ఆ మాత్రం తెలిస్తే.. పవన్ ఎలా అవుతారు!

ఏమన్నా అంటే అన్నారని ఉడుక్కుంటారు గానీ.. జనసేనాని పవన్ కల్యాణ్ రోజురోజుకూ తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడంలో శృతిమించిపోతున్నారు. ఆయన ప్రస్తుతం విశాఖ కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వారాహి ‘విజయ’ యాత్ర  నిర్వహించే పనిలో బిజీగా…

ఏమన్నా అంటే అన్నారని ఉడుక్కుంటారు గానీ.. జనసేనాని పవన్ కల్యాణ్ రోజురోజుకూ తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడంలో శృతిమించిపోతున్నారు. ఆయన ప్రస్తుతం విశాఖ కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వారాహి ‘విజయ’ యాత్ర  నిర్వహించే పనిలో బిజీగా ఉన్నారు. 

వారాహి యాత్ర అంటే మరేం కాదు. జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, నన్ను గెలిపిస్తే మీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పడం, అలాగే ప్రభుత్వం మీద లేని అనుమానాలను కొత్తగా రేకెత్తించడం మాత్రమే. ఆ ప్రక్రియలో భాగంగా విశాఖ సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలను కూడా పవన్ కల్యాణ్ సందర్శించారు. ఎర్రమట్టి దిబ్బలను రియల్ ఎస్టేట్ వెంచర్స్ గా మార్చి రూపురేఖలు మార్చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎర్రమట్టి దిబ్బల విషయంలో సభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీ నాయకులు పవన్ కల్యాణ్.. ప్రభుత్వానికి ఏకంగా అల్టిమేటం ఇవ్వడం చర్చనీయాంశం. 48 గంటల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే ఆయన ఊరుకోరట. ఈ కామెడీకి తాజాగా తెరతీశారు.

ఆయన డిమాండ్ మరీ ప్రయోజనకరంగా కూడా లేదు. వైసీపీ వచ్చిన తర్వాత.. ఎర్రమట్టి దిబ్బల్లో ఒకవైపు ఆశ్రమానికి మరోవైపు రియల్ వెంచర్లకు కేటాయించారని ఆరోపిస్తున్నారు. వీటిని ఆపాలని అంటున్నారే తప్ప.. ఆశ్రమానికి కేటాయింపులను రద్దు చేయాలని, వెంచర్లను కూల్చాలని అనడం లేదు. ఇంతకూ ఆయన గడువు ఎందుకంటే.. 48 గంటల్లోగా ప్రభుత్వం తాము ఏం చేస్తుందో చెప్పాలట. లేకపోతే ఎన్జీటీ- హరిత ట్రిబ్యునల్ కు వెళతారట.

ఇంతకూ హరిత ట్రిబ్యునల్ పరిధి ఏమిటో.. ఎర్రమట్టి దిబ్బల సంగతి దాని పరిధిలోకి వస్తుందో లేదో.. పవన్ కల్యాణ్ కు తెలుసా లేదా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే.. ఆయన తన మాటల్లో ఎర్రమట్టి దిబ్బల గురించి ప్రస్తావిస్తూ.. కాసేపు ‘చారిత్రక వారసత్వ సంపద’ అంటారు. మరో సందర్భంలో పర్యావరణానికి నష్టం అంటారు. అది సున్నితనమైన ప్రాంతం అంటారు. 

ఎర్రమట్టి దిబ్బలు పర్యావరణం పరంగా ఏ రకంగా సున్నితమైన ప్రాంతమో వివరించరు. అదే సమయంలో.. అడవులు గనులు వంటి పర్యావరణ విషయాలు తప్ప.. ఎర్రమట్టి దిబ్బలను పవన్ కల్యాణ్ చారత్రిక వారసత్వ సంపదగా అభివర్ణించేట్లయితే.. అది ఎన్జీటీ పరిధి కిందకు రాదు అనే సంగతి ఆయనకు తెలిసినట్లుగా లేదు. అన్నీ తెలుసుకుని మాట్లాడితే ఆయన పవన్ కల్యాణ్ ఎందుకవుతారు? నోటికి ఏదొస్తే అది మాట్లాడడమే వైఖరి కదా.. అని జనం నవ్వుకుంటున్నారు.