జనసేన పవన్‌కల్యాణ్‌ను వెటకరించడంలో వైసీపీ ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే తన లక్ష్యమని పవన్‌కల్యాణ్ కొత్త నినాదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. పవన్ హెచ్చరికలకు, బెదిరింపులకు టీడీపీలా వైసీపీ భయపడడం లేదు. అంతేకాదు, పవన్ రెచ్చేకొట్టే కొద్ది వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.
పవన్‌ను జగన్ ముద్దుగా చంద్రబాబు దత్త పుత్రుడని పిలుస్తున్న సంగతి తెలిసిందే. తనను అలా పిలవొద్దని పవన్ కోరారు. సీబీఐ దత్త పుత్రుడని పిలుస్తానని పవన్ హెచ్చరించారు. పవన్ హెచ్చరికలను వైసీపీ లైట్ తీసుకుని, ఎప్పట్లాగే దత్తపుత్రుడిగానే పిలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌తో పాటు ఆయన అభిమానుల్ని హర్ట్ చేసేలా వైసీపీ వ్యంగ్యంగా మాట్లాడుతోంది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పవన్‌ను పోల్చడం గమనార్హం. గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ కేఏ పాల్‌కు, పవన్‌కల్యాణ్‌కే ఏమీ తేడా లేదన్నారు. ఇద్దరికీ ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు లేవన్నారు. కేఏ పాల్‌తో తమ నాయకుడిని పోల్చడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో కేఏ పాల్‌ను కమెడియన్‌గా చూసే సంగతి తెలిసిందే.
అలాంటి పాల్‌తో పవన్‌ను పోలుస్తూ కమెడియన్ పొలిటీషియన్‌గా ముద్ర వేయాలనే కుట్ర చేస్తున్నారని జనసేన విమర్శిస్తోంది. కేఏ పాల్‌తో పోల్చడం కంటే చంద్రబాబు దత్త పుత్రుడని పిలుపించుకోవడమే గౌరవంగా జనసేన భావిస్తోంది. స్వతంత్ర రాజకీయాలు చేయకుండా, టీడీపీ కొమ్ము కాస్తుండడం వల్లే పవన్ నిందలు పడాల్సి వస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా పవన్‌కల్యాణ్ తన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడితే మంచిది.