వారికి సిగ్గు, శ‌రం, ఆత్మాభిమానం వుంటే…ఆర్జీవీ ఘాటు ట్వీట్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ద‌ర్శ‌కుడు ఆర్జీవీ మండిప‌డ్డారు. వారాహియాత్ర రెండో ద‌శలో భాగంగా ఏలూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో వాలంటీర్ల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంపై ఆర్జీవీ ట్విట‌ర్ వేదిక‌గా ఘాటు కామెంట్స్ చేశారు. ప‌వ‌న్‌పై…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ద‌ర్శ‌కుడు ఆర్జీవీ మండిప‌డ్డారు. వారాహియాత్ర రెండో ద‌శలో భాగంగా ఏలూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో వాలంటీర్ల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంపై ఆర్జీవీ ట్విట‌ర్ వేదిక‌గా ఘాటు కామెంట్స్ చేశారు. ప‌వ‌న్‌పై క్రిమిన‌ల్ కేసు పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వాలంటీర్ల‌కు సిగ్గు శ‌రం, శ‌రం, ఆత్మాభిమానం వుంటే అంటూ ఆయ‌న వారిని ప‌వ‌న్‌పై ఉసిగొల్పారు. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరోప‌ణ‌ల‌కన్నింటికీ చ‌రిత్ర‌లో ప‌వ‌న్ ఆరోప‌ణ ప‌రాకాష్ట‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఆర్జీవీకి కోపం తెప్పించిన ప‌వ‌న్ కామెంట్స్ గురించి ముందు తెలుసుకుందాం. ఏలూరు స‌భ‌లో ప‌వ‌న్ ఏమ‌న్నారంటే… “వాలంటీర్లు ప్ర‌తి గ్రామంలో ఎవ‌రు ఎవ‌రి మ‌నిషి? ఏ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వితంతువులు ఉన్నారా లేదా? ప్ర‌ధానంగా ఒంట‌రి మ‌హిళ‌లే ల‌క్ష్యంగా  వివ‌రాల్ని సేక‌రించి సంఘ విద్రోహ శ‌క్తుల‌కి చేర‌వేస్తున్నారు. వాలంటీర్లు హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌కి పాల్ప‌డుతున్నారు” అని దారుణ విమ‌ర్శ‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న మార్క్ ట్వీట్ల‌తో కౌంట‌ర్ ఇచ్చారు. ఆర్జీవీ రెండు వేర్వేరు ట్వీట్లు చేశారు. వాటి సంగ‌తి ఏంటో చూద్దాం.

“వైసీపీ ప్రభుత్వం మహిళల ట్రాఫికింగ్ చేస్తోంది  అనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోప‌ణ  చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ ఎవరి మీద చేసిన ఆరోపణలకన్నింటికీ పరాకాష్ట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఈ విషయం మీద ఆధారాలుంటే యాక్షన్ తీసుకోకుండా PK చెవిలో ఎందుకు చెప్పారు??”

“ప్రజల కోసం పని చేసే YCP వాలంటీర్లని  ప‌వ‌న్‌క‌ల్యాణ్ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచాతి నీచంగా అసహ్యంగా  వర్ణించబడ్డ ఆ వాలంటీర్లకి సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే వాళ్ళు  ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.. పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకి మొహాలెలా చూపెట్టగలరు?”

ఇలా సాగాయి ఆర్జీవీ ట్వీట్లు. ఆర్జీవీ ఉచిత స‌ల‌హాల‌ను తీసుకుని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వాలంటీర్లు క్రిమిన‌ల్ కేసులు పెడ‌తారా? లేదా? అనేది చూడాలి. మీడియా అటెన్ష‌న్ కోసం ప‌వ‌న్ వివాదాస్ప‌ద ప్ర‌సంగాల‌కు తెగ‌బ‌డుతున్నార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.