చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీపై మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పవన్‌కల్యాణ్ ప్యాకేజీ కోసం చంద్రబాబుకు దాసోహం అవుతున్నారనే సంకేతాల్ని పంపడానికి వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా రాజకీయ దాడికి దిగారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో మొదలైన ప్యాకేజీ ఆరోపణ… తాజాగా మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌తో పీక్‌కు చేరిందని చెప్పొచ్చు.
బాబు, పవన్‌ల భేటీపై మంత్రి రోజా ట్వీట్ ముల్లుతో గుచ్చింది. పవన్‌తో పాటు జనసేన శ్రేణులు అబ్బా, అమ్మా అంటూ నొప్పితో బాధ పడే పరిస్థితి. జనసేనను గాయపరిచే రోజా ట్వీట్ ఏంటంటే… “విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే.. వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడు. చంద్రబాబు 11 మందిని చంపితే వెళ్లి ఆయన్ను పరామర్శిస్తాడు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే.. ప్యాకేజి నే గొప్పదా..!!” అని లాజిక్‌తో పవన్, చంద్రబాబులను బండకేసి బాదారు.
రోజా ప్రశ్నించినట్టుగా చంద్రబాబు 11 మందిని చంపితే వెళ్లి ఆయన్ను పవన్ పరామర్శించడం ఏంటి? ఇదెక్కడైనా వుంటుందా? అని ఎవరి మనసులోనైనా ప్రశ్న ఉదయిస్తుంది. అంతిమంగా ప్యాకేజీ కోసం పవన్‌కల్యాణ్ ఇంతలా దిగజారుతున్నాడని రోజా ఫినీషింగ్ టచ్ ఇవ్వడం విశేషం. పవన్‌పై రోజా ట్వీట్ అదుర్స్ అనే లెవెల్‌లో వుంది.
వైసీపీ రాజకీయ దాడి ఇలాగే కొనసాగితే… ఎన్నికల నాటికి జనసేనాని బద్నాం కావడం ఖాయం. పవన్ రాజకీయ వ్యవహార శైలి చంద్రబాబుకు దాసోహం అన్నట్టుగా ఉంది. దీంతో వైసీపీ ప్యాకేజీ విమర్శలకు బలం చేకూరుతోంది.