సైఫ్ ను పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను అతని ఇంటిలోనే కత్తితో పొడిచి చంపిన దుండుగుల్ని పోలీసులు పట్టుకున్నారు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను అతని ఇంటిలోనే కత్తితో పొడిచిన దుండుగుల్ని పోలీసులు పట్టుకున్నారు. కొద్దిసేపటికిందట ముంబయిలో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి, పూర్తి వివరాల్ని వెల్లడించారు.

సైఫ్ పై కత్తితో దాడిచేసి పొడిచిన వ్యక్తి బంగ్లాదేశ్ కు చెందిన పౌరుడు. అతడు అక్రమంగా భారత్ లోకి చొరబడ్డాడు. బిజోయ్ దాస్ గా పేరు మార్చుకొని తిరుగుతున్నాడు. అతడి అసలు పేరు మహ్మద్ షరీపుల్ ఇస్లాం షాజాద్. 4 నెలలుగా ముంబయిలో అక్రమంగా నివశిస్తున్నాడు. ఓ బార్ లో కూడా పనిచేసి ఇటీవల మానేశాడు.

డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ ఈ వివరాల్ని మీడియాకు వెల్లడించారు. అతడి దగ్గర భారతదేశానికి చెందిన ఎలాంటి ఆధారాలు లేవని, అతడు బంగ్లా పౌరడని వెల్లడించాడు. హత్యా నేరంతో పాటు, పాస్ పోర్టు చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదుచేస్తామన్నారు. నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని, సైఫ్ ఇంట్లో దొంగతనం కోసం అతడు ప్రవేశించినట్టు వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, ఈ కేసుతో అతనికి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. సీసీటీవీలో ఉన్న వ్యక్తి పోలికలతో ఇతడు ఉన్నాడు. పూర్తిస్థాయిలో విచారణ చేసి 5 గంటల తర్వాత అతడ్ని విడుదల చేశారు. దీంతో కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయింది.

సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు జరపగా, ఓ షాపులో మొబైల్ ఫోన్ కు కవర్ కొనుగోలు చేస్తూ కనిపించాడు షాజాద్. దాని ఆధారంగా దర్యాప్తు చేసి, అతడి నివాసాన్ని కనుగొన్నారు. అయితే అప్పటికే మొబైల్ స్విచాఫ్ చేసిన షాజాద్, తన గదికి కూడా వెళ్లకుండా దాక్కున్నాడు. చివరికి మడ అడవుల్లో అతడ్ని గుర్తించి, అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు కొలిక్కి వచ్చినట్టయింది.

One Reply to “సైఫ్ ను పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.