గత పదేళ్లుగా కనపడని ప్యాక్షన్ మళ్లీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనిపిస్తోందా? అంటే “ఔననే” సమాధానం వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, కదిరి, పెనుగొండ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్న తీరును చూస్తే అలాగే కనిపిస్తోంది. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలో కురబ లింగమయ్య అనే వైసీపీ కార్యకర్త హత్యకు గురికావడంతో అనంతపురం రాజకీయాలు వేడెక్కాయి.
కొంత మంది పెద్ద నాయకులే ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల వద్దకు వెళ్లి రాళ్ల దాడులు, ఆస్తుల విధ్వంసం చేయిస్తుంటే అధికార పార్టీ కార్యకర్తలు సైలెంట్‌గా ఉంటున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో, ఉగాది సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా లింగమయ్యపై టీడీపీ నేతలు దాడి చేయగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ వేడి తారా స్థాయికి చేరుకుంది. హత్య వెనుక ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల హస్తం ఉందని మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాలుగు రోజుల క్రితమే స్థానిక సంస్థల ఉపఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తొపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి ప్రయత్నించారు. గొడవలు జరిగినప్పుడు పోలీసులు ఇరువైపులా చర్యలు తీసుకోకపోతే మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత పదేళ్లుగా రాయలసీమలో ప్యాక్షన్ కనిపించకుండా పోలీసులు, నాయకులు గట్టిగా ప్రయత్నించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ హత్యలు పెరిగిపోయాయని వైసీపీ ఆరోపిస్తోంది.
పది రోజుల క్రితం కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ కార్యకర్తను ప్రత్యర్థులు హత్య చేశారు. రెండు రోజుల క్రితం చిత్తూరులో ఎమ్మెల్యే అనుచరులు వైసీపీ కార్యకర్త ఇంటికి వెళ్లి, చిన్న పిల్లలు, మహిళలు ఉన్నా చూడకుండా ఇంటిని ధ్వంసం చేసి, ఆయనపై దాడి చేసిన ఘటన తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలవుతోందన్న చర్చ నడుస్తోంది.
ఈ హింసతో పెట్టుబడులు రాష్ట్రానికి ఎలా వస్తాయి?
అధికారం ఉన్నా లేకపోయినా పెద్ద నాయకులకు ఎలాంటి భయం ఉండదు. కానీ నాయకులు తమ అధికారం కోసం రెచ్చగొట్టిన.. కార్యకర్తలు తమ కుటుంబాల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్యాక్షన్ నిర్మూలించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ఈసారి మాత్రం ఆయన వీటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నారు. అనంతలో కానీ, రాష్ట్రంలో కానీ ప్యాక్షన్ నిర్మూలన జరిగితేనే రాష్ట్రం ప్రగతి దిశగా అడుగులు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Now AP is worst than Bihar..if the govt stop freebees our people may go to Bihar for daily wages works..
నేను ఎప్పుడో చెప్పాను . ఇది మా జగన్ అన్న ప్లాన్, ఏమీ పీకుంటారో పిక్కోండి. 1. మత కలహాలు 2. కులాలు మధ్య కొట్లాట 3. నైజీరియా గాంగ్స్ తో స్కూల్స్, కాలేజెస్ దగ్గర డ్రగ్స్ పంచడం . 4. కడప గాంగ్స్ తో హత్యలు 5. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు 6. ముంబై రెడ్లైట్ ఏరియా వాళ్ళను ఆంధ్ర కు తీసుకు వచ్చి వ్యభిచారం, 7. కలకత్త గాంగ్స్ తో ఇళ్ళలో దొంగతనలు.
Elanti daridrapu alochanalu yellow media/ TDP media chesi ..dani Jagan mididki toyadam mi bathuku teruvu ani andiriki telusu..chi mi bhathukulu cheda ..enthaku dhiga jaruthunnaru ra..
This is what Visionary rule that people flocked to elect. They need to reap the results of this shameless redbook rule.