అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్ సీక్.. ఇండియా ఎక్క‌డ‌?

అమెరికా చాట్ జీపీటీని ఆవిష్క‌రించింది, చైనా డీప్ సీక్ తెచ్చింది.. మ‌నం ఏం తెద్దాం అనే చ‌ర్చ‌కు పెద్ద పెద్ద వాళ్లే ఆస్కారం ఇవ్వ‌డం లేదు!

ఇప్ప‌టికే అమెరికా వైపు నుంచి చాట్ జీపీటీ లాంచ్ అయ్యింది, ఏ విష‌యంలో అస‌లును సృష్టించ‌లేక‌పోయినా న‌క‌లును అయినా సృష్టించి త‌న స‌త్తా చాటుకునే చైనా చాట్ జీపీటీకి మించిన ఏఐ టెక్నాల‌జీని సృష్టించిన‌ట్టుగా ఇప్పుడు ప్రపంచ‌మే చెప్పుకుంటూ ఉంది.

ఏఐ టూల్స్ వ‌ల్ల ఉద్యోగాలు పోతాయ‌నే విష‌యాన్ని డీప్ సీక్ నిరూపించింద‌ని, ఇది లాంచ్ కావ‌డంతోనో చాట్ జీపీటీ స్థానాన్ని ఆక్ర‌మించేసి, దాని ఉద్యోగాన్ని పోగొడుతోంద‌నే సెటైర్లు కూడా సోష‌ల్ మీడియాలో వినిపిస్తూ, క‌నిపిస్తూ ఉన్నాయి. డీప్ సీక్ చైనా నుంచి లాంచ్ అయ్యి, అమెరికాలో ప్రకంప‌న‌లు పుట్టించింది. డీప్ సీక్ లాంచ్ తో అమెరిక‌న్ స్టాక్ మార్కెట్లు అత‌లాకుతలం అయ్యాయి. మిలియ‌న్ డాల‌ర్ల కొద్దీ ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌ను డీప్ సీక్ ఆవిరి చేసింది!

ఒక‌వైపు ఏఐ టెక్నాల‌జీల అభివృద్ధితో మ‌నుషుల ఉద్యోగాలు పోతాయ‌నే ప్ర‌చారం కొన‌సాగుతూ ఉంది. ఇదే స‌మ‌యంలో.. ఏఐ టెక్నాల‌జీని అభివృద్ధి ప‌ర‌చ‌డ‌మే కొత్త ఉద్యోగం అవుతుంద‌నే మాటా వినిపిస్తూ ఉంది. టెక్ రంగాల్లో పని చేసే వారు.. అంది వ‌చ్చిన ఏఐ టెక్నాల‌జీ ని ఉప‌యోగించుకోవాల‌నే వాద‌నా వినిపిస్తూ ఉంది. అయితే కొన్ని కంపెనీలు ఇప్ప‌టికీ త‌మ అధికారిక లాప్ టాప్ ల‌లో ఉద్యోగులు ఏఐ టూల్స్ వాడ‌టాన్ని ఆపుతున్నాయి. చాట్ జీపీటీని ఆఫీసు లాప్ ట్యాప్ ల‌లో వాడ‌కుండా నిరోధించే కంపెనీలు బోలెడున్నాయి. ఆఫీస్ డేటాను ఏఐ టూల్స్ కుఎక్కిస్తే అదెక్క‌డి త‌ల‌నొప్పుల‌కు దారితీస్తుంద‌నే భ‌యం వాటిల్లో క‌నిపిస్తూ ఉంది.

ఏఐ టూల్స్ వ‌ల్ల ఒక‌వైపు ఉద్యోగుల‌కు కొంత సౌల‌భ్యం అయితే ల‌భిస్తూ ఉంది. కోడింగ్ విష‌యంలో, క్వారీల విష‌యంలో చాట్ జీపీటీ ఉద్యోగుల ప‌నిని త‌గ్గించి వేస్తోంది. వాడుకున్న వాళ్ల‌కు వాడుకున్నంత‌. అయితే త‌మ ప‌నిని అది తేలిక‌గా చేసేస్తూ ఉండ‌టంతో.. రేపు త‌మ ఉద్యోగం అయినా ఉంటుందా ఉండ‌దా అనే భ‌యం కూడా ఉద్యోగుల‌ను వెంటాడుతూ ఉంది!

