బాబు మెప్పుకోసమేనా ప‌వ‌న్‌!

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ సాధార‌ణంగా ఇత‌రుల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి ప‌ట్టించుకోరు. అలాగే జ‌గ‌న్‌, ష‌ర్మిల కుటుంబ వివాదాల గురించి ప‌వ‌న్ మాట్లాడింది త‌క్కువే. ప‌దేప‌దే త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి జ‌గ‌న్ విమ‌ర్శ‌లు…

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ సాధార‌ణంగా ఇత‌రుల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి ప‌ట్టించుకోరు. అలాగే జ‌గ‌న్‌, ష‌ర్మిల కుటుంబ వివాదాల గురించి ప‌వ‌న్ మాట్లాడింది త‌క్కువే. ప‌దేప‌దే త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో, అప్పుడ‌ప్పుడు చెల్లి ష‌ర్మిల‌, తల్లి విజ‌య‌మ్మ‌కు అన్యాయం చేశాడంటూ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారాయ‌న‌.

ఈ నేప‌థ్యంలో స‌ర‌స్వ‌తీ ప‌వ‌ర్ భూముల అంశం తెర‌పైకి వ‌చ్చింది. సుమారు 1500 ఎక‌రాల‌కు పైగా కేటాయించిన ఆ భూముల్లో వాగులు, వంక‌లు, కుంట‌లు, అట‌వీ భూములు ఉన్నాయ‌నే టీడీపీ అనుకూల మీడియా ప్ర‌చారం చేయ‌డం, వెంట‌నే ప‌వ‌న్ విచార‌ణ‌కు ఆదేశించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇదంతా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ళ్ల‌లో సంతోషం కోస‌మే అనే వాద‌న వినిపిస్తోంది.

ప‌వ‌న్ ఆదేశాల‌తో రెవెన్యూ అధికారులు వెంట‌నే ప‌ల్నాడు జిల్లాలోని దాచేప‌ల్లి, మాచ‌వ‌రం మండ‌లాల్లో అట‌వీ, రెవెన్యూ అధికారులు స‌ర్వే చేయ‌డానికి వెళ్లారు. అయితే సరస్వతీ పవర్‌ సంస్థ భూముల్లో అటవీ భూములున్నాయ‌నేందుకు ఆధారాలు లభించలేదని డీఆర్వో విజయలక్ష్మి తెలిపారు. మ‌రో రెండురోజుల పాటు అటవీ శాఖాధికారులు స‌ర్వే చేస్తార‌ని డీఆర్వో తెలిపారు.

మ‌రోవైపు స‌ర‌స్వ‌తీ ప‌వ‌ర్ భూముల్లో నాలుగు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని గుర్తించినట్లు మాచవరం తహశీల్దార్‌ క్షమారాణి తెలిపారు. ఆర్ఎస్ ఆర్‌ ప్రకారం సరస్వతీ సంస్థ కొనుగోలు చేసిన భూముల రికార్డులను పరిశీలించామన్నారు. ఇంకా స‌ర్వే చేసి, పూర్తిస్థాయిలో నివేదిక స‌మ‌ర్పిస్తామ‌న్నారు.

జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్ట‌డంలో త‌న వంతు పాత్ర వుండాల‌ని ప‌వ‌న్ త‌పిస్తున్న‌ట్టున్నారు. అప్పుడు చంద్ర‌బాబు దృష్టిలో మంచి మార్కులు ప‌డ‌తాయ‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ప‌రిశ్ర‌మ‌కు పంబంధించిన భూముల్లో ఏ మేర‌కు అక్ర‌మాల్ని గుర్తిస్తారో చూడాలి. ప్ర‌స్తుతానికి ప‌వ‌న్‌కు సంబంధించిన అట‌వీశాఖ భూములు లేవ‌ని తేల్చారు. ఇది కొంత ప‌వ‌న్‌కు నిరాశ క‌లిగించేదే.

18 Replies to “బాబు మెప్పుకోసమేనా ప‌వ‌న్‌!”

  1. షర్మిల.. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తుంది ..

