జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రోజు చీకటి పడే వరకు నేతలతో సమావేశం అవుతూ.. రాత్రులు అవిశ్రాంతంగా బస్సు యాత్ర చేస్తున్న ఆయన ఇవాళ స్వల్పంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నారు.
ప్రస్తుతం పెదమిరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉంటున్న ఆయన కాసేపటి క్రితం జరగాల్సిన భీమవరం నేతల భేటీ అనారోగ్యం కారణంగా మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా నిన్న రాత్రి నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.. నరసాపురం బస్టాండ్లో చిన్నతనంలో తాను తప్పిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
గత సంవత్సరమే తను యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్.. లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని నెలల పాటు అగి ఈ నెల 14న అన్నవరం నుండి బస్సు యాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో తొలిదశలో యాత్ర ప్లాన్ చేశారు.
కాగా నేడు గతంలో తాను పోటీ చేసి ఓడిపోయిన బీమవరం నియోజవర్గంలో బస్సు యాత్రలో భాగంగా బహిరంగ సభలో పాల్గొంటున్న పవన్ ఏం మాట్లాడతారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోను తనను అందరు కలిసి ఓడించారంటూ వాపోతున్నా పవన్ ఇవాళ ఏం మాట్లాడుతారు అనేది అందరూ అసక్తిగా ఎదురుచూస్తున్నారు.