పాలిటిక్స్ కేరాఫ్ విశాఖ అన్నట్లుగా ఇపుడు పరిస్థితి ఉంది. విశాఖ బీచ్ లో మార్చ్ నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు అని తెలుస్తోంది. డేట్ టైం ఫిక్స్ చేసుకుని మరీ ఆయన విశాఖ సాగరతీరంలో హోరెత్తే మార్చ్ కి ముహూర్తం పెట్టుకుంటారు అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అయిదు కిలోమీటర్ల దూరం పెట్టుకుని ఈ భారీ మార్చ్ చేస్తారు అని అంటున్నారు.
ఈ మధ్యనే విశాఖ బీచ్ లో విశాఖ రాజధాని కోరుతూ గర్జన సభ జరిగింది. దానికి జడివానను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. వైసీపీ మంత్రులు కూడా హాట్ హాట్ గా స్పీచ్ ఇచ్చి మరీ విపక్షాలకు సవాల్ చేశారు. ఇపుడు దానికి బదులు అన్నట్లుగా పవన్ బీచ్ రోడ్ లో మార్చ్ నిర్వహిస్తారా అన్నది డౌట్.
అయితే పవన్ మార్చ్ ఎపుడు ఏమిటి అన్నది ఇంకా తేలలేదు. అలా ప్రచారంగా ఇది ముందుకు వచ్చింది. దాంతోనే వైసీపీ కూడా కొత్త ఆలోచనలు చేస్తోందిట. విశాఖ బీచ్ లో జనసేన మార్చ్ కి అనుమతి ఇస్తే తాము కూడా అదే రోజున బీచ్ లో భారీ ఎత్తున పాదయాత్ర చేయడానికి మంత్రులు తయారు అని అంటున్నారు. అలా ఉత్తరాంధ్రాకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయలు మళ్లీ వారి జనాలతో బీచ్ రోడ్ లో మరో గర్జన లాంటి సీన్ క్రియేట్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని టాక్.
పవన్ సై అంటే మేము సై అని వైసీపీ నుంచి వస్తోంది. ఇదంతా మూడు రాజధానులకు మద్దతుగా అని వైసీపీ మంత్రులు అంటూంటే అమరావతి రాజధాని కోసమే జనసేన మార్చ్ అంటోందని కూడా విమర్శిస్తున్నారు. ఇంతకీ పవన్ మార్చ్ ఎపుడు. ఎక్కడ ఎలా అన్నది ఫస్ట్ తేలాలి. అది తేలితే మంత్రుల పాదయాత్ర కూడా తేలినట్లే.