ఏఐ టూల్స్ ను స‌వ్యంగా వాడుకుంటే.. ముగ్గురు చేసే ప‌ని కూడా ఒక‌రితో సాధ్యం అయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి కొన్ని ఉద్యోగాల విష‌యంలో. ఇది ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చే స‌మ‌యం ఇంకా రాలేద‌నే చెప్పాలి. కంపెనీలు ఈ విష‌యంపై దృష్టి సారించ‌డం మొద‌ల‌వుతూ ఉంది. మ‌రి కొన్ని సంవ‌త్స‌రాల్లో అయినా ఒక ప‌క్కా మార్గాన్ని అవి ప‌ట్టుకుంటే, చాలా ఉద్యోగాలు మాయం అవుతాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం ఏమీ లేదు! ఆ పరిస్థితికి డీప్ సీక్ మ‌రింత ఊతంగా నిలుస్తూ ఉంది.

అటు తిరిగి, ఇటు తిరిగి ఈ ఏఐ టెక్నాల‌జీలు.. ఐటీ ఎగుమ‌తుల‌పై అధికంగా ఆధార‌పడే ప‌రిస్థితుల్లో ఉన్న ఇండియాలో నిరుద్యోగిత‌ను పెంచుతాయా అనే భ‌యాలు కూడా ఉన్నాయి. ఏఐ టెక్నాల‌జీ మీ జాబ్ ల‌ను తినేయ‌డం కాదు, మీరే కొత్త ఏఐ టూల్ డెవ‌ల‌ప్ మెంట్ లో భాగం అయితే అంత‌కు మించిన ఉపాధి ఏముంటుంద‌నే ప్ర‌శ్న విలువైన‌దే కానీ, ఎంత‌సేపూ ఐటీ సేవ‌ల ఎగుమ‌తుల మీదే ఆధార‌ప‌డి బ‌తుకీడుస్తున్న ప‌రిస్థితుల్లో ఉంది భార‌త‌దేశం. ఇన్నొవేష‌న్ చేసే ప‌రిస్థితుల్లో ఉందా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే!

దేశంలో ఐటీ వ్యాపారం చేసి వంద‌ల‌, వేల కోట్లు సంపాదించిన వారు కూడా.. ఉద్యోగులు గొడ్డుల్లా ప‌ని చేయాలి , ప‌ది గంట‌లు ప‌ని చేయాలి, ప‌న్నెండు గంట‌ల పాటు ప‌ని చేయాల‌నే వ్య‌ర్థ‌పు వాద‌న‌లు చేస్తున్నారు కానీ.. స్మార్ట్ వ‌ర్క్ చేయాల‌నే పిలుపులు ఇవ్వ‌డం లేదు! ప‌ని గంట‌ల‌ది ఏముంది? ఇన్నొవేటివ్ గా ప‌ని చేయండి, కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చేయండ‌ని వారు చెప్ప‌డం లేదు! పెళ్లం వైపు ఎంత సేపు చూస్తారు, నేను ప‌ది గంట‌ల పాటు ప‌ని చేశాను.. అంటూ వారు చెప్పుకొస్తున్నారు! చీప్ లేబ‌ర్ గా ఐటీ సేవ‌ల‌ను ఎగుమ‌తులు చేయ‌డం గురించి వీరు ఇలా ఉద్బోధిస్తున్నారు. అంతే కానీ.. అమెరికా చాట్ జీపీటీని ఆవిష్క‌రించింది, చైనా డీప్ సీక్ తెచ్చింది.. మ‌నం ఏం తెద్దాం అనే చ‌ర్చ‌కు పెద్ద పెద్ద వాళ్లే ఆస్కారం ఇవ్వ‌డం లేదు!

