కాకినాడ పోర్టులో ఓడల్లోకి లోడ్ చేయబడే ప్రతి బియ్యం బస్తా కూడా పీడీఎస్ బియ్యమే, ఆ ప్రతి బియ్యం బస్తాను అలా అక్రమంగా స్మగ్లింగు చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే అనే స్థాయిలో.. చాలా పెద్ద రాద్ధాంతం చేశారు.
కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా చివరకు అంతా తుస్సుమంటోంది. కానీ మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం ఇంకా నిరాటంకంగా సాగుతోంది.
అటు విశాఖ పట్నం, ఇటు చెన్నై పోర్టుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ.. ఏపీ పీడీఎస్ బియ్యం మొత్తం స్మగ్టింగ్ దందాలో తరలిపోతున్నట్టుగా ప్రజలను నమ్మించడానికి కుటిల ప్ర్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం లేదా వారి మీద ఈగ వాలనివ్వని పచ్చమీడియా పనిగట్టుకుని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నదా అనే అనుమానం కలుగుతోంది.
పీడీఎస్ బియ్యాన్ని పేదలకు పంపిణీ చేసే వ్యవస్థ చాలా పటిష్ఠమైనది. గత ప్రభుత్వాల హయాంలో కూడా వ్యవస్థ పటిష్టంగానే ఉంది.
లబ్ధిదారుడు వచ్చి బయో మెట్రిక్ విధానంలో థంబ్ ఇంప్రెషన్ వేస్తేనే వారికి బియ్యం అందుతాయి. జగన్ సర్కారు ప్రత్యేకంగా.. ఇళ్ల వద్దకే తీసుకువెళ్లి అందించే ఏర్పాటు చేసింది. అది కూడా బయోమెట్రిక్ విధానం ద్వారా మాత్రమే. అంటే లబ్ధిదారులకు అందించకుండా బియ్యం అక్రమంగా తరలించారనే మాటకు ఆస్కారం లేనేలేదు.
లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని కిలో 10-12 రూపాయలకు అమ్ముకుంటే.. దానికి ఎవరేం చేయగలరు. ఆ బియ్యాన్ని ఎవరైనా కొనుక్కుని తిరిగి, తమకు కొంత లాభం పెట్టకుని అమ్ముకుంటే దానిని ఎంత పెద్ద నేరంగా చిత్రీకరించగలరు?
ఇలాంటివి జరిగినప్పుడు నేరం ఎవరిదని అనుకోవాలి?
1. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని వాడుకోకుండా.. దానిని పదిరూపాయలకు అమ్ముకునే పేదలు అనబడే లబ్ధిదారులది నేరమా?
2. పేదలు కూడా తినడానికి యోగ్యంగా భావించని నాసిరకం బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వానిది నేరమా?
3. ఒక కిలో బియ్యం పేదలకు ఇవ్వడానికి రూ.43.50 పెట్టి కొంటున్నామని చెబుతున్న ప్రభుత్వం.. దానిని తీసుకున్న ప్రజలు పదిరూపాయలకే అమ్ముకుంటూ ఉంటే.. అంత చవకరకం బియ్యానికి అంత డబ్బు తగలేస్తున్న ప్రభుత్వానిది నేరమా?
4. తమకు నచ్చని బియ్యాన్ని ఎవరైనా అమ్ముకుంటే దాన్ని కొని, మారుబేరానికి అమ్ముకునే వారిది నేరమా?
నేరం ఎవరిదో నిర్ధారించడం ఎలాగ? కానీ.. ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. బియ్యం స్మగ్లింగ్ అనే దానిని భూతద్దంలో చూపిస్తోంది. ఆ పాపం మొత్తం వైసీపీ వారిదే అని చెప్పడానికి ప్రయత్నిస్తోంది.
నిర్దిష్ట ఆధారాలు లేకుండానే బురద చల్లడమే పనిగా వ్యవహరిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.
You missed a logic .
if there are no buyers means no demand then people will stop taking ration rice as well. So govt saves money. Govt eventually change the police or direct credit in to Account .
Well said sir
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ‘‘రాష్ట్రానికి గూగుల్‌ను తీసుకువచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రతిసారి మీరు మీ సామర్ధ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు’’ అంటూ సీఎంను పవన్ పొగడ్తలతో ముంచెత్తారు.
You want enjoy 9010471199