వ‌చ్చే సంక్రాంతికి గుంత‌లు లేని రోడ్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే సంక్రాంతికి గుంత‌లు లేని రోడ్లు వేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు. అన‌కాప‌ల్లి జిల్లాలోని వెన్నెల‌పాలెంలో శ‌నివారం గుంత‌లు లేని రోడ్ల‌కు సీఎం శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ గుంత‌లు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే సంక్రాంతికి గుంత‌లు లేని రోడ్లు వేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు. అన‌కాప‌ల్లి జిల్లాలోని వెన్నెల‌పాలెంలో శ‌నివారం గుంత‌లు లేని రోడ్ల‌కు సీఎం శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ గుంత‌లు రోడ్లు న‌ర‌కానికి ర‌హ‌దారుల‌న్నారు. గుంత‌ల రోడ్ల‌లో మ‌హిళ‌ల‌కు కాన్పులు అయ్యాయ‌ని ఆయ‌న వెట‌క‌రించారు.

గుంత‌లు లేని రోడ్లే త‌మ ధ్యేయ‌మ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా గుంత‌లు రోడ్లు క‌న్పించ‌డానికి గ‌త పాల‌కులు చేసిన దుర్మార్గ పాల‌నే కార‌ణ‌మ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో కేవ‌లం రూ.1000 కోట్లు మాత్ర‌మే రోడ్ల‌కు ఖ‌ర్చు పెట్టింద‌ని చంద్ర‌బాబు అన్నారు. గ‌త ఐదేళ్ల‌లో గుంత‌ల రోడ్ల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయార‌న్నారు. అయిన‌ప్ప‌టికీ గ‌త ప్ర‌భుత్వం రోడ్ల‌ను ప‌ట్టించుకోలేద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

మంచి రోడ్లు నాగరికతకు చిహ్నమని చంద్ర‌బాబు అభివ‌ర్ణించారు. అభివృద్ధికి ఆనవాళ్లు మంచి రహదారులన్నారు. వచ్చే సంక్రాంతికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలని ఆయ‌న ఆదేశించారు. గతంలో వ‌ర్షం వ‌స్తే రోడ్లు స్విమ్మింగ్ ఫూల్‌ను తలపించాయ‌ని విమ‌ర్శించారు. రౌడీ రాజకీయాలు వద్దన్నారు. అభివృద్ధి రాజకీయాలు ముద్దు అని చంద్ర‌బాబు అన్నారు.

రాష్ట్రంలో అధికారం మారిన నేప‌థ్యంలో మంచి రోజులు వ‌చ్చాయ‌న్నారు. డ‌బ్బులు ఊరికే రావ‌ని, సంప‌ద సృష్టిస్తే వ‌స్తాయ‌న్నారు. రాష్ట్ర ఖ‌జానాలో డ‌బ్బులు లేవ‌న్నారు.

11 Replies to “వ‌చ్చే సంక్రాంతికి గుంత‌లు లేని రోడ్లు”

  1. He is CM earlier for 3 Terms. TDP Ruled 21 Years in total with no Caronal like situation. in last 5 years did any one removed already existing roads with BullDozer. For this went in helicopters just for road repair work to start and not went to start/ inaguarate to build a brand new road. 100% true that the cost of that road repair work is far less than Cost of their Air travel expenses in this occasion.

  2. ఏం పర్లేదు వేరే రాష్ట్రాల రోడ్లు చూపించి రోడ్లు బాగోలేదు అని ప్రచారం చేస్తారు పేటిఎం కార్మికులు..

Comments are closed.