    పవన్ కళ్యాణ్ .. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తాడు ..

    పురంధేశ్వరి .. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తుంది ..

    రేవంత్ రెడ్డి .. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తాడు..

    అమిత్ షా .. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తాడు..

    రాహుల్ గాంధీ .. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తాడు..

    మోడీ .. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తాడు..

    సిబిఐ, సీఐడీ , ఈడీ .. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తారు..

    హై కోర్ట్, సుప్రీమ్ కోర్ట్ .. చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తారు..

    ఇంతమంది చంద్రబాబు మెప్పు కోసం చూస్తున్నారంటే.. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం గా ఉండటం.. మన అదృష్టమే కదా.. ఇంకా దేనికిరా ఏడుపు..?

    నీ జగన్ రెడ్డి ని వంగోబెట్టి.. 11 సార్లు వాతలు పెట్టినందుకా..?

    ఊరికొక పాలస్ కట్టుకున్నా.. రోడ్డుమీద నిలబెట్టేసినందుకా..?

    రుషికొండ పాలస్ లో జగన్ రెడ్డి అడుగు కూడా పెట్టకుండా చేసినందుకా..?

    మూడు రాజధానులు అన్నందుకు.. తోక కట్ చేసేసినందుకా..?

  2. ఇవే ఎక్సట్రాలు అంటే… పవన్ అటవీ శాఖ…ఆయన బాధ్యత… బాబు ప్రాపకం కోసం ఊడిగం చేయాల్సిన అవసరం లేదు.. ఆయన నిజాయితీ ని ప్రశ్నించడం అంత తెలివితక్కువ తనం లేదు..

    అనవసరం గా పవన్ ని కెలకకండి.. ఆయన పని ఆయన్ని చేసుకోనివ్వండి.. ఇప్పటికే అనుభవిస్తున్నారు

  3. ఇలాంటి ఏడుపు గొట్టు రాతలు రాయమాకు రా GA.. జగ్గు గాడు కస్టపడి రాళ్లు కొట్టి సంపాదించింది కాదు, మహమేత అక్రమ సంపాదన kosam అన్న చెల్లి కొట్టుకుంటున్నారు… ప్రజలకి చెందాల్సిన దేశం ఆస్తిని ఒక్క ఫ్యామిలీ కోటేస్తుంటే చూస్తూ కూర్చోవాలా… నోరు మూసుకోరా కుక్క….

  4. చంద్రబాబు ని ఎ మాత్రం సాక్షాలు లెకుండా విచారణ పెరుతొ అర్రెస్ట్ చెసి జైల్ లొ పెడ్దితె అది కుట్ర కాదు, ఇబ్బంది పెట్టట్టం అంత కంటె కాదు.

    అదె మన jagan మీద just విచారణ కి ఆదెస్తె చాలు… అది కుట్ర అంటావ్!

  5. చంద్రబాబు ని ఎ మాత్రం సాక్షాలు లెకుండా విచారణ పెరుతొ అర్రెస్ట్ చెసి జై.-.ల్ లొ పెడ్దితె అది కుట్ర కాదు, ఇబ్బంది పెట్టట్టం అంత కంటె కాదు.

    అదె మన jagan మీద just విచారణ కి ఆదెస్తె చాలు… అది కుట్ర అంటావ్!

  6. ఎంత అదేనట సరస్వతి పవర్ కోసం 1500 ఎకరాలు లాక్కొనారి అనేది తేలింది .ఇంకా ఎందుకు నాటకాలు

  7. Every hour 18 crores is being taken as loans with total loan amount reaching 60,926 crores in 140 days. On target for 8L crores of loans in these 5 years without implementing 95% of welfare schemes that were promised.

  8. Dum3, there are reports that govt land and forest land is assigned, and Pawan has to do his due diligence and bring clarity for the public. It is his job, even Mines minister also will enter into the issue and clarify on the news reports of calcium carbide deposits. Stop OA.

Comments are closed.