ఉత్త‌రాంధ్ర గ‌ర్జ‌న‌.. మ‌రోవైపు పవ‌న్ క‌ళ్యాణ్ టూర్!

మొత్తానికి అందరూ భావించినట్లే చంద్రబాబు నాయుడు తరఫున పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ చేయ‌బోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి జ‌న‌సేన అధినేత విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల నాయ‌కుల‌తో…

మొత్తానికి అందరూ భావించినట్లే చంద్రబాబు నాయుడు తరఫున పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ చేయ‌బోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి జ‌న‌సేన అధినేత విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల నాయ‌కుల‌తో స‌మీక్ష‌లు జ‌ర‌ప‌బోతున్న‌ట్లు జ‌న‌సేన ట్వీట్ట‌ర్ ఖాతాలో పార్టీ ప్ర‌క‌టించింది. 

గత నెల‌ నుండి ఉత్తరాంధ్ర ప్రజలు మీద నుంచి వస్తున్న విమర్శల ప్రభావం చంద్రబాబు మీద బాగా ప‌డిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అందుకే ముందుగా నిన్న రాత్రి నుంచి త‌న స‌న్నిహితుడు పవన్ కళ్యాణ్ తో పదేపదే ట్వీట్ చెప్పించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పేరుతో హడావుడి చేయబోతున్నారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల్లో త‌ను ముద్దాయిగా ముద్ర ప‌డ‌కుండా ప‌వ‌న్ ను ముందు పెట్టి చంద్ర‌బాబు రాజ‌కీయం చేయ‌బోతున్నారు. 

త‌న కార్య‌క‌ర్త‌ల‌కు ఏదైనా కష్టం వచ్చిన‌ కొద్దిగా లేటుగా వస్తాడేమో కానీ చంద్రబాబుకు కష్టమొస్తే అర నిమిషం కూడా ఆలోచించడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే మాట‌ను ప‌వ‌న్ నిజం చేస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రజలు ప్రజాగర్జన పేరుతో సభలు, సమావేశాలు పెట్టుకొని విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని పోరాటం చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ ఉత్త‌రాంధ్ర రాజకీయ ప‌ర్య‌ట‌ను ఎలా ఆర్ధం చేసుకుంటారు.

తనను ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఓడించారని కసి అయినా ఉండాలి లేదా.. త‌న స‌న్నిహితు చెప్పిన‌ట్టు మ‌హా న‌గ‌రం అమరావతి ఒక్కటే అభివృధి చేందాల‌ని కోరిక‌తోనే ఉత్త‌రాంధ్ర టూరు చేస్తున్న‌ట్లు బావిస్తున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. త‌న పార్టీ భ‌విష్య‌త్తు, ప్ర‌జ‌ల‌తో పని లేకుండా కేవ‌లం చంద్ర‌బాబు అజెండాతోనే ప‌వ‌న్ రాజ‌కీయం సాగుతోంది. బ‌హుశ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ను, త‌న పార్టీ నాయ‌కులుఎక్క‌డ నిల‌బ‌డ‌కుండా 2014 ఎన్నిక‌ల్లో లాగా టీడీపీకి స‌పోర్టు చేసిన ఆశ్చర్యం లేదు.