బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలు, క్యారెక్టర్లు ట్రై చేస్తున్నాడు హీరో వరుణ్ తేజ్. ఇప్పుడీ హీరో మరో కొత్త జానర్ లోకి అడుగుపెట్టాడు. ఈసారి హారర్ కామెడీ సబ్జెక్ట్ చేయబోతున్నాడు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా చేయబోతున్నాడు వరుణ్ తేజ్. కెరీర్ లో అతడికిది 15వ చిత్రం. ఇప్పటికే లీకుల ద్వారా బయటకొచ్చిన ఈ సినిమాను ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
యూవీ క్రియేషన్స్ తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. “ఈసారి వేట మరింత సరదాగా ఉండబోతోంది, ఎపిక్ ఎంటర్ టైన్ మెంట్ రాబోతోంది” అంటూ ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు.
ఇదొక ఇండో-కొరియన్ హారర్ కామెడీ. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఈ సినిమాలో కూడా డిఫరెంట్ మేకోవర్ లో కనిపించబోతున్నాడు వరుణ్.
గతేడాది మొత్తం ఫ్లాపులు చూశాడు ఈ హీరో. ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలు ఆడలేదు. దీంతో ఈ కొత్త సినిమాతో కొత్త ఏడాదిలో సక్సెస్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
ఇప్పటి వరుకు వేరేవి తీసాడా.. ? ఓహ్. నాకు తెలీదు..
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
maaku nammakam ledu dora
All the best
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు,రెండు, ఐదు, ఐదు