తిరుమలలో అత్యంత పారదర్శకంగా ఏదైనా జరుగుతోందంటే… అది శ్రీవాణి ట్రస్టే. అలాంటి శ్రీవాణి ట్రస్ట్‌పై జనసేనాని పవన్‌కల్యాణ్ మతిలేని విమర్శలేవో చేశారు. శ్రీవాణి టికెట్లకు రసీదులు ఇవ్వలేదని, కలియుగ దైవంతో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారని వైసీపీ నేతలకు ఆయన శాపనార్థాలు పెట్టారు. పవన్‌కల్యాణ్‌కు సహజంగా సొంత జ్ఞానం వుండదు, ఇక ఆయన చుట్టూ ఉన్న వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఎవరో ఏదో చెప్పడం, అదే నిజమని నమ్మి శ్రీవాణి ట్రస్ట్‌పై పవన్ నోరు పారేసుకున్నారు. దత్త పుత్రుడు తనకేదో కంటెంట్ అందించాడనే అత్యుత్సాహంతో చంద్రబాబు కూడా ఆ ట్రస్ట్‌పై రాయి వేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారిపై నిరాధార ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలపై విమర్శలు చేశారు.
2019 లో శ్రీవాణి ట్రస్టు స్థాపించి ఒక వ్యాపార సంస్థగా మార్చారని ఆయన ఆరోపించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ప్రతిరోజు 10 వేల రూపాయల విలువైన టికెట్లు అమ్ముతూ రసీదు ఇవ్వడం లేదని విమర్శించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు ఎన్ని టికెట్లు అమ్మారో, ఎంత డబ్బులు వచ్చాయో టీటీడీ ట్రస్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామికి అపచారం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. శ్వేత పత్రం విడుదల చేస్తామనే మాటకు కట్టుబడి, దమ్ముంటే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీవాణి టికెట్లు కొనుగోలు వ్యవహారం ఆన్‌లైన్‌లో సాగుతున్న సంగతి తెలిసిందే. తిరుమలకు వచ్చిన వారికి బ్రేక్ దర్శనం చేసుకోవాలంటే ఎలాంటి సిఫార్సులతో పనిలేకుండా ఈ ట్రస్ట్ సౌకర్యం కల్పిస్తోంది. మంచి పని చేస్తూ కూడా విమర్శలకు తావిచ్చేలా టీటీడీ ఎందుకు వ్యవహరిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.
పవనో, చంద్రబాబో, మరో బాబో విమర్శలు చేసిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామనే ప్రకటన చేయకుండా, ఆ పనేదో ముందే చేసి వుంటే పారదర్శకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలిగేది. ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేయడం అంటే, ప్రతిపక్షాలకు భయపడినట్టుగా క్రియేట్ అవుతుంది. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని కూడా ప్రతిపక్షాలు వాడుకోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. బుర్రలేనోడు ఏదో వాగితే, రాజకీయ అనుభవం కలిగిన వీళ్లకేం అయిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.