జనసేన 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తూ తనకు కులమతాలు లేవన్నారు. విశ్వనరుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌తో పాటు ఆయన దత్త తండ్రి చంద్రబాబు, కైలాస ద్వీపం అధినేత, వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు నిత్యానందను పోల్చుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఉతికేస్తున్నారు.
విశ్వనరుడిగా పవన్‌కల్యాణ్ (ట్యాగ్లైన్ః ఇంటర్మీడియట్ ఏ గ్రూపో తెలియదు), కైలాస అధినేత నిత్యానంద, ప్రపంచ మేధావి చంద్రబాబు అని ఫొటోలు పెట్టి మరీ వ్యంగ్య పోస్టులు పెట్టడం ఆకట్టుకుంటోంది. ఈ ముగ్గురిని చూస్తూ…. సరిపోయిందంటూ సీనియర్ నటి రోహిణి హట్టంగడి అంటున్నట్టుగా ఓ కామెంట్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టులో పవన్‌కల్యాణ్ కాషాయ వస్త్రధారణలో ఉండడం గమనార్హం. కొన్ని విషయాల్లో పవన్, నిత్యానందస్వామికి దగ్గరి పోలికలున్నాయనే సెటైర్స్ పేలుతున్నాయి. తనకు కులమతాలు లేవని, విశ్వనరుడని చెప్పుకుంటూ, మరోవైపు ప్రసంగం అంతా ప్రధానంగా తాను కాపు కులస్తుడినని, ఆదరించాలని వేడుకోవడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
నిత్యానంద స్వామి వివాదాస్పద చరిత్ర అందరికీ తెలిసిందే. కామ కార్యకలాపాల్లో మునిగితేలుతూ ఆధ్యాత్మిక పాఠాలు చెప్పడం నిత్యానంద స్వామికే చెల్లు. ముగ్గురు ప్రముఖులను పోల్చుతూ వ్యంగ్యాత్మక పోస్టులు ప్రత్యక్షం కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.