మీడియా దిగ్గజం రామోజీ రావు అస్తమయం!

తెలుగు మీడియా మొఘల్ గా అందరూ పిలుచుకునే రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. మార్గదర్శి, ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా.. తెలుగు మీడియా గమనాన్ని సమూలంగా మార్చేసిన దార్శనికుడిగా ఆయనకు పేరుంది. Advertisement…

తెలుగు మీడియా మొఘల్ గా అందరూ పిలుచుకునే రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. మార్గదర్శి, ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా.. తెలుగు మీడియా గమనాన్ని సమూలంగా మార్చేసిన దార్శనికుడిగా ఆయనకు పేరుంది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత ఇబ్బంది రావడంతో ఆయనకు ఇటీవల స్టంట్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో ఒక ప్రెవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 4.50 గంటలకు ఆయన కన్నుమూశారు. 

రామోజీరావు అంటే తెలుగు జర్నలిజం తీరుతెన్నులను సమూలంగా మార్చేసిన మహనీయుడు. పత్రికలు అనేవి సిద్ధాంతపరమైన విషయాలను, సాహిత్యాంశాలను మాత్రమే చర్చిస్తూ ఉండే వేదికలుగా ఉండే దశ నుంచి.. మారుమూల పల్లెల్లో ఉండే ప్రజల సమస్యలను కూడా ప్రముఖంగా ప్రస్తావించే విధంగా తెలుగు పత్రికలను ఆయన మార్చేశారు. ఈనాడు పత్రికను స్థాపించడంతో తెలుగు జర్నలిజం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి.
 
జిల్లా పత్రికలు స్థాపించడం అనేది ప్రజల సమస్యలకు మరింత విశాలమైన వేదికను ఏర్పాటు చేయడం అయింది. జిల్లా పత్రికలు అనేవి.. భారతదేశపు పత్రికారంగంలోనే ఒక పెద్ద మార్పు. ఆ ఫార్మాట్ ను దాదాపుగా దేశంలోని అన్ని పత్రికలు అనుసరించవలసి వచ్చింది. 

చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి రకరకాల వ్యాపారాలు చేస్తూనే.. మీడియా మొఘల్ గా ఎదగడంలో రామోజీరావు కృషి ఎంతో ఉంది. పట్టుదలకు, కఠోర పరిశ్రమకు ఆయనను ప్రతిరూపంగా చెబుతారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు ఆయన కట్టుబడే ఉన్నారు. సమాజానికి మంచి అని తాను అనుకున్నది మాత్రమే చేశారు. అలాంటి మహనీయుడికి గ్రేట్ ఆంధ్ర నివాళి అర్పిస్తోంది.