జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లోని తన క్యాంపు ఆఫీస్‌లో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. పవన్‌కు తన వదిన సురేఖ ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు. ఇకపై పవర్ స్టార్ బదులు డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ అని అభిమానులు పిలుచుకొనున్నారు
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పవన్ సీఎం కూడా అవుతారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ వర్మ కూడా స్వయంగా వెళ్లి అభినందనలు తెలిపారు.
బాధ్యతలు స్వీకారణ అనంతరం పవన్ కళ్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం అయి వారికి పలు సూచనలు చేయనున్నారు.