పవన్ చేతగానితనంతో పుట్టిన కొత్త పార్టీ!

జనసేన ని పవన్ కళ్యాణ్ చేతగానితనం పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయ పార్టీ అవతరించింది. ఇన్నాళ్లూ తమ పార్టీ అధినేతగా భావించిన పవన్ కళ్యాణ్, రాబోయే ఎన్నికల్లో తానైనా గెలుస్తానో లేదో…

జనసేన ని పవన్ కళ్యాణ్ చేతగానితనం పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయ పార్టీ అవతరించింది. ఇన్నాళ్లూ తమ పార్టీ అధినేతగా భావించిన పవన్ కళ్యాణ్, రాబోయే ఎన్నికల్లో తానైనా గెలుస్తానో లేదో అనే అపనమ్మకం, భయం మధ్య తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుని లాభపడడానికి ప్రయత్నిస్తూ ఉంటే.. గత ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన ఒక అభ్యర్థి మాత్రం ఎంచక్కా సొంత పార్టీ పెట్టేసుకున్నారు. 

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తన లక్ష్యం అని ఆయన అంటున్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి నాలుగేళ్లు తిరిగేసరికినా సొంత పార్టీ పెట్టుకోవడం అంటే పాత పార్టీ నాయకుడు మీద అపనమ్మకమే అని చెప్పక తప్పదు. 

మాటలు వల్లించడం తప్ప పవన్ కళ్యాణ్ కార్యశూరత ఏమాత్రం లేదని అర్థమైన పుంగనూరు నియోజకవర్గం అసెంబ్లీ జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్, ఇప్పుడు సొంత పార్టీ పెట్టారు. భారత చైతన్య యువజన పార్టీ అని దానికి నామకరణం చేశారు. గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ  ఎదురుగా పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించారు.

రామచంద్ర యాదవ్ అంటే పుంగనూరులో ఒక మోస్తరు బలం ఉన్న నాయకుడు. పారిశ్రామికవేత్త. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకున్నారు. అప్పటినుంచి ప్రజా ఉద్యమాలు ఆందోళనలతో ఆయన చాలా చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఆయనకు స్థానికంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఆపద మాత్రం తప్పడం లేదు. 

రామచంద్ర రావు యాదవ్ ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించబోతున్నా సరే, దానిని అడ్డుకోవడం ఆయనను ఇల్లు కదలనివ్వకుండా గృహనిర్బంధం చేయడం లాంటివి పుంగనూరులో చాలా సహజంగా మారాయి. ఏ ఒక్క సందర్భంలోనూ కూడా తన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ కు అనుకూలంగా పవన్ కళ్యాణ్ గళమెత్తిన సందర్భాలు లేవు. వీటితో విసిగివేసారిపోయిన రామచంద్ర యాదవ్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.

ప్రస్తుతం చాలా సంక్లిష్టంగా మారిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో, రామచంద్ర యాదవ్ పెట్టిన చిన్న పార్టీ ఎంత ఫలితం సాధిస్తుందనినేది.. తర్వాత సంగతి. కాకపోతే కార్యకర్తలకు అండగా నిలవలేని, వారిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ చేతకానితనానికి మాత్రం ఇది నిదర్శనం అనుకోవాలి. పవన్ కల్యాణ్ అలాంటి వైఖరి వల్లనే ఈ పార్టీ పుట్టిందని అర్థం చేసుకోవాలి.