అమ‌రావ‌తికి ప్ర‌ధాని…వ‌చ్చే వ‌ర‌కూ అనుమాన‌మే!

అత్యంత విశ్వ‌సనీయ వ‌ర్గాలు అందిస్తున్న స‌మాచారం మేర‌కు… ప్ర‌ధాని అమ‌రావతి వ‌చ్చే వ‌ర‌కూ అనుమాన‌మే.

చంద్రబాబు సర్కార్ మొట్టమొదటి ప్రాధాన్యం రాజధాని అమరావతితి నిర్మాణం. ఇప్పుడు అధికారంలో ఉన్న‌పుడు చేయకపోతే, ఇంకెప్ప‌టికీ సాధ్యం కాద‌నే ఆలోచ‌న‌తో కూట‌మి స‌ర్కార్ ముందుకెళుతోంది. రాజధాని కోసం ఎంత అప్పు చేయడానికైనా ప్ర‌భుత్వం వెనుకాడ‌డం లేదు. ల‌క్ష కోట్ల‌తో చేప‌ట్టే అమ‌రావ‌తి పునర్నిర్మాణ పనుల్ని ప్రధాని మోదీతో చేయించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నారు.

ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న షెడ్యూల్ కూడా ఖ‌రారైంది. వ‌చ్చే నెల 2వ తేదీ ప్ర‌ధాని మోదీ అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నులు ప్రారంభించేందుకు వ‌స్తున్నారు. ఆ రోజు మ‌ధ్యాహ్నం 3.25 గంట‌ల‌కు స‌చివాల‌యం హెలిప్యాడ్ వ‌ద్ద‌కు ప్ర‌ధాని చేరుకుంటారు. ఆ త‌ర్వాత స‌భ పాల్గొని ఐదు గంట‌ల్లోపే తిరిగి ఢిల్లీకి ప్ర‌యాణం కానున్న‌ట్టు షెడ్యూల్ చెబుతోంది.

అయితే అత్యంత విశ్వ‌సనీయ వ‌ర్గాలు అందిస్తున్న స‌మాచారం మేర‌కు… ప్ర‌ధాని అమ‌రావతి వ‌చ్చే వ‌ర‌కూ అనుమాన‌మే. అమ‌రావ‌తి విష‌యంలో కూట‌మి స‌ర్కార్ తీరుపై ప్ర‌ధాని అసంతృప్తిగా వుండ‌డంతో పాటు జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల దృష్ట్యా ప్ర‌ధాని రాక‌పై ఢిల్లీ వ‌ర్గాలు సందేహం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాని మోదీని అమ‌రావ‌తికి ర‌ప్పించి, ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయించ‌డం ద్వారా, అభివృద్ధిపై న‌మ్మ‌కాన్ని క‌లిగించ‌డం ప్ర‌భుత్వ ఉద్దేశం. అయితే కేంద్ర ప్ర‌భుత్వ ఆలోచ‌న‌లు మ‌రోలా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ప‌దేప‌దే అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు ప్రారంభం అంటూ, చంద్ర‌బాబు హ‌యాంలో నాట‌కీయ‌త చోటు చేసుకుంటోంద‌ని, అందులో తామెందుకు భాగ‌స్వామ్యం కావాల‌నే అభిప్రాయంతో ప్ర‌ధాని స‌హా ప‌లువురు కేంద్ర పెద్ద‌లు ఉన్న‌ట్టు చెబుతున్నారు. అయితే ఎన్డీఏలో భాగ‌స్వామి కావ‌డంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మోదీ వ‌స్తార‌నే ధీమాలో సీఎం చంద్ర‌బాబు ఉన్నారు.

12 Replies to “అమ‌రావ‌తికి ప్ర‌ధాని…వ‌చ్చే వ‌ర‌కూ అనుమాన‌మే!”

  1. Thumhaara time aayega..aayega..thabtak ayise hee likthate rahie.

    Plz contiune these kind of articles till your time comes.

    Neenga time vandhu varaku appidiye eludhu daa arivi katta naaya.

  2. ఈనో ప్యాకెట్ల కొరత ఉన్నట్లు ఉంది….పాపం మాన్తా కి ఏమి రాస్తున్నావో కూడా చూసుకోవడం లేదు…ఒక పక్క షెడ్యూల్ ఖరారు అంటావ్….అయినా అనుమానం అంటావ్

  3. Wow so PM called Venkat reddy and told him that CBN always asking me to come and I don’t want to come, can you please publish this news in your tabloid ani cheppadaa?

Comments are closed.