అంత తూచ్.. నేను అలా అనలేదు.. రాపాక

రాజోలు జ‌న‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే రాపాక త‌న‌ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో దొంగ ఓట్లతో నాకు మెజార్టీ వ‌చ్చింటూ మాట్లాడిన వీడియో రాజ‌కీయంగా తీవ్ర దూమారం రేగ‌డంతో దానిపై వివ‌ర‌ణ ఇచ్చారు.  Advertisement ఆయ‌న ఈ…

రాజోలు జ‌న‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే రాపాక త‌న‌ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో దొంగ ఓట్లతో నాకు మెజార్టీ వ‌చ్చింటూ మాట్లాడిన వీడియో రాజ‌కీయంగా తీవ్ర దూమారం రేగ‌డంతో దానిపై వివ‌ర‌ణ ఇచ్చారు. 

ఆయ‌న ఈ రోజు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ..'నా వాక్యాలను కొందరు వక్రీకరిస్తున్నారని.. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల ఘ‌ట‌న‌ను న‌వ్వుకోవాడానికి మాత్ర‌మే చెప్పాన‌ని.. అన్ని కులాలు వారు నాకు ఓట్లు వేయాడంతోనే ఎమ్మెల్యే అయ్యాన‌ని.. నవ్వుకోవడానికి అల మాట్లాడాన‌ని.. సీరియస్ గా చెప్పింది కాదని లైట్ తీసుకున్నారు'. వైర‌ల్ అయిన మొత్తం వీడియోను కూడా విడుద‌ల చేసి వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇటీవ‌ల ఓ స‌మావేశంలో ‘‘చింతలమోరిలో మా ఇంటి దగ్గర బూత్‌లో కాపుల ఓట్లు ఉండవు. అన్నీ ఎస్సీల ఓట్లే ఉంటాయి. ఎవరో ఎవరికీ తెలిదు. సుభాష్‌తో పాటు వీళ్లంతా జట్టుగా వచ్చి ఒక్కక్కరు దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయేవాళ్లు. పదిహేను, ఇరవై మంది వచ్చేవాళ్లు, ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేవాళ్లు. ఏకంగా ఈ ఓట్ల వల్ల 800 ఓట్ల వందల మెజార్టీ వచ్చింది’’ అంటూ మాట్లాడడంతో తీవ్ర దూమారం రేగింది.

కాగా రాపాక చేతిలో ఓడిన టీడీపీ అభ్యర్థి దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఇప్ప‌టికే ప్రకటించారు. ఫిర్యాదు అందితే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.