విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు, తన పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసుల నమోదుకు సంబంధించి జనసేనాని పవన్‌కల్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు. తన కోసం అండగా నిలిచిన వారికి తానున్నానంటూ ధైర్యం, భరోసా కల్పించాల్సిన పవన్‌కల్యాణ్, ఆ పని చేయలేకపోయారు. పవన్‌కల్యాణ్ వీడియో విడుదల చేశారని తెలుసుకున్న ఆయన అభిమానులకు అది తీవ్ర నిరాశ కలిగించడం గమనార్హం.
ఒకటిన్నర నిమిషం పాటు ఉన్న ఆ వీడియోలో పవన్ చాలా నీరసంగా, నిరుత్సాహంగా కనిపించారు. తన కోసం హోటల్ బయట అభిమానులున్నారని, కనీసం వారికి అభివాదం చేసేందుకు కూడా అవకాశాన్ని పోలీసులు కల్పించకుండా ఆంక్షలు విధించాలని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు.
ఇలాంటి ఆంక్షలు భవిష్యత్‌లో విధించకుండా జగన్ ప్రభుత్వాన్ని నియంత్రిం చేలా న్యాయపోరాటం చేయబోతున్నట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అరెస్ట్ చేసిన వాళ్ల కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇది ప్రభుత్వంపై పోరాటమే తప్ప పోలీసులపై కాదని ఆయన స్పష్టం చేశారు.
115 మందికి పైగా హత్యాయత్నం కేసు పెట్టారని ఆయన అన్నారు. కొంత మందికి స్టేషన్ బెయిల్ ఇప్పించగలిగామన్నారు. ఈ వీడియోలో కనీసం అభివాదం చేయడానికి కూడా పోలీసులు ఆంక్షలు విధించారంటూ నిస్సహాయత వ్యక్తం చేయడంపై జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పవన్‌కల్యాణ్ గట్టిగా అనుకుంటే ఈ ఆంక్షలను ఛేదించడం ఒక లెక్కా అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
పవన్‌కల్యాణ్‌లో పోరాటంపై మాటలు తప్ప, ఆచరణ లేదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదీ పోలీసులు అలా చేశారు? ఇలా చేశారని చేతులు కట్టుకుని కూచుంటే… ఏమీ చేయలేమనే సంగతి తెలియనంత అమాయకుడా తమ నాయకుడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎపిసోడ్‌లో పవన్ అట్టర్ ప్లాప్ అయ్యారనే విమర్శలొస్తున్నాయి.