ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. Advertisement ఎన్నికల్లో ఓటు వేసేందుకు…

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఎన్నికల్లో ఓటు వేసేందుకు చాలామంది హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లారు. వాళ్లంతా తిరుగు ప్రయాణం చేయడంతో బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి. బాపట్ల నుంచి హైదరాబాద్ కు కూడా అలా ఓ ప్రైవేట్ బస్సు బయల్దేరింది.

చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరుపేటి మీదుగా హైదరాబాద్ వెళ్తున్న అరవింద ట్రావెల్స్ ప్రైవేటు బస్సు, చిలకలూరిపేట మండలం పసుమర్రు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ, ప్రైవేట్ బస్సు ఢీకొట్టాయి.

క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటంలో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ తో పాటు నలుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. వీళ్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురున్నారు. నీలాయపాలెంకు చెందిన బ్రహ్మేశ్వరరావు, ఆయన భార్య లక్ష్మి, మనవరాలు శ్రీసాయి మృతి చెందారు.

వెంటనే స్పందించిన స్థానికులు బస్సులో ఉన్న ఇతర ప్రయాణికుల్ని కాపాడారు. ఈ ఘటనలో దాదాపు 25 మంది గాయపడ్డారు. బైపాస్ వర్క్ జరుగుతుండడం, రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడమే ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది.