ప‌రిటాల ఎఫెక్ట్.. తోపుదుర్తి చందుపై కేసు!

ఐటీ యాక్ట్ కింద చందుపై రాప్తాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అరెస్ట్ వ‌ర‌కూ దారి తీస్తుందా? లేక నోటీసుల‌తో స‌రి పెడ‌తారా?

వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు పారేసుకున్న ప్ర‌తి ఒక్క‌రిపై కేసు పెట్టి చ‌ర్య‌లు తీసుకునే ప‌నిని కూట‌మి స‌ర్కార్ వేగ‌వంతం చేసింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి సోద‌రుడి చందుపై తాజాగా కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై తోపుదుర్తి చందు అవాకులు చెవాకులు పేల‌డం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపింది. మొద్దు శ్రీ‌నుకు వైఎస్సార్ ఒక్క మాట చెప్పి వుంటే, చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబాన్ని చంపేవాడ‌ని తోపుదుర్తి చందు వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. అప్ప‌ట్లో తోపుదుర్తి చందుపై ప‌రిటాల సునీత‌, ఆమె త‌న‌యుడు శ్రీ‌రామ్ తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు. అయితే వైసీపీ ప్ర‌భుత్వం ఉండ‌డంతో కేసు న‌మోదు చేయ‌లేదు.

ఇప్పుడు అధికారంలో కూట‌మి స‌ర్కార్ వుండ‌డంతో గ‌తంలో చేసిన కామెంట్స్‌ను తోడుతోంది. ఇందులో భాగంగా తోపుదుర్తి చందుపై టీడీపీ నేత‌లు అనంత‌పురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద చందుపై రాప్తాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అరెస్ట్ వ‌ర‌కూ దారి తీస్తుందా? లేక నోటీసుల‌తో స‌రి పెడ‌తారా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప‌రిటాల‌, తోపుదుర్తి కుటుంబాల మ‌ధ్య వ్య‌క్తిగ‌త వైరం కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. చందుపై ప‌ట్టుప‌ట్టి కేసు పెట్టించ‌డంపై వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

10 Replies to “ప‌రిటాల ఎఫెక్ట్.. తోపుదుర్తి చందుపై కేసు!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

        1. ప్రజల ఓట్లు, ఆశీస్సులు ఉన్నవాళ్ళకి ఏ పదవైనా ఇవ్వొచ్చు..

          వై నాట్ 175 అనుకుని.. దిక్కులేని సావు సచ్చిన ముండమోపుల లాగా ఏడవటం మాకు అవసరం లేదు..

          నీ ఏడుపు మాకు దీవెనలు..

  2. ఈసారి పరిటాల సునీత గెలిస్తే, మీసాలు తీసేసి, అరగుండు తో గాడిద వెనుక ఊరేగుతా అన్నాడు ఈడు..

    మరి తొందరలో దానికి ముహూర్తం పెట్టిస్తే బాగుంటుంది కదా శ్రీరామ్??

  3. Ya jagan ni enni annaru ee tdp pandulu..

    okkadu kuda arrest kakunda Ramana gaadu addu paddadu..

    but prathi daaniki Oka time undi..

    ippudu vella time..2027 varaku

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.