పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జనసేనాని. ఆయన నిన్న మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం పెట్టారు. సరిగ్గా ఆ టైమ్ లో కరెంట్ పోయింది. దాంతో సెల్ ఫోన్ వెలుగులో ప్రెస్ మీట్ ని కంటిన్యూ చేసినట్లుగా ఫోటోలు మీడియాకు వదిలారు.
దీని మీద వైసీపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అయితే మాట్లాడుతూ పవర్ స్టార్ పవర్ ఆపేసి మరీ మా మీద బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. ఏపీలో ఏ మూలన చూసినా కూడా పవర్ హాలీడేస్ ఎక్కడా లేవు, కోతలు అంతకంటే లేవని ఈ మధ్యనే స్పష్టంగా ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
అలాంటిది మొత్తం ఊరంతా కరెంట్ ఉంటే పవర్ ఆఫీస్ లో ఉండకపోవడమేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కావాలని తమ ఆఫీసులో కరెంట్ ని ఆపేసి వైసీపీని జనంలో బదనాం చేసే రాజకీయం ఇది అని మంత్రి మండిపడుతున్నారు.
ఇలాంటి చేష్టలను టీడీపీ కూడా చేస్తూ వచ్చిందని ఆయన అంటున్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పవర్ ని అందించడంతో తమ ప్రభుత్వం ముందుందని, కానీ ప్రజలకు మేలు చేయడాన్ని సహించలేని విపక్షాలు ఇలాంటి ప్రయంత్నాలు చేయడం దారుణమని ఆయన అంటున్నారు.
మొత్తానికి పవర్ పాలిటిక్స్ కోసం పవర్ ఆపేస్తున్న విపక్షాలు అని వైసీపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. పవర్ కావాలంటే అది దక్కాలంటే ఇది కాదు పద్ధతి అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం జనసేన నాయకులు తమ ఆఫీసులో పవర్ కావాలనే ఆపేయించారా అన్నదే ఇపుడు అందరి మదిలో దొలుస్తున్న ప్రశ్న. జవాబు రేపో మాపో జనసేన వారే చెప్పాలి.