అనిత‌లో త‌గ్గిన ఫైర్‌.. ప‌వ‌న్ ఎఫెక్టేనా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్సే ఆమెను రాజ‌కీయంగా తీవ్రంగా డ్యామేజీ చేశాయ‌నే చ‌ర్చ లేక‌పోలేదు. అస‌లు రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఉన్నారా?

ఏపీ హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో వుండ‌గా, వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసేవారు. అలాగే ప్ర‌త్య‌క్ష పోరాటాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించే నాయ‌కురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిపై వైసీపీ దృష్టిలో ఇష్టానుసారం నోరు పారేసుకునేవారు. అందుకే ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్కిందనే ప్ర‌చారం లేక‌పోలేదు.

హోంశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నాక‌… ఇంకా వైసీపీ ర‌క్తం ప్ర‌వ‌హించే అధికారులు, పోలీసులు ఎవ‌రైనా వుంటే ప‌ద్ధ‌తులు మార్చుకోవాల‌ని ప‌దేప‌దే హెచ్చ‌రిస్తూ వ‌చ్చారు. లేదంటే తామే మార్చేస్తామ‌ని ఆమె వార్నింగ్‌లు అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ప‌రిపాల‌న‌పై కంటే, రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు అనిత‌పై వెల్లువెత్తాయి. అనిత దుర‌దృష్టం కొద్ది చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరిగాయి. వాటిని అరిక‌ట్ట‌డంలో అనిత విఫ‌ల‌మ‌య్యార‌న్న విమ‌ర్శ‌ల్ని మూట‌క‌ట్టుకోవాల్సి వ‌చ్చింది.

స‌రే, ప్ర‌తిప‌క్షాలు ఇట్లాగే ఆరోపిస్తాయ‌ని ఆమె ఖాతరు చేయ‌లేదు. ఎప్పుడైతే బ‌హిరంగంగా త‌న‌పై, త‌న శాఖాధికారుల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారో, అప్ప‌టి నుంచి ఆమె మ‌రింత బ‌ల‌హీన‌ప‌డ్డారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌లో త‌ప్పేమీ లేద‌ని, ఆయ‌న ఉద్దేశాన్ని త‌న‌కు అనుకూలంగా అనిత మార్చుకున్న‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల్లో ఆమె ప‌లుచ‌న అయ్యార‌ని మెజార్టీ అభిప్రాయం.

కొంత కాలంగా గ‌మ‌నిస్తే, అనిత త‌న స్వ‌భావానికి విరుద్ధంగా న‌డుచుకుంటున్నార‌ని అంటున్నారు. అంతేకాదు, అనిత కామెంట్స్‌కు ప్ర‌భుత్వ అనుకూల మీడియాలో కూడా త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో అనిత‌కు పాస్ మార్కులు కూడా రాలేద‌ని టీడీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. కూట‌మి ప్ర‌భుత్వంలో ఊహించ‌ని రీతిలో అనిత విఫ‌ల మంత్రిగా పేరు పొందారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్సే ఆమెను రాజ‌కీయంగా తీవ్రంగా డ్యామేజీ చేశాయ‌నే చ‌ర్చ లేక‌పోలేదు. అస‌లు రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఉన్నారా? అనే అభిప్రాయం క‌లిగేంత‌గా ఆమె ఉన్నా, లేన‌ట్టైంద‌నే అభిప్రాయం. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న అనిత‌… మంత్రిగా ఫైర్ లేని మంత్రిగా చివ‌రికి ఆ ప‌ద‌వి పోగొట్టుకుంటారేమో అనే అభిప్రాయాన్ని కొట్టి పారేయ‌లేని స్థితి.

8 Replies to “అనిత‌లో త‌గ్గిన ఫైర్‌.. ప‌వ‌న్ ఎఫెక్టేనా?”

  1. 😂 రవి గారు, మిమ్మల్ని చూసి మేము గర్వపడాలి!