టెక్ రంగ ప్ర‌ముఖులే ఇలాంటి చ‌ర్చ‌లు పెడుతున్నారు అంద‌రిలో ప‌నిగంట‌ల గురించి! ఇక రాజ‌కీయ‌రంగం స‌రేస‌రి! ప్ర‌పంచం అలా ఏఐ టెక్నాల‌జీని ఆవిష్క‌రిస్తుంటే, దానికి ఆయా దేశాల ప్ర‌భుత్వాలు ఊతంగా నిలుస్తూ ఉంటే.. మ‌న ప్ర‌భుత్వాలు, వ్య‌వ‌స్థ‌లు మ‌సీదుల కింద ఏమున్నాయి? ప‌డ‌గొడితే ఏం క‌నిపిస్తుంది, లోతుల‌కు త‌వ్వితే ఏం ల‌భిస్తుంది.. అనే ప‌నిలో నిమ‌గ్నం అయ్యాయి! మ‌తాన్ని ర‌క్షించుకోవాల‌ట‌, లేక‌పోతే మునిగిపోతామ‌ని వ్య‌వ‌స్థ‌ల‌ను శాసించే వాళ్లు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు! మీ మ‌తం అలా అంటే, మీ మ‌తం అలా అంటూ యూట్యూబ్ లో చ‌ర్చా కార్య‌క్ర‌మాల‌ను వీక్షిస్తూ, ఇన్ స్టాలో అలాంటి రీల్స్ చూసుకుంటూ.. ఆవేశకావేశాలు తెచ్చుకుని.. ఇదే జీవితం అన్న‌ట్టుగా మ‌నం ద‌గ్గ‌ర వ్య‌వ‌హారాలు కొన‌సాగుతూ ఉన్నాయి.

అప్పుడ‌ప్పుడు ఏ అమెరికావాడో, చైనా వాడో అలాంటి ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తే.. వాటికి వినియోగ‌దారులుగా మారిపోయి.. వాటిని మ‌రింత పైకి ఎదిగేలా చేయ‌డాని మ‌న‌వంతు కృషిని చేస్తాం! అమెరికా వాడు ఫేస్ బుక్ ఇస్తే దాంట్లో పోస్టులు పెడ‌తాం, ఇన్ స్టా ఇస్తే రీల్స్ చేస్తాం, యూట్యూబ్ ఇస్తే వెర్రి థంబ్ నైల్స్ పెట్టి దేశం మొత్తాన్నీ వెర్రిగా మారుస్తాం! వాళ్లు డీప్ సీక్ లు, చాట్ జీపీటీలు ఇస్తుంటే.. మ‌నం ఆవుపేడ‌తో ఉండే అద్భుత ప్ర‌యోజ‌నాల గురించి వాట్సాప్ షేరింగుల్లో మునిగితేల‌డం చేయొచ్చు! ఇది ఈజీ!

42 Replies to “అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్ సీక్.. ఇండియా ఎక్క‌డ‌?”

  1. కొత్త ఆవిష్కరణ దబిడిదిబిడి తో ఆట

    మారిపోతుంది బ్రో . వెయిట్ & సి

  2. కుల మతాలని చూసి నేరస్తులని కూడా పూజించె గొర్రెల్లు ఉన్న చొట… AI చాలా అవసరం!!

  3. ఆర్దిక నెరస్తులని గుడ్డిగా పూజించె గొర్రెలు ఉన్నా పరిస్తితులలొ.. అంటూ రాస్తె అతికెది! నువ్వు ఎదొ మతం చుట్టూ తెప్పి ఎదొ చెప్పలి అని అబాసు పాలు అవుతున్నావ్!

  4. నీలాంటి పచ్చ పుల్కా గాళ్లకి బాగా అర్ధం అవుతుందిలే, పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇక్కడ ఆర్టికల్ఏ దేనిగురించి రాశాడు నీ కామెంట్స్ ఏమీ రాస్తున్నావ్, ఏ కులం వాడినీ తిట్టించాలో ఆ కులం వాడితో తిట్టించడం మన తాత గారి విద్యే అందరికీ నేర్పారు

  5. Roju kulanni rechagotte meeru ila raste viluva vundadu. Ayina AI lo India venakku vellindi, 500 kotlu aemoolaki? 1,10,000 kotlu uria subsidy ki ichi AI ki 500 kotlu ante mana priorities telustunnayi.

  6. అవును అవును. మనము చైనాను తప్పక అనుకరించాలి

    1) ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయండి.

    2) ఇస్లాంను మానసిక అనారోగ్యంగా ప్రకటించండి.

    3) ప్రత్యర్థులు & కార్యకర్తలను తొలగించండి

    4) మాతృభాష పిచ్చిని రద్దు చేయండి.

    5) కఠినమైన జనన నియంత్రణ విధించండి.

    6) కోటాలను తీసివేసి మెరిటోక్రసీని తిరిగి తీసుకురండి .

      1. అమెరికన్స్ ఏమి చెయ్యరు, ప్రపంచం మొత్తం నుంచి అమెరికా కు వలస వచ్చిన వారు చేస్తుంటారు

          1. అందుకే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ట్రంప్ ని గెలిపించారు తెలివి పని చేయడం మొదలుపెడుతోంది వీళ్ళకి

      2. అమెరికా వాళ్ళు 200 సంవత్సరాల లో సాధించిన ప్రగతిని చైనా వాళ్లు 30 సంవత్సరాల్లో సాధించి చూపించారు మరి ఏం ఏమనిపిస్తుంది వాళ్ల పాలసీలు ఎలాగున్నా ప్రగతి అయితే వచ్చింది టెక్నాలజీ కాపీ చేశారా లేదా ఏదో ఒకటి చేశారు మొత్తానికి సాధించారు

  7. Islam in America: 1%

    Islam in China: 1.5%

    The Big Brothers of the World has very insignificant Muslim population. This is why the problem of Islam is still being played down, while many areas across India and Western Europe are rapidly succumbing.

  8. Interesting Fact: If the population exchange in 1947 was complete, the unemployment & cost of living in India would be less than 60% what they’re today. If there was no Islamic invasion(i.e., no Kashmir & Pakistan conflicts), the unemployment & cost of living in India would’ve been less than 30% of what they’re today..

  9. ప్ర) పాకిస్తాన్ అంటే ఏమిటి?

    ANS: భారత్ లోని చాలా ప్రాంతాలు “లౌకిక ప్రాంతాలు” నుండి “ముస్లిం ప్రాంతాలు” గా రూపాంతరం చెందాయి. పాకిస్తాన్ & బంగ్లాదేశ్ ఇటువంటి రెండు బ్రహ్మాండమైన ప్రాంతాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం & కేరళ తదుపరి పాకిస్తాన్లు ప్రస్తుత జనాభా పోకడలను పరిశీలిస్తే .హిందువులు ఇప్పటికీ ‘సెక్యులర్ అనస్థీషియా’ కింద ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియ సున్నితంగా ఉంటుంది.

      1. Modi gave shelter to Hasina because she was protecting minorities and was supporting India in external matters. . Tine daggare bathroom ki velle sannasulu ki ivi important kalapovachu but andaru nela undaru kada

        1. నీ బొం!ద లా ఉంది నీ చదువు , అదానీ గాడికి అక్రమంగా కాంట్రాక్టు లు ఇచ్చిన విషయం బయటపడకుండా పకోడీ మోడీ దా!న్ని పక్కలో ఉంచు!కున్నాడు , నువ్వు ఎరిగింది నువ్వే తినే రకం నువ్వు పెం!ట లం!జా!కొ!డ!కా

  10. మన దగ్గర 10th క్లాస్ తప్పిన అదానీ గాడు , శ్రమ దోపిడీ చేసే కన్నింగ్ నారాయణమూర్తి గాడు లాంటి వాళ్ళు ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేయరు స్విస్ బ్యాంకు లో దాచుకుంటారు , ముని మనవడికి లేక మనవరాలికి ఆస్తులు రాసి ఇచ్చి దోపిడీ పరంపరని కొనసాగిస్తారు

  11. agree with you. Indian nunchi America fresh gaa vachina vallu .. tega reels peduthunnaaru. Why infosys Tcs are not working towards this .. stop these silly services business model

  12. Mukesh Ambani is setting up biggest data centre in Jamnagar. This will chnage the dynamics of AI in India. And also Inidan Govt is planning to built open data centers where any one with a small fee can use them just like libraries.

    But provision of 500 crores in budget for AI development reveal the sincerity of Govt for its development, not adding up, compared to 500 billion USD spending by USA.

Comments are closed.