్తే రూరల్‌ జిల్లాలోనూ పదవులు ఆశించిన ప్రముఖుల పేర్లు అయితే కనిపించలేదు.

తెలుగుదేశం పార్టీ కూటమి కొత్త ప్రయోగం చేసింది, ఈసారి పాత ముఖాలను కాకుండా కొత్తవారికే మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించింది. అంతే కాదు గత అయిదేళ్లుగా జనంలోనే ఉంటూ వచ్చిన వారికే పదవులు అన్న నియమం పెట్టుకున్నట్లుగా ఉంది. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎంతోమంది పేర్లు మంత్రి పదవుల కోసం వినిపించినా చివరికి ఎవరికీ ఆ ఛాన్స్‌ దక్కలేదు. దాంతోనే మొత్తం అంతా డీలా పడిపోయారు.

నిజానికి ఈసారి కూటమి నుంచి రాజకీయ ఉద్దండులే గెలిచారు. ఎన్నో సార్లు చట్టసభలకు నెగ్గిన వారే ఈసారి కూటమి నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రాతిపదికన చూసుకుంటూ తమకు తప్పకుండా అవకాశం వస్తుందని బావించిన వారికి రిక్తహస్తమే మిగిలింది.

పాయకరావుపేటకు చెందిన వంగలపూడి అనితకు పార్టీ పెద్ద పీట వేసింది. ఆమెకు మంత్రిగానే కాదు కీలకమైన హోం శాఖను అప్పగించింది. నర్శీపట్నానికి చెందిన సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకు స్పీకర్‌గా అవకాశం లభించింది. అయితే ఆయన ఈ పదవిలో ఇంకా కుదురుకున్నట్లుగా కనిపించడంలేదు. నాకు స్పీకర్‌ పదవి ఇచ్చి నోటికి తాళం వేశారు అంటూ ఆయన అనేకసార్లు చెప్పుకుంటూ వస్తున్నారు.

అయ్యన్నపాత్రుడుకు ఇవి చివరి ఎన్నికలు. దాంతో పాటు తన కుమారుడి రాజకీయ జీవితాన్ని ఒక గాడిన పెట్టాలని ఆయన భావిస్తున్న క్రమంలో మంత్రి పదవి దక్కితే ఆ దూకుడే వేరుగా ఉండేది అన్న భావన ఉంది. విశాఖ అర్బన్‌ జిల్లా నుంచి చూసినా ఇదే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు అని భావిస్తున్నారు. ఆయన కూడా తన రాజకీయ వారసుడిగా కుమారుడుని ముందు పెట్టాలని అనుకుంటున్నారు.

తనకు తప్పనిసరిగా అర్బన్‌ జిల్లా నుంచి మంత్రిగా అవకాశం దక్కుతుందని భావించిన గంటాకు షాక్‌ తప్పలేదు. అలాగే 2014 నుంచి కూడా మంత్రి పదవి మీద మోజు పెంచుకుంటూ వచ్చిన మరో సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ మూర్తి కూడా మంత్రి పదవి లబించకపోవడంతో అసంతృప్తి చెందారు అన్నది కూడా ప్రచారంలో ఉంది.

వీరే కాదు, గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాస్‌ యాదవ సామాజికవర్గం కోటాలో మంత్రి పదవిని ఆశించారు. అలాగే ఇప్పటికి నాలుగుసార్లు మంత్రిగా గెలిచినా తనకు మంత్రి యోగం లేదా అని విశాఖ పశ్చిమ నియోజకవర్గం సీనియర్‌ ఎమ్మెల్యే గణబాబు కూడా మధనపడిన సందర్బం ఉంది అంటున్నారు.

ఇలా టీడీపీకి చెందిన వారు అంతా మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న క్రమంలో అది కాస్తా అందని పండుగా మారింది. దాంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా వారు పెద్దగా పట్టనట్లుగానే ఉంటున్నారు అన్నది ఒక మాటగా ఉంది.

ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ స్ధానానికి స్ధానిక సంస్ధల కోటాలో ఏర్పడిన ఖాళీకి ఇటీవల ఉప ఎన్నికలు జరిగితే బలంగా ఉన్న టీడీపీ కూటమి నుంచి సరైన అభ్యర్ధిని నిలబెట్టే విషయంలో కూడా చివరి వరకూ ఆలోచనలతోనే గడిపేశారు. నిజానికి కూటమి అధికారంలో ఉండడంతో నాయకులు అంతా కలసి సమిష్టిగా బాధ్యతలను తీసుకుంటే గెలుపు అవకాశాలు ఉంటాయని కూడా అనుకున్నారు. కానీ బాధ్యతలను ఎవరు తీసుకుంటారు అన్న దాని మీదనే తర్జన భర్జన జరిగి చివరికి పోటీ నుంచి తప్పుకునేలా వ్యవహారం సాగింది.

విశాఖ కార్పొరేషన్‌లో స్డాండింగ్‌ కమిటీ ఎన్నికలలో టీడీపీ కూటమి అభ్యర్ధుల విజయానికి మాజీ మంత్రి గంటా కొంతవరకూ బాధ్యత తీసుకున్నారు. అయితే మిగిలిన నాయకులు అంతా కూడా సహకరించాల్సిన అవసరం ఉంది అన్నది వినిపిస్తున్న మాట.

విశాఖ జిల్లా టీడీపీని గతంలో దివంగత ఎంవీవీఎస్‌మూర్తి నడిపించేవారు. ఆయన ఆర్ధిక బలంతో ఆయన వ్యూహ రచనతో పార్టీని ఏకత్రాటిపైన ఉంచేవారు. ఆ తరువాత లోటు అలాగే ఉంది. ఇక టీడీపీ గత ప్రభుత్వంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ అర్బన్‌ జిల్లా వరకూ బాధ్యతలను చూసేవారు. రూరల్‌ జిల్లాను అయ్యన్నపాత్రుడు చూసేవారు. ఇపుడు అలాంటి నేతలు కావాలంటే సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.

టీడీపీలో ఈ పరిస్థితి ఉంటే జనసేన నుంచి మంత్రి పదవులను ఆశించిన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు వంటి వారు కూడా ఒకింత నిరాశలో ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ కూటమికి నడిపించే నాయకుడు కావాల్సి ఉంది.

20 Replies to “అద్బుత విజయంలోనూ అసంతృప్తి”

  1. కరకట్టవాడలో లక్షలాది ప్రజలు నీళ్లు లేక అల్లాడుతున్నారు…

    తరువాత వరుసలో విశాఖ వుంది…కాచుకో పసుపుపతి అరాచకాలకు ప్రకృతి విరుచుకుపడబోతుంది…

    నీళ్ళల్లో వున్నా, నీళ్ళపక్కనే వున్నా, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిపోయే రోజులు దగ్గరలోనే వున్నాయి…కర్మని, ప్రకృతిని ఎవరు ఆపలేరు.

    1. Yeraa Solluganti nuvvu savachu kada raja aa prakruthi vilayam lo? Maaku daridram vaduluddi. Definitely ade prakruthi ninnu nee kutumbanni swrvanasanam chestundi idi pavurala gutta aana 😌🐍

    2. అయిదేళ్ళ ఇదే ప్రచారం చేసావ్. నీకు పెయిమెంట్ వచ్చింది గాని. పార్టీ కి రూపాయి ఉపయోగం లేక పోసాగే . మలల్ మొదలెట్టేసావ్ . వాకే. పర్ధాలా రాజు కి ఇలా సీన్ కాళి పోయే . కనీసం వ రాధాలు వచ్చిన ఏ రోజు కాలు బయటకి వేసిన సందర్భం లేదు అన్నయ్య

  2. ఏంటి GA…. వరదల్ని అడ్డుపెట్టుకొని చేద్దామనుకున్న నీచమైన లెకి రాజకీయాలు FAIL అయ్యాయని TOPIC DIVERT చేశావా….😂😂

  3. ఏంటి GA…. వరదల్ని అడ్డుపెట్టుకొని మీరు చేద్దామనుకున్న నీచ రాజకీయాలు FAIL అయ్యాయని టాపిక్ DIVERT చేశావా….😂😂😂

  4. ఎన్ని వరదాలు వచ్చిన. ఉపద్రవాలు వచ్చిన కళ్ళు తీయ్య కుండా. తాడేపల్లి లో ఉంది.పోయినా. పరాధాలా రాజా చివరికి 11 వచ్చేసరికి. విదియ వాడ బురద లో వచ్చి పద్దె పాపం.

  5. మనమేమో రిషి కొండ కి గుండు కొట్టి వదిలిపెట్టాం..అది ప్రతి రోజు కనిపిస్తూనే ఉంటుంది ..
    చూసినా విశాఖ వాడేమో పచ్చి భూతులు తిడుతూ రోజు స్టార్ట్ చేస్తున్నాడు
  6. మనమేమో రిషి కొండ కి గుండు కొట్టి వదిలిపెట్టాం..అది ప్రతి రోజు కనిపిస్తూనే ఉంటుంది ..చూసినా విశాఖ వాడేమో పచ్చి భూతులు తిడుతూ రోజు స్టార్ట్ చేస్తున్నాడు

  7. మనమేమో రిషి కొండ కి గుండు కొట్టి వదిలిపెట్టాం..అది ప్రతి రోజు కనిపిస్తూనే ఉంటుంది ..
    చూసినా విశాఖ వాడేమో పచ్చి భూతులు తిడుతూ రోజు స్టార్ట్ చేస్తున్నాడు
  8. ఏడువు రా రె, బాగా యేడువు, నీ ఏడుపును పట్టించు కొనే వాళ్ళు ఎవరు లేరు

Comments are closed.