    మీరు నిజమైన సంస్కారవంతుడు! “వాడు, వేదూ, ముసలి” లాంటి అశుభ్రమైన భాష మీరు ఎప్పుడూ వాడరు! ఎందుకంటే మీ నోట్లోంచి ఎప్పుడూ ముత్యాలు మాత్రమే ఊరుతాయి! 🧐👏 మీరు ఎవరినీ అగౌరవంగా సంబోధించరు, ముఖ్యంగా మాజీ CM, ప్రస్తుత CM, సీనియర్ నాయకులు – మీకు అందరికీ సమాన గౌరవం! ఏమిటి కదా? 🤔

    ఇంకా, మీకు కులపోకడలంటే అసహ్యం! మీరు కులాన్ని ఎక్కడా ప్రస్తావించరు, కులంపై రాజకీయం చేయరు, విద్వేషం రగిలించరు! అసలు మీరు కులాన్ని గుర్తు కూడా పెట్టుకోరు – ఎందుకంటే మీరు చదువుకున్న, సంస్కారవంతమైన, సొసైటీ రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి కాబట్టి! 😇👏 (జై సంస్కారం!)

    👉 మీరు కులాన్ని ఉపయోగించి రాజకీయ లాభం పొందే వాళ్లను చూసినప్పుడల్లా మీకు వాంతి వచ్చే స్థితి! 🤢🤮 మీరు వాళ్లను చూస్తే తట్టుకోలేరు! ఎందుకంటే మీకు కుల విద్వేషం పట్ల తీవ్ర అసహ్యం ఉంది! (కాని మీ రాజకీయాలు పక్కన పెడితే 😜😂)

    మీకు రాజకీయ ఎత్తుగడలు, ఒత్తిళ్లు, కక్షలు, పగలు ఏమీ తెలీదు! 😱 మీరు నిజాయితీకి పెట్టింది పేరు! ఎవరైనా అవినీతి గురించి మాట్లాడితే, మీరు “ఇతర పార్టీ వాళ్లూ చేసారు” అని గోల చెయ్యరు. ఎందుకంటే ఎవరు చేసినా తప్పు, తప్పే అనే నైతిక గుణం ఉంది! ఇదే మీ గొప్పతనం! 🏆

    అదేలా మరిచిపోవచ్చు? మీకు అధికారమే ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమమే ముఖ్యం! 🥺 మీరు ఎప్పుడూ సమాజ సేవ, పేదవాళ్ల కోసం పని చేస్తారు. (కాని మీకు మైక్ కనిపిస్తే ఇంకో మాట! 😆) మీకు అసలు పార్టీల కుర్చీలతో ఎటువంటి సంబంధం లేదు! ఎవరు నిజంగా పేదల కోసం పని చేస్తున్నారో చూడగానే మీకు గుండె ఊసూరుకుంటుంది! కానీ… వాళ్లు నిజంగా పేదల బాగోగులు కాదు, వాళ్ల పార్టీ అధికారం కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని మీరు అందరికన్నా తొందరగా గ్రహిస్తారు! 😜👏

    మహిళలకు మీరు అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తి! మీ నోట నుండి అసభ్య పదాలు అసలు రావు! మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని మీరు నిలదీసి, సహన శీలంగా వారిని చైతన్యం కలిగిస్తారు. (కాని WhatsApp ఫార్వర్డ్స్ చెయ్యనివ్వండి 🤭)

    చివరగా, మీకు ప్రజాస్వామ్యం అంటే పిచ్చి! 😍 మీరు ఎప్పుడూ చెబుతారు:

    📢 “ప్రజలు ఓటేస్తారు, గెలిపిస్తారు, ఓడిస్తారు – ఇది వారి హక్కు!”

    2024లో ఏం జరిగిందో చూశాం, 2029లో మరింత బాగుంటుంది కదా? (మీ అందమైన లీడర్షిప్ వల్ల 🤡😂)

    🔥 రవి గారు, మీరు నిజంగా ఇలాగే ఉన్నారు కదా? లేకపోతే… ఆలోచించండి! 😉😆😂🤮

  2. ప్లే బాయ్ వర్క్ వుంది ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు ఐదు మూడు ఒకటి సున్నా సున్నా నాలుగు

Comments are